Paraak: రోరింగ్ స్టార్ శ్రీమురళి ‘పరాక్’ అఫీషియల్ గా లాంచ్

శ్రీమురళి చిత్రం ‘పరాక్’ శ్రీ బండే మహాకాళి ఆశీస్సులతో ప్రారంభమైంది యంగ్ ఫిల్మ్ మేకర్ హలేష్ కోగుండి శ్రీమురళి కొత్త చిత్రం ‘పరాక్’ కు దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీమురళి తొలిసారి దర్శకుడు హలేష్ కోగుండితో ‘పరాక్’ కోసం జతకట్టారు.

బగీరా విజయం తర్వాత, రోరింగ్ స్టార్ శ్రీమురళి ‘పరాక్’ కు సైన్ అప్ చేశారు. ఈ చిత్రం  ముహూర్త వేడుక ఈరోజు బెంగళూరులోని బండి మహాకాళి ఆలయంలో జరిగింది, చన్నగిరి ఎమ్మెల్యే శివగంగ బసవరాజు ప్రారంభోత్సవం సందర్భంగా క్లాప్ కొట్టి, చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు.

శ్రీమురళి విలేకరులతో మాట్లాడుతూ..“పరాక్ ఒక వింటేజ్ స్టైల్ సినిమా. నా నెక్స్ట్ ప్రాజెక్ట్ కథ ఎంచుకోవడానికి దాదాపు 200 స్క్రిప్ట్‌లను విన్నాను. నేను గత రెండు సంవత్సరాలుగా ‘పరాక్’ టీంతో ప్రయాణించాను. ఈ నెల నుండి షూటింగ్ ప్రారంభమవుతుంది. చరణ్ రాజ్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తారు.

‘పరాక్’ చిత్రానికి హలేష్ కోగుండి దర్శకత్వం వహిస్తారు. కొన్ని షార్ట్ ఫిలిమ్స్ కి  పనిచేసిన తర్వాత ‘పరాక్’ అతని తొలి ఫీచర్ ఫిల్మ్. ఈ చిత్రాన్ని బ్రాండ్ స్టూడియోస్ నిర్మిస్తోంది.

చరణ్ రాజ్ సంగీతం అందిస్తారు, సందీప్ వల్లూరి సినిమాటోగ్రఫర్, ఉల్లాస్ హైదూర్ ఆర్ట్ డైరెక్టర్.  ఇంచార సురేష్ కాస్ట్యూమ్స్ డిజైనర్. త్వరలోనే మరిన్ని వివరాలు తెలియజేస్తారు మేకర్స్.

Why YCP Leaders Suddenly Support Chiranjeevi: Tulasi Reddy | Jagan | Pawan Kalyan | Telugu Rajyam