టెక్కు చూపించి.. ఫలితం అనుభవిస్తున్న రాజ్‌తరుణ్.!

ఎలాంటోడు.. ఎలాగైపోయాడు.? డైరెక్టరవుదామనుకుని హీరో అయ్యాడు రాజ్ తరుణ్. ‘ఉయ్యాల జంపాల’ సినిమాతో రాత్రికి రాత్రి స్టార్ అయిపోయిన రాజ్ తరుణ్ చేతిలో ఆ తర్వాత మంచి ప్రాజెక్టులే పడ్డాయ్. కానీ, అత్యుత్సాహంతో తన కెరీర్‌ని తానే చెడగొట్టుకున్నాడు.కథ దగ్గర్నుంచి అన్ని విషయాల్లోనే వేలు పెట్టేసి.. దర్శకుల క్రియేటివిటీని దెబ్బ తీశాడన్న ఆరోపణలు రాజ్ తరుణ్ మీద చాలానే వున్నాయ్.

తూచ్.. అవన్నీ దుష్ప్రచారాలేనని రాజ్ తరుణ్ చాలాసార్లు వివరణ ఇచ్చినా, ‘అతని పద్ధతి మారలేదు’ అని రాజ్ తరుణ్ ప్రతి సినిమా విషయంలోనూ గాసిప్స్ వస్తూనే వున్నాయ్.

దాదాపుగా కెరీర్ అవసాన దశకు వచ్చేసింది. యంగ్ హీరోలు చాలామంది రేసులో దూసుకెళుతున్నారు. దాంతో, చేసిన తప్పులకు ఇప్పుడు కుమిలిపోతున్నాడట. ఓ పెద్ద బ్యానర్ నుంచి కోవిడ్ తర్వాత బంపర్ ఆఫర్ వస్తే, ‘నో’ చెప్పిన రాజ్ తరుణ్, ఆ బ్యానర్ ఇంకో యంగ్ హీరోని అప్రోచ్ అయి హిట్టు కొట్టేసరికి కుమిలిపోతున్నాడట.

ఆ యంగ్ హీరో ఎవరు.? ఆ పెద్ద బ్యానరేంటి.? జస్ట్ సస్పెన్స్ అంతే.!