ఈసారి సరికొత్తగా సూపర్ నేచురల్ ట్విస్ట్‌తో జీ5 సరికొత్త మ్యాడ్‌నెస్‌కు తలుపులు తెరిచింది. పాపులర్ హారర్ కామెడీ ‘డెవిల్స్ డబుల్’ ఇది ‘ డీడీ నెక్ట్స్ లెవల్’గా అందరికీ సుపరిచితమైన సంగతి తెలిసిందే. ‘దిల్లుకు దుడ్డు’లో ఫ్రాంచైజీలో నాలుగో భాగం ఎక్స్‌క్లూజివ్‌గా తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో కేవలం జీ5లో మాత్రమే స్ట్రీమింగ్‌కు సిద్ధంగా ఉంది. క్రియేటివ్ రైటర్, డైరెక్టర్ ఎస్.ప్రేమ్ ఆనంద్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. హాస్యాన్ని అద్భుతంగా పండించి ప్రేక్షకులను నవ్వుల్లో ముంచెత్తటంలో తనదైన ప్రత్యేకతను సంపాదించుకున్న సంతానం ఇందులో ప్రధాన పాత్రలో నటించారు. ఇంకా సెల్వ రాఘవన్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, గీతికా తివారి తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు.
ది షో పీపుల్, నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్ ఈ మూవీ సహ నిర్మాతలుగా వ్యవహరించారు. ఈ యాక్షన్ హారర్ కామెడీలో గందరగోళంతో పాటు ఆశ్చర్యపోయే కామెడీతో పాటు కాస్త చిన్నపాటి భయం కూడా ఉంటుంది. వ్యంగ్యం, స్లాప్‌స్టిక్ కామెడీ కలగలిసి వినోదాత్మకంగా సినిమాను రూపొందించారు. ఇది కచ్చితంగా ప్రేక్షకులను కచ్చితంగా ఎంటర్‌టైన్ చేస్తుంది. కథ విషయానికి వస్తే.. విమర్శనాత్మక స్వభావంతో వ్యవహరించే ఓ సినిమా రివ్యూవర్‌పై ఓ దర్శకుడు ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటాడు. అందువల్ల తనని ట్రాప్ చేయించి ఓ ప్లానింగ్ ప్రకారం శాపగ్రస్తమైన చిత్రంలో ఇరుక్కునేలా చేస్తాడు. ఓ మాయా డైరీ ఈ కథనాన్ని నియంత్రిస్తుంటుంది. అప్పుడు సదరు రివ్యూవర్ ప్రాణాంతకమైన ఆట నుంచి పోరాడి ఎలా బయటపడ్డాడనేదే సినిమా.
తన వాక్ చాతుర్యంతో సినిమాలకు రివ్యూలు చెప్పే కిస్సా (సంతానం)కు విచిత్రంగా ప్రవర్తించే దర్శకుడు హిచ్‌కాక్ ఇరుదయరాజ్(సెల్వరాఘవన్)..రహస్యంగా ఓ సినిమాను చూడటానికి వ్యక్తిగతంగా రమ్మని ఆహ్వానిస్తాడు. కిస్సా సాధారణంగా డ్రామాతో కూడిన సినిమా అనుకుని వస్తాడు. కానీ నిజానికి సినిమా అలా ఉండదు. ప్రొజెక్టర్ ఓసారి ఆన్ కాగానే, కిస్సా ప్రపంచం ఒక్కసారిగా తలకిందులుగా మారుతుంది. కొంతసేపటికి కిస్సా ఓ దెయ్యాలు, భూతాలు ఉండే క్రూయిజ్‌లో కన్ను తెరుస్తాడు. అక్కడ తర్కాలేవి పనిచేయవు. అక్కడ పాటించాల్సిన నియమాల గురించి ఓ మ్యాజికల్ డైరీలో రాసి పెట్టబడి ఉంటుంది.
అతనితో పాటు మరో ఇద్దరు రివ్యూవర్లు కూడా అందులో చిక్కుకుంటారు. దీంతో వారు డైరీలో విషయాలను డీకోడ్ చేయటానికి సిద్ధమవుతారు. అందులో భాగంగా అతింద్రీయ శక్తుల బలహీనతలు గుర్తించాలి. ఆ సమయంలో ఎదురయ్యే భయానక పరిస్థితులను దాటాలి. ఇంతటితో కథ ముగియదు. కిస్సా గర్ల్‌ఫ్రెండ్ కూడా ఓ ఆత్మగా మారిపోయుంటుంది. ఈ కథాగమనంలో హాస్యంతో నిండిన మలుపులు, రోలర్ కోస్టర్‌లాగా అనిపించే సన్నివేశాలతో నిండి ఉంటాయి. ‘డెవిల్స్ డబుల్: నెక్ట్స్ లెవల్’ అనేది హారర్, హాస్యం, అడ్వెంచర్‌తో నిండి ఉంది. ఓ సినిమా రివ్యూవర్ తను ఉన్న సినిమా రివ్యూ కథ నుంచి బయటపడ్డాడా.. ఈ కథలో తనే విలనా? సినిమా టైటిల్ కార్డ్స్ పడుతున్నప్పటికీ చివరకు ఎవరు ఏమవుతారనేదే సినిమా.
జీ5 తమిళ, మలయాళ భాషల బిజినెస్ హెడ్ మరియు సీనియర్ వైస్ ప్రెసిడెంట్ సౌత్‌మార్కెటింగ్ లాయిడ్ సి గ్జెవియర్ మాట్లాడుతూ ‘‘ZEE5 లో అత్యుత్తమ సినిమాలను మా ప్రేక్షకులకు అందించటాన్ని మేము గర్వంగా భావిస్తాం. డెవిల్స్ డబుల్: నెక్ట్స్ లెవల్ హక్కులను సంపాదించడం ద్వారా, విభిన్నమైన, ఆకర్షణీయమైన ప్రాంతీయ కంటెంట్‌ను అందించాలనే నియమాన్ని మేం పాటిస్తున్నామనే విషయం మరోసారి రుజువైంది. ది షో పీపుల్, నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్ నుంచి వచ్చిన ఈ హారర్-కామెడీ మూవీలోని థ్రిల్లింగ్ మూమెంట్లు, హాస్యం, విలక్షణమైన కథా శైలి ప్రేక్షకులకు ఓ ప్రత్యేకమైన అనుభూతినిచ్చింది. ఇలాంటి వైవిధ్యాన్ని ప్రేక్షకులకు అందించటం ద్వారా మాకు ప్రేక్షకులతో బలమైన అనుబంధం ఏర్పడుతుందనే నమ్మకముంది. దేశవ్యాప్తంగా సౌత్ కంటెంట్‌పై ఆదరణ పెరిగిన దశలో, ఈ సినిమా మా రీజనల్ కంటెంట్ లైబ్రరీలో భాగం కావటం ఎంతో విలువైనదిగా మేం భావిస్తాం. డెవిల్స్ డబుల్: నెక్ట్స్ లెవల్ మా కంటెంట్ ఖజానాకు కొత్త శక్తిని చేరుస్తుందని, అలాగే మా సబ్‌స్క్రైబర్లకు ఉత్తేజకరమైన అనుభవాన్ని అందిస్తుందని మేము ఖచ్చితంగా నమ్ముతున్నాం’’ అన్నారు.
రైటర్, డైరెక్టర్ ఎస్.ప్రేమ్ ఆనంద్ మాట్లాడుతూ ‘‘డీడీ నెక్ట్స్ లెవల్‌తో రొటీన్‌గా ఉన్న హారర్, కామెడీకి సినిమాలకు దక్కుతున్న ఆదరణ, వాటి హద్దులను చెరిపేయాలన్నదే నా లక్ష్యం. నవ్వించటంతో పాటు భయాన్ని కలిగించేలా ఒక అద్భుతమైన ప్రపంచాన్ని నిర్మించాలనుకున్నాను. అదే సమయంలో మా ‘సినిమా’కి కూడా ఓ పాత్ర ఉండాలనే ప్రయత్నంలో భాగంగా ఈ సినిమాను తెరకెక్కించాను. ది షో పీపుల్, నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మాతలతో కలిసి పని చేయడం ఆనందంగా ఉంది. సంతానం, సెల్వరాఘవన్, గౌతమ్ మీనన్, గీతికా తివారి లాంటి అద్భుత నటులతో కలసి పని చేయడం ద్వారా నేను ఎలాంటి సినిమానైతే చేయాలనుకున్నానో ఆ ఆలోచన విషయంలో ఖచ్చితంగా ఎలాంటి రాజీపడకుండా మేం తెరపైకి తీసుకురాగలిగామని భావిస్తున్నాను. జోనర్ సాంప్రదాయాల్ని మార్చుతూ, ప్రతి మలుపులో ఆశ్చర్యాలతో నిండిన సినిమాను తీర్చిదిద్దాం. ఈ జర్నీ అంతా ఎంతో ఆనందంగా సాగింది. ఇలాంటి వినూత్న సినిమా డిజిటల్ ప్రీమియర్‌కి ZEE5 లాంటి ఉత్తమమైన వేదిక దొరకడం నిజంగా గర్వకారణం. ఇది ఓ గ్లోబల్ స్టేజ్, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకుల దాకా ఈ సినిమాను చేర్చగలదు. ఇలాంటి మ్యాడ్‌నెస్‌ను ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులతో పంచుకోవడానికి నేను ఎంతో ఉత్సాహంగా ఉన్నాను. త్వరలోనే ‘నెక్స్ట్ లెవెల్’ మొదలవుతోంది!’’ అన్నారు.
నటుడు సంతానం మాట్లాడుతూ ‘‘ఇటీవల నేను చేసిన పాత్రల్లో కిస్సా పాత్ర నా కెరీర్‌లో అత్యంత వినోదభరితమైన, సృజనాత్మకంగా తృప్తి ఇచ్చింది. ఈ పాత్ర బోల్డ్‌గా ఉంటుంది, విలక్షణమైన పాత్ర. సినిమాలను విమర్శించే రివ్యూవర్ అనుకోకుండా తను ఇష్టంగా విమర్శించే సినిమాల్లాగే ఒక సినిమాలో చిక్కుకుంటాడు. ఈ మెటా మాడ్‌నెస్, హారర్-కామెడీలోని మలుపులు, హంగామా అన్నీ కలిపి, అసలైన ఫన్ రైడ్‌గా మారాయి. డెవిల్స్ డబుల్: నెక్ట్స్ లెవల్ ZEE5 లో ప్రీమియర్ అవుతున్నందుకు నేను చాలా ఎగ్జైటెడ్‌గా ఉన్నాను. ఇది ఫ్రెండ్స్, ఫ్యామిలీతో కలిసి చూసే సినిమా. లైట్లు ఆఫ్ చేసి, చేతిలో పాప్‌కార్న్ తీసుకుని ఎంజాయ్ చేయాల్సిన సినిమా. కామెడీ ప్రేక్షకుల అంచనాలను మించి ఉంటుంది. ఆల్ ఇన్ వన్ ప్యాకేజ్‌లాంటి మూవీ. మీరు తమిళ సినిమాలన్నీ చూసేశాం అనుకుంటే… ఈ సినిమా నిజంగా నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్తుంది అని నమ్మకంగా చెప్పగలను’’ అన్నారు.
జూన్13 నుంచి జీ5లో ఎక్స్‌క్లూజివ్‌గా స్ట్రీమింగ్‌కు సిద్ధమైన ‘డీడీ నెక్ట్స్ లెవల్’