1996లో టబు, వినీత్, అబ్బాస్ నటించిన “ప్రేమదేశం” చిత్రం అందరికీ గుర్తు ఉండే ఉంటుంది. అప్పట్లో ఆ చిత్రంలోని పాటలు, కథ కథనాలు యువతను విపరీతంగా ఆకట్టుకుని ఉర్రూతలూగించింది. ఇందులో స్నేహానికి ప్రాముఖ్యత నిస్తూ ఎక్కడా వల్గారిటీ అనేది లేకుండా ఎంతో అద్భుతంగా తెరకెక్కించాడు దర్శకుడు ఖతిర్. ఈ సినిమా కోసం రెహమాన్ అందించిన సంగీతం ఇప్పటికి వినిపిస్తూనే ఉంటాయి. చాలా కాలం తర్వాత ఈ 2023 లో అదే టైటిల్ తో వస్తున్న “ప్రేమదేశం’ సినిమాకు మణిశర్మ తన బ్యాగ్రౌండ్ స్కోర్ తోను సంగీతం తోను అంతే ప్రాణం పోయడం విశేషం..అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకొన్న నేటి మ్యూజికల్ బ్లాక్ బస్టర్ “ప్రేమదేశం”చిత్రం ఫిబ్రవరి 3 న థియేటర్స్ లో సందడి చేయబోతుంది.ఈ చిత్రాన్ని .సిరి క్రియేటివ్ వర్క్స్ పతాకంపై శ్రీకాంత్ సిద్ధమ్ దర్శకత్వం వహిస్తుండగా యువ ప్యాషనేట్ ప్రొడ్యూసర్ శిరీష సిద్ధమ్ నిర్మిస్తున్నారు.
రఘు కళ్యాణ్ రెడ్డి, రాము లు అసోసియేట్ ప్రొడ్యూసర్స్ గా,కమల్, కిరణ్, రూపా, ఎగ్జిగ్యూటివ్ ప్రొడ్యూసర్స్ గా వ్యవహారిస్తున్న ఈ చిత్రంలో అలనాటి అందాలతార మధుబాల ప్రత్యేక పాత్రలో నటిస్తుంది. త్రిగున్, మేఘా ఆకాష్, మాయ, అజయ్ కతుర్వార్, కమల్ నార్ల తేజ, శివ రామచంద్ర లు నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన “ప్రేమదేశం” చిత్రంలోని పాటలకు మరియు టీజర్ కు ప్రేక్షకులనుండి అద్భుత మైన రెస్పాన్స్ వస్తుంది. ఫిబ్రవరి 3 న గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్న సందర్బంగా చిత్ర యూనిట్ హైదరాబాద్ లోని పార్క్ హయత్ హోటల్ లో ప్రి రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా జరుపుకుంది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, హిట్ 2 డైరెక్టర్ శైలేష్ కొలను, బ్యూటిఫుల్ యాక్ట్రెస్ మధుబాల తదితరులు ముఖ్య అతిధులుగా పాల్గొని చిత్ర యూనిట్ ను బ్లెస్స్ చేశారు. అనంతరం
గెస్ట్ గా వచ్చిన ఎమ్మెల్యే గువ్వల బాలరాజు మాట్లాడుతూ..ఈ సినిమా ట్రైలర్ చాలా బాగుంది. శ్రీకాంత్ గారు ఈ సినిమాను చాలా బాగా తీశారు. మణిశర్మ గారు ఇచ్చిన మ్యూజిక్ వింటుంటే మళ్ళీ మళ్ళీ వినాలానే విధంగా ఉంది., త్రిగున్, శివ, అజయ్ లు చాలా జోవియల్ గా ఎనర్జిటిక్ గా ఉంది. ఈ సినిమా తర్వాత వీరికి మంచి భవిష్యత్తు ఉంటుందని ఆశిస్తున్నాను. ఇందులో మధుబాలతో పాటు హీరోయిన్స్ మెఘా ఆకాష్ , మాయ లు చాలా బాగా నటించారు. మా నియోజక వర్గంకు సంబంధించిన లిరిక్స్ రైటర్ అలరాజు మంచి సాంగ్స్ రాశారు. తనతో పాటు చిత్ర టీం ను బ్లెస్స్ చేయడానికి వచ్చాను.
ఇప్పటి వరకు నాకు సినిమా ఫీల్డ్ తో ఎక్స్పోజర్ లేదు.ఏ ఫీల్డ్ తో అయితే మాకు ఎక్స్పోజర్ లేదో ఈ “ప్రేమదేశం” సినిమాతో ఎక్స్పోజర్ ఏర్పడడమే కాకుండా ఇంత మంది యూత్ తో కనెక్ట్ అవుతున్నందుకు చాలా సంతోషంగా భావిస్తున్నాను. మా రిలేషన్ ఇలాగే కంటిన్యూ చేసే ప్రయత్నం చేస్తాం. అందుకే మా నియోజకవర్గంలో తక్కువ ఖర్చుతో పెద్ద మూవీలో నిర్మించడానికి కావాల్సిన లొకేషన్స్, కాటేజ్ లు ఇలా అన్ని సౌకర్యాలను ప్రభుత్వం తరఫున గాని వ్యక్తిగతంగా గాని అందించే ప్రయత్నం చేస్తాం. ఆర్టిఫిషియల్ సెటప్ తో కాకుండా న్యాచురల్ సెటప్ తో ప్రేక్షకులకు అందించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను ఫిబ్రవరి 3 న వస్తున్న ప్రేమదేశం సినిమా మంచి విజయం సాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.
గెస్ట్ గా వచ్చిన హిట్ 2 డైరెక్టర్ శైలేష్ కొలను మాట్లాడుతూ.. శివ పర్ఫార్మెన్స్ నాకు చాలా బాగా నచ్చుతుంది. అందుకే తనకు హిట్ 2 లో మంచి రోల్ ఇవ్వడం జరిగింది.దర్శకుడు శ్రీకాంత్ సిద్ధం జాబ్ చేస్తూనే ఎంతో డెడికేటెడ్ గా వర్క్ చేశాడు. సిన్సియర్ గా, హార్డ్ వర్క్ తో పనిచేస్తే కచ్చితంగా విజయం లభిస్తుంది అనేది నేను నమ్ముతున్నాను. ఈ సినిమాను కూడా శ్రీకాంత్ సిద్ధం ఎంతో హార్డ్ వర్క్ చేశాడనిపిస్తుంది. ట్రైలర్ చాలా బాగుంది మణి శర్మ గారు ఈ సినిమాకు అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు. ఫిబ్రవరి 3 న వస్తున్న ఈ సినిమా బిగ్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.
బ్యూటిఫుల్ యాక్ట్రెస్ మధుబాల మాట్లాడుతూ.. నా చదువు అయిన తరువాత మా ఫాదర్ నన్ని డాక్టర్ గా చూడాలనుకున్నారు. అయితే అప్పుడు నేను నా ఫ్యూచర్ ఎలా ఉండాలో డిజైన్ చేసుకోలేదు. అయితే అప్పుడే నాకు “పూల్ ఔర్ కాంటే” సినిమా లో అవకాశం రావడం జరిగింది.ఆ తరువాత ఇంట్లో ఉన్న నాకు సినిమా వారు ఫోన్ చేసి సినిమా సూపర్ హిట్ అయ్యింది. మీరు బయటకు రండి అని చెప్పారు.ఆ తరువాత నుంచి నేను వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఆ తరువాత కోవిడ్ సమయంలో డైరెక్టర్ శ్రీకాంత్ సిద్ధం ఈ “ప్రేమదేశం” సినిమా లైన్ చెప్పడంతో నచ్చి చేశాను.ఆ తరువాత టీజర్ రిలీజ్ చేసినప్పుడు నా ఫేస్ చూసుకొని చాలా బాగా చేశారు అనిపించింది. ఇందులో మణి శర్మ గారు ఇచ్చిన అద్భుతమైన మ్యూజిక్, పాటలు చాలా బాగున్నాయి. “ప్రేమదేశం” వంటి మంచి సినిమాలో నటిస్తున్నందుకు చాలా లక్కీ గా ఫీల్ అవుతున్నాను. ఫిబ్రవరి 3న వస్తున్న మా సినిమాలు అందరు చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
చిత్ర దర్శకుడు శ్రీకాంత్ సిద్ధం మాట్లాడుతూ.. మా కార్యక్రమానికి వచ్చిన పెద్దలు అందరికీ ధన్యవాదాలు. మొదట షార్ట్ ఫిలిం కాన్సెప్ట్ అనుకుని స్టార్ట్ చేసిన ఈ మూవీ ని పెద్ద మూవీగా ఎలా ముందుకు తీసుకెళ్లాలనే భయం ఉండేది. అయితే నా ఫ్రెండ్స్ అందరు నాకు ధైర్యం ఇచ్చి నువ్వు చెయ్యి మేము సపోర్ట్ చేస్తామన్నారు.ఆలా స్టార్ట్ అయిన ఈ మూవీ ఎంతో కష్టపడి కంప్లీట్ చేయగలిగాం. మా సినిమా, ట్రైలర్, టీజర్, పాటలకు ప్రేక్షకులనుండి వచ్చిన రెస్పాన్స్ చూస్తుంటే చాలా సంతోషం వేసింది. నేను ముఖ్యంగా మణిశర్మ గారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. మొదట తనను కలిసినప్పుడు ఇండస్ట్రీలో చాలా స్ట్రగుల్ ఉంటుంది చెయ్యగలవా అని చెప్పాడు.
నేను చేస్తాను అని చెప్పడంతో తను మాకు “పదములే లేవు పిల్ల” వంటి మొదలగు బ్యూటిఫుల్ సాంగ్స్ ఇవ్వడం ఒక ఎత్తు అయితే ఇందులో మధుబాల నటిస్తుండడం మరో ఎత్తు దాంతో మా సినిమా నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళింది. ఇందులో త్రిగున్, శివ, అజయ్, మేఘా ఆకాష్, మాయ ఇలా అందరూ చాలా బాగా నటించారు. నా మెదటి సినిమానే మధుబాల గారితో చేయడం చాలా సంతోషంగా ఉంది. మా సిస్టర్ శిరీష ఎంతో కష్టపడి ఈ సినిమాకు సహకారం అందించింది అలాగే ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ అయిన కమల్, కిరణ్, రూపా ల సహకారం మరువలేనిది. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా నాకు చాలా సపోర్ట్ చేశారు. ఫిబ్రవరి 3 న వస్తున్న మా “ప్రేమదేశం” సినిమాను అందరికీ తప్పకుండా నచ్చుతుందని ఆశిస్తున్నాను అన్నారు.
ప్రొడ్యూసర్ శిరీష సిద్ధం మాట్లాడుతూ.. నేనొక సాఫ్ట్వేర్ ఎంప్లాయిని.మా అన్న శ్రీకాంత్ ఈ “ప్రేమదేశం” సినిమా కోసం చాలా కష్టపడ్డాడు. మేము విడుదల చేసిన టీజర్, టైలర్, సాంగ్స్ కు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. వాటిలాగే ఈ మూవీ కూడా సినిమా చాలా బాగా వచ్చింది. ఫ్రెష్ కంటెంట్ తో వస్తున్న ఈ సినిమా చాలా బాగుంటుంది. ఈ మూవీని చూసి బయటకు వచ్చే ప్రతి ఒక్కరూ కచ్చితంగా ఎమోషన్ తో బయటకు వస్తారు. ఫిబ్రవరి 3 న వస్తున్న మా సినిమాను చూసి ఆదరించాలని చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.
అసోసియేట్ ప్రొడ్యూసర్స్ రఘు కళ్యాణ్ రెడ్డి, రాము గార్లు మాట్లాడుతూ..”ప్రేమదేశం” సినిమాలో టూ లవ్ స్టోరీస్ ఉన్నాయి. వీటి కోసం దర్శకుడు శ్రీకాంత్ సిద్ధం చాలా బాగా కష్టపడ్డాడు మణి శర్మ గారు ఇచ్చిన అద్భుతమైన బ్యాగ్రౌండ్ స్కోర్ ఎంతో కీలకం నిలుస్తుంది.ఇందులో నటించిన నటీనటులు అందరూ చాలా బాగా యాక్ట్ చేశారు. వీరందరి నటన ప్రేక్షకులను బాగా క్యారీ చేస్తుంది.నాలుగు కోట్ల బడ్జెట్ అని స్టార్ట్ చేసిన సినిమా కాస్త 8 కోట్లు అయ్యింది. అయినా మేము క్వాలిటీ లో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమా బాగా రావాలని చేయడంతో చాలా బాగా వచ్చింది. ఫిబ్రవరి 3 న రిలీజ్ అవుతున్న మా సినిమాను అందరూ ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
హీరో త్రిగున్ మాట్లాడుతూ..డైరెక్టర్ నన్ను కలసి ఇది నా మొదటి మూవీ అని నాకు ఈ కథ చెప్పినప్పుడు.చాలా ఎగ్జైటింగ్ అనిపించింది.ఆ తరువాత ఈ సినిమాలో మధుబాల నటించడం చాలా సంతోషం వేసింది. ఇప్పటి వరకు సోలో హీరోగా నటించిన నాకు కథ డిమాండ్ మేరకు నాతో పాటు అజయ్, శివలు నటించడం చాలా హ్యాపీ గా ఉంది. రామ్ గోపాల్ వర్మ గారి సినిమాలో మరియు మణిశర్మ గారు మ్యూజిక్ లో పనిచేయడం అనేది నా అచీవ్వ్మెంట్ గా భావిస్తున్నాను. మ్యూజిక్ పరంగా మా సినిమా మెలోడీ టాప్ టెన్ లో ఉంది. ఇలాంటి మంచి సినిమాలో నటించే ఛాన్స్ ఇచ్చిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదములు అన్నారు.
మరో నటుడు శివ మాట్లాడుతూ.. ఈ సినిమా బాగా రావాలని గత నాలుగు సంవత్సరాల నుంచి డైరెక్టర్ మాత్రమే కాకుండా వారి ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్, ఇలా అందరూ ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు. కష్టానికి తగ్గట్టు మంచి విజువల్స్ వచ్చాయి. లెజండరీ సంగీత దర్శకులు మణి శర్మ గారి ఆర్ ఆర్ గానీ, బి.జి.ఎం ఈ చిత్రానికి హైలెట్ గా నిలుస్తుంది. ఫిబ్రవరి 3 న వస్తున్న మా సినిమాను అందరు ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్ననని అన్నారు.
నటుడు అజయ్ మాట్లాడుతూ.. “ప్రేమదేశం” సినిమాలో ఒక మంచి ఎమోషన్ ఉంది. ఒక అబ్బాయి రెండు, మూడు సంవత్సరాలు కష్టపడి ఒక అమ్మాయి వెనకాల తిరిగి చివరికి ఆ అమ్మాయి ఒప్పుకుంటే ఎంత కిక్ వస్తుందో.. మా “ప్రేమదేశం” సినిమా చూస్తే అంతే కిక్ వస్తుంది. నా కెరియర్ స్టార్టింగ్ లోనే మణి శర్మ గారి మ్యూజిక్ లో సోలో సాంగ్ చేయడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ సినిమా బాగుంటుందని నమ్మి మా మూవీ ట్రైలర్ లాంచ్ చేసిన సందీప్ రెడ్డి వంగ, గౌతమ్ మీనన్ వాసుదేవ్ గారికి ధన్యవాదాలు.
ఈ సినిమా కొరకు మా డైరెక్టర్ శ్రీకాంత్ సిద్ధం ఎంతో కష్టపడ్డాడు. బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన అప్పటి “ప్రేమదేశం” టైటిల్ తో వస్తున్న ఈ “ప్రేమదేశం” సినిమా ఆ సినిమాకు ఏ మాత్రం తగ్గకుండా ఉండేలా నలుగురు ప్రొడ్యూసర్స్ కూడా ఎంతో హార్డ్ వర్క్ చేయడం జరిగింది. వీరంతా సాఫ్ట్ వేర్ ఎంప్లాయ్స్ అయినా..ఈ సినిమా కోసం ప్యాషన్ తో వచ్చారు. మా మీద నమ్మకంతో ఈ సినిమా కొరకు చాలా ఇన్వెస్ట్ చేసి చాలా మంచి సినిమా తీశారు. ఫిబ్రవరి 3 న వస్తున్న మా సినిమాకు అందరూ థియేటర్ కు వచ్చి చూసి మమ్మల్ని ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను అన్నారు.
హీరోయిన్ మాయ మాట్లాడుతూ.. ఇలాంటి మంచి చిత్రం లో నటించే అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదములు అన్నారు.
నటీనటులు: మధుబాల, త్రిగున్, మేఘా ఆకాష్, మాయ, అజయ్ కతుర్వార్, కమల్ నార్ల తేజ, శివ రామచంద్ర, తనికెళ్ల బరణి, వైష్ణవి చైతన్య మరియు ఇతరులు.
సాంకేతిక నిపుణులు :
ప్రొడక్షన్ హౌస్: సిరి క్రియేటివ్ వర్క్స్
నిర్మాత: శిరీష సిద్ధమ్
దర్శకుడు: శ్రీకాంత్ సిద్ధమ్
సంగీతం: మణిశర్మ
అసోసియేట్ ప్రొడ్యూసర్స్ : రఘు కళ్యాణ్ రెడ్డి, రాము
ఎగ్జిగ్యూటివ్ ప్రొడ్యూసర్స్ : కమల్, కిరణ్, రూపా