‘శాకుంతలం’… ఏప్రిల్ 14న వరల్డ్ వైడ్ గ్రాండ్ రిలీజ్

ప్యాషనేట్ ఎపిక్ ఫిల్మ్ మేక‌ర్ గుణ శేఖ‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న పౌరాణిక ప్రేమకథా చిత్రం ‘శాకుంతలం’. ఈ ఎపిక్ లవ్ స్టోరీలో సమంత, దేవ్ మోహన్ జంటగా నటించారు. ఈ విజువల్ వండర్ ప్ర‌పంచ వ్యాప్తంగా ఏప్రిల్ 14న రిలీజ్ అవుతుంది. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు పూర్త‌య్యాయి. కాళిదాసు ర‌చించిన అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా శాకుంత‌లంను రూపొందిస్తున్నారు గుణ శేఖ‌ర్‌. శ్రీ వెంకటేశ్వ‌ర‌క క్రియేష‌న్స్ దిల్ రాజు స‌మ‌ర్ప‌ణ‌లో గుణ టీమ్ వ‌ర్క్స్ బ్యానర్‌పై నీలిమ గుణ ఈ పాన్ ఇండియా చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

3D టెక్నాల‌జీతో విజువ‌ల్ వండ‌ర్‌గా తెలుగు, హిందీ, త‌మిళ‌, హిందీ, మ‌ల‌యాళ భాష‌ల్లో శాకుంత‌లం సినిమా ప్రేక్ష‌కుల‌ను అల‌రించ‌నుంది. ఈ మూవీ ప్ర‌మోష‌న్స్‌ను పెద్ద ఎత్తున ప్లాన్ చేస్తున్నారు దిల్‌రాజు, గుణ శేఖ‌ర్ అండ్ టీమ్‌. ఇప్ప‌టికే విడుద‌లైన ఈ సినిమా పాట‌లు, టీజ‌ర్‌కు ఎక్స్‌ట్రార్డిన‌రీ రెస్పాన్స్ వ‌చ్చింది. ఇప్పుడు మేక‌ర్స్ పాన్ ఇండియా రేంజ్‌లో భారీ ఎత్తున ఈ సినిమాను ప్రమోట్ చేయ‌టానికి భారీ ప్లాన్‌ను సిద్ధం చేశారు. రీసెంట్‌గా సమంత, గుణ శేఖర్, దిల్ రాజు సహా టీమ్ స‌భ్యులంద‌రూ శాకుంత‌లం ఫ‌స్ట్ కాపీని చూసి హ్యాపీగా ఫీల‌య్యారు. ఈ సంద‌ర్బంగా …

నిర్మాత నీలిమ గుణ మాట్లాడుతూ ‘‘సినిమా అంటే ప్యాషన్ ఉండే ఇద్ద‌రు వ్య‌క్తులు దిల్ రాజుగారు, గుణ శేఖ‌ర్‌గారు కాంబోలో సినిమా వ‌స్తే ఎలా ఉంటుందో అనే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మా శాకుంత‌లం. అన్‌కాంప్రమైజ్డ్‌గా నిర్మించాం. మ‌న సినిమా రేంజ్‌ను మ‌రో లెవ‌ల్‌కు తీసుకెళ్లేలా మా వంతు ప్ర‌య‌త్నం చేస్తున్నాం. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఫ‌స్ట్ కాపీ సిద్ధ‌మైంది. టీమ్ అందరం సినిమాను చూశాం. ఔట్ పుట్‌పై చాలా చాలా హ్యాపీగా ఉన్నాం. సినిమా రిలీజ్ కావ‌టానికి ఇంకా నెల రోజులు ఉండ‌గానే ఫ‌స్ట్ కాపీ రెడీ చేశాం. అది కూడా అన్నీ లాంగ్వేజెస్‌లో.. ఇక ప్ర‌మోష‌న‌ల్ యాక్టివిటీస్ స్టార్ట్ చేయ‌బోతున్నాం. మార్చి 15న పెద్దమ్మ తల్లిని దర్శించుకుని పూజా కార్యక్రమాలను నిర్వహించి ప్రమోషనల్ యాక్టివిటీస్ స్టార్ట్ చేస్తున్నాం. అక్క‌డి నుంచి కంటిన్యూగా శాకుంత‌లం సినిమాను పాన్ ఇండియా రేంజ్‌లో జ‌నాల్లోకి తీసుకెళ్లేలా ప్లాన్ చేశాం. ఈ వేస‌విలో మా వరల్డ్ ఆఫ్ శాకుంతలం ఫ్యామిలీ ఆడియెన్స్‌తో పాటు చిన్న పిల్ల‌ల‌ను సైతం మెస్మ‌రైజ్ చేస్తుంది. ప్ర‌తి ఫ్రేమ్ వావ్ అనిపించేంత గొప్ప‌గా, అందంగా ఉంటుంది. ఏప్రిల్ 14న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున శాకుంతలం సినిమా రిలీజ్ చేస్తున్నాం’’ అన్నారు.

మెలోడి బ్ర‌హ్మ మ‌ణిశ‌ర్మ సంగీతం అందిస్తోన్న శాకుంత‌లం చిత్రానికి సాయి మాధ‌వ్ బుర్రా సంభాష‌ణ‌లు అందించారు. శేఖ‌ర్ వి.జోసెఫ్ సినిమాటోగ్ర‌ఫీ అందిం,గా ప్ర‌వీణ్ పూడి ఎడిట‌ర్‌గా వ‌ర్క్ చేస్తున్నారు.

స‌మంత, దేవ్ మోహ‌న్ జంట‌గా న‌టించిన శాకుంత‌లం చిత్రంలో డా.ఎం.మోహ‌న్ బాబు, ప్ర‌కాష్‌ రాజ్‌, మ‌ధుబాల‌, గౌత‌మి, అదితి బాల‌న్‌, అన‌న్య నాగ‌ళ్ల‌, జిస్సు సేన్ గుప్తా కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కుమార్తె అల్లు అర్హ యువ‌రాజు భ‌ర‌తుడి పాత్ర‌లో న‌టించ‌టం వ‌న్ ఆఫ్ ది హైలైట్.