హైదరాబాద్, మార్చి 3, 2023: వన్ ఆఫ్ ది టాప్ మోస్ట్ డిజిటల్ కంటెంట్ ప్రొవైడర్స్‌లో తనదైన స్థానాన్ని దక్కించుకుంది జీ 5. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ, మరాఠీ, గుజరాతీ, బెంగాలీ సహా ఇతర భాషల్లో వైవిధ్యమైన కంటెంట్‌ను ప్రేక్షకులకు అందిస్తూ ఎంటర్‌టైన్ చేస్తోంది. ఇలా ప్రారంభం నుంచి ఆడియెన్స్‌కు కావాల్సినంత వినోదాన్ని అందిస్తూ వారి హృదయాల్లో తనదైన స్థానాన్ని దక్కించుకుంది జీ 5. పిక్ ఎలిఫెంట్ పిక్చర్స్ వారి కామెడీ డ్రామా ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ, అన్నపూర్ణ స్టూడియోస్ వారి లాసర్ 2 . బీబీసీ స్టూడియోస్, నార్త్ స్టార్ ఎంటర్టైన్‌మెంట్ కాంబోలో రూపొందిన గాలి వాన. ఇంకా రేసీ, హలో వరల్డ్, మా నీళ్ల ట్యాంక్, ఆహా నా పెళ్లంటతో పాటు రీసెంట్‌గా విడుదటైన ఏటీఎంతో పాటు పులి మేక కూడా ఆ వరుసలో చేరి ప్రేక్షకులను మెప్పిస్తోంది.
జీ 5, కోన ఫిల్మ్ కార్పొరేషన్ కలిసి రూపొందించిన పులి మేక ఒరిజినల్‌లో 8 ఎపిసోడ్స్ ఉన్నాయి. టీజర్, ట్రైలర్, గ్లింప్స్ ఇలా ప్రారంభం నుంచే క్యూరియాసిటీని క్రియేట్ చేసిన ఈ సిరీస్ ఇప్పటికే 75 మిలియన్స్ వ్యూయింగ్ మినిట్స్‌ను సాధించటం విశేషం.
పులి మేక సిరీస్‌లో ప్రారంభం నుంచి చివరకు ఉండే ట్విస్టులు, టర్నులను ప్రేక్షకులు తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ముఖ్యంగా లావణ్య త్రిపాఠి క్యారెక్టరైజేషన్ అందరినీ ఆకట్టుకుంటోంది. కిరణ్ ప్రభ అనే సిన్సియర్ అండ్ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా, నిజాన్ని ప్రపంచానికి తెలియజేయాలనుకునే వ్యక్తిగా ఆమె తనదైన నటనతో రోలర్ కోస్టర్‌లాంటి కథను ముందుకు తీసుకెళ్లింది.
స్టోరీ లైన్, ట్విస్టులు, కథలోని టెన్షన్, అంతర్లీనంగా ఉండే మెసేజ్, ఎంటర్‌టైన్‌మెంట్ వేల్యూ, నటీనటుల పెర్ఫామెన్సులు, సాంకేతిక నిపుణుల పని తీరు ఆకట్టుకుంటున్నాయి. ఇక చివరలో సెకండ్ సీజన్‌కు ఉంటుందని లీడ్ కూడా ఇచ్చారు. దీంతో ఆడియెన్స్లో ఎగ్జయిట్‌మెంట్ మరింతగా పెరిగింది. ఆది సాయికుమార్, గోపరాజు రమణ, సిరి హన్మంత్, రాజా చెంబోలు, నోయెల్ సేన్ ఇలా ప్రతీ పాత్రను ఆడియెన్స్ ఎంజాయ్ చేస్తున్నారు.
షో రన్నర్‌గా, రైటర్‌గా కోన వెంకట్ ఓ ప్రణాళిక ప్రకారం పులి మేక కథను రాశారు. ఉదాహరణకు క్లైమాక్స్‌లో ఉండే ముగింపు కోన వెంకట్‌గారి ఆలోచన విధానాన్ని చక్కగా ఎలివేట్ చేసింది. కమర్షియల్ ఫార్మేట్‌లో సాగే వైవిధ్యమైన వెబ్ సిరీస్‌గా పులి మేక సాగుతుంది.
నటీనటులు: కిరణ్ ప్రభగా లావణ్య త్రిపాఠి, ప్రభాకర్ శర్మగా ఆది సాయి కుమార్, అనురాగ్ నారాయణ్‌గా సుమన్, దివాకర్ శర్మగా గోపరాజు, కరుణాకర్ శర్మగా రాజా, పల్లవిగా సిరి హన్మంత్, ఆది సాయికుమార్ అసిస్టెంట్ వెంకట్ పాత్రలో ముక్కు అవినాష్, పాండు రంగారావుగా శ్రీనివాస్, శ్వేతగా స్పందన పల్లి నటిస్తున్నారు.
సాంకేతిక వర్గం:
బ్యానర్స్: జీ 5, కోన ఫిల్మ్ కార్పొరేషన్
కన్విన్సిడ్, క్రియేటెడ్: కోన వెంకట్
దర్శకుడు : చక్రవర్తి రెడ్డి.కె
సినిమాటోగ్రఫీ: రామ్ కె.మహేష్
ప్రొడక్షన్ డిజైన్: బ్రహ్మ కడలి
ఎడిటర్: ఛోటా కె.ప్రసాద్
స్టోరి రైటర్స్: కోన వెంకట్, వెంకటేష్ కిలారు
కాస్ట్యూమ్స్: నీరజ కోన
పాటలు: శ్రీజో
పి.ఆర్.ఒ: నాయుడు సురేంద్ర కుమార్ – ఫణి కందుకూరి (బియాండ్ మీడియా