రానా నాయుడు- వరల్డ్ వైడ్ గా మోస్ట్ వాచ్డ్ 10వ సిరీస్‌గా రికార్డ్

రానా నాయుడు నెట్‌ఫ్లిక్స్‌లో ఎక్స్ టార్డినరీ రెస్పాన్స్, అత్యదిక ఆడియన్స్ సంపాదించడం ద్వారా అరుదైన ఘనతను సాధించి గ్లోబల్ టాప్ 10 సిరీస్ లిస్ట్‌లో స్థానం సంపాదించుకుంది. రానా నాయుడు.. ఖాకీ: ది బీహార్ చాప్టర్ , యంగ్ అడల్ట్ షో క్లాస్ వంటి ఇతర భారతీయ సిరీస్‌లని అధిగమించి ప్రేక్షకులపై చెరగని ముద్ర వేసుకుంది.

ఈ సిరిస్ గణనీయ సంఖ్యలో వాచ్ అవర్స్ పొందింది.. తప్పక చూడాల్సిన సిరిస్ గా నిలిచింది. ముఖ్యంగా రానా నాయుడు తెలుగు మార్కెట్ నుంచి ఇద్దరు ప్రముఖ స్టార్స్ కలిగిన ఉన్న మొదటి నెట్‌ఫ్లిక్స్ సిరీస్.. వీరి స్టార్ పవర్ ప్రేక్షకులని అమితంగా ఆకర్షించింది.

మొదటి వారంలో రానా నాయుడు 8,070,000 వాచ్ అవర్స్ పొంది అత్యధికంగా వీక్షించిన నాన్ ఇంగ్లీష్ సిరీస్‌లలో పదవ స్థానంలో నిలిచింది . ఈ నెంబర్స్ విడుదలైన కొద్ది రోజుల్లోనే సాధించింది.