గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్, ఆయన పెట్ డాగ్ రైమ్ ఇప్పుడు ఇంటర్నెట్‌ని షేక్ చేస్తున్నారు. రామ్‌చరణ్ పెట్ డాగ్ రైమ్ ఇన్‌స్టాలో ఫాలోయింగ్ మామూలుగా ఉండదు. దాదాపు 50 వేల ఫాలోయర్స్ రైమ్‌కు ఉండటం విశేషం. నేషనల్ పెట్ డే సందర్భంగా రైమ్ మీద నెటిజన్స్ స్పెషల్ ఫోకస్‌పెట్టారు.
రామ్‌చరణ్, ఆయన సతీమణి ఉపాసన ఎప్పుడూ రైమ్ మీద ప్రేమను చూపిస్తూనే ఉంటారు. రైమ్ లేకుంటే అడుగుతీసి అడుగుపెట్టడానికి కూడా ఇష్టపడరు ఈ స్టార్ దంపతులు. ప్రపంచ నలుమూలల్లో ఎక్కడికి వెళ్లినా వారి వెంట రైమ్ ఉండాల్సిందే. హైదరాబాద్‌లో ఇంట్లో ఉన్నా పక్కన రైమ్ ఉండాల్సిందే.
RRR ప్రమోషన్ల టూర్లలోనూ రైమ్ సందడి చేసింది. ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ కోసం రామ్ చరణ్ ఢిల్లీ వెళ్లి అక్కడే ఉండి సినిమాను ప్రమోట్ చేశారు. అక్కడి నుంచి ఉత్తరాది అంతా సినిమా ప్రమోషన్స్‌తో బిజీగా ఉండిపోయారు. అక్కడి నుంచి తిరిగి వచ్చినప్పుడు రామ్‌చరణ్‌ని ఢిల్లీ ఎయిర్‌పోర్టులో రైమ్ ఎదురెళ్లి రామ్ వెల్‌కమ్ చెప్పి తన ఆనందాన్ని, సంబరాన్ని చూపించింది. రామ్ – రైమ్ ఇద్దరి మధ్య బాండింగ్ అభిమానులకు, ఫాలోవర్స్‌కు స్ఫెషల్‌గా అనిపించింది.
రామ్‌చరణ్ ఇంట్లో రైమ్‌గా పుట్టినా చాలు అని చాలా సార్లు అనుకున్నవారూ లేకపోలేదు. అంతటి అదృష్టం రైమ్‌ది. అదంటే అంతటి ప్రేమ రామ్‌చరణ్ – ఉపాసన దంపతులకు.