Premistunnaa Movie Release Date: నవంబర్ 7న థియేటర్స్ “ప్రేమిస్తున్నా”.

Premistunnaa Movie Release Date: వరలక్ష్మీ పప్పుల ప్రజెన్స్ లో కనకదుర్గారావు పప్పుల నిర్మాతగా భాను దర్శకత్వంలో సరికొత్త ప్రేమకథతో రాబోతున్న సినిమా ప్రేమిస్తున్నా. సాత్విక్ వర్మ, ప్రీతి నేహా హీరో హీరోయిన్లు గా నటించారు.

పోస్ట్ ప్రొడక్షన్స్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ప్రేమిస్తున్నా సినిమా నవంబర్ 7న థియేటర్స్ లో విడుదల కానుంది.

ప్రేమిస్తున్నా చిత్రం నుండి సోల్ ఆఫ్ ప్రేమిస్తున్నా ను మేకర్స్ విడుదల చేశారు. 56 సెకెన్స్ నిడివి ఉన్న కంటెంట్ యువతను విపరీతంగా ఆకట్టుకొంటోంది. సినిమా ఎలా ఉండబోతోందో ఈ వీడియోలో చెప్పే ప్రయత్నం చేశారు చిత్ర యూనిట్. ఇంటెన్స్ లవ్ స్టోరీగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. స్వచ్ఛమైన ప్రేమకథతో రాబోతున్న ఈ సినిమాలో సాత్విక్ వర్మ, ప్రీతి నేహా పోటీపడి నటించారు. దర్శకుడు భాను ప్రేమిస్తున్నా సినిమాను న్యూ ఏజెడ్ లవ్ స్టోరీగా ఆడియన్స్ కు చూపించబోతున్నారు.

ఇటీవల విడుదలైన ఈ సినిమా సాంగ్స్ కు మంచి రెస్పాన్స్ లభించింది, యూట్యూబ్ లో మిలియన్ వ్యూస్ తో ప్రేక్షకాధారణ పొందింది.

ఈ సందర్భంగా దర్శకుడు భాను మాట్లాడుతూ… “అన్ కండీషనల్ లవ్ తో తెరకెక్కిన సినిమా ప్రేమిస్తున్నా. ఇప్పటివరకు తెలుగులో అంత అన్ కండీషనల్ లవ్ తో ఏ సినిమా రాలేదు, అద్భుతమైన పాటలు, పర్ఫార్మెన్స్ తో ఈ చిత్రం నవంబర్ 7న థియేటర్స్ లో విడుదల కానుంది. చాలా కాలం తరువాత వస్తోన్న బ్యూటిఫుల్ లవ్ స్టొరీ ఈ సినిమా, మేము విడుదల చేసిన సోల్ ఆఫ్ ప్రేమిస్తున్నా కు అన్ని వర్గాల ఆడియన్స్ నుండి సూపర్బ్ రెస్పాన్స్ లభిస్తోందని” అన్నారు.

ఇదొక మ్యూజికల్ లవ్ స్టొరీగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. భాస్కర్ శ్యామల ఈ సినిమాకు సినిమాటోగ్రఫీ అందించారు, అనిల్ కుమార్ అచ్చు గట్ల ఈ సినిమాకు సంభాషణలు రాయడం జరిగింది, ఈ సినిమాకు నిర్వహణ మర్రి రవికుమార్, ఎడిటర్ శిరీష్ ప్రసాద్.

Jubilee Hills Bypoll 2025: Public Opinion On Sunitha Vs Naveen | Telugu Rajyam