#AskSRK సెష‌న్‌లో బాలీవుడ్ బాద్‌షా షారూక్ ఖాన్‌

బాలీవుడ్ బాద్‌షా షారూక్ ఖాన్‌కి అంత‌ర్జాతీయంగా ఉన్న అభిమానుల గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఈ ఏడాది ‘పఠాన్’ చిత్రంతో ఈ ఏడాది పాన్ ఇండియా రేంజ్‌లో బిగ్గెస్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ సాధించి హిస్ట‌రీ క్రియేట్ చేశారాయ‌న‌. అంత పెద్ద స్టార్ అయిన‌ప్ప‌టికీ సోష‌ల్ మీడియా ద్వారా ఆయ‌నెప్పుడు త‌న అభిమానుల‌తో చాలా స‌న్నిహితంగా ఉంటుంటారు. ప్ర‌తీ నెల #AskSRK అనే పేరుతో ఆయ‌న ఫ్యాన్స్‌తో మాట్లాడుతుంటారు. వాళ్లు అడిగే ప్ర‌శ్న‌కు ఆయ‌న చ‌మ‌త్కారంగా స‌మాధానం చెబుతుంటారు. ఈ నేప‌థ్యంలో జూన్‌లో ఆయ‌న మ‌రోసారి #AskSRK సెష‌న్‌లో పాల్గొన్నారు.

* ‘జవాన్’ను చూడాలనుకుంటున్నా..

ఈ సాయంత్రం మీ ప్లానింగ్ ఏంటి? అని ఓ నెటిజ‌న్ అడిగిన ప్ర‌శ్న‌కు షారూక్ స‌మాధానం ఇస్తూ ‘అట్లీతో కలిసి ‘జవాన్’ సినిమాను చూడాలనుకుంటున్నాను’ అన్నారు.

* ఛాలెంజింగ్ మూవీ…

ప్రస్తుతం మీరు డంకీ, జవాన్ సినిమాలు చేస్తున్నారు. వీటిలో మీకు ఛాలెంజింగ్‌గా అనిపించిన సినిమా ఏది? అని అడిగితే.. జ‌వాన్ అని అందుకు కార‌ణం అందులో యాక్ష‌న్ స‌న్నివేశాలు ఎక్కువ‌గా ఉండ‌ట‌మేన‌ని అన్నారు.

* సెప్టెంబ‌ర్ 7న క‌లుద్దాం..

ఓ అభిమాని షారూక్ ఖాన్‌తో ‘జవాన్’ నుంచి ఓ ఫొటోను అయినా చూపించాలని రిక్వెస్ట్ చేయగా.. ‘తప్పకుండా సెప్టెంబర్ 7న కలుద్దాం’ అని సమాధానం చెప్పారు షారూక్.

* విజయ్ సేతుపతితో వర్కింగ్ ఎక్స్ పీరియెన్స్‌..

‘జవాన్’లో విలన్‌గా న‌టించిన విజ‌య్ సేతుప‌తితో వ‌ర్కింగ్ ఎక్స్‌పీరియెన్స్ గురించి ఓ అభిమాని అడిగిన‌ప్పుడు ‘విజయ్ సేతుపతి అద్భుతమైన నటుడు. నేనెంతో అభిమానించే నటుడు. జవాన్‌లో అత‌నితో న‌టించ‌టం ఓ కూల్ ఎక్స్‌పీరియెన్స్‌.