ప్రభాస్ ‘హరోం హర’ పవర్ ఆఫ్ సుబ్రమణ్యం టీజర్‌

హీరో సుధీర్ బాబు పాన్ ఇండియా చిత్రం ‘హరోం హర’. సెహరి ఫేమ్ జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వంలో ఎస్ఎస్ సి (శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్) బ్యానర్‌పై సుమంత్ జి నాయుడు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ప్రభాస్, మమ్ముట్టి, టైగర్ ష్రాఫ్, విజయ్ సేతుపతి, కిచ్చా సుదీప్‌లు ‘పవర్ ఆఫ్ సుబ్రమణ్యం పేరుతో తెలుగు, మలయాళం, హిందీ, తమిళం, కన్నడ భాషల్లో ‘హరోం హర’ టీజర్‌ను లాంచ్ చేశారు.

హీరోని పోలీసులు అరెస్టు చేయడంతో టీజర్ ప్రారంభమవుతుంది. అతని మద్దతుదారులు వారిని ఆపడానికి ప్రయత్నిస్తారు. సుబ్రమణ్యంగా సుధీర్ బాబు సాధారణ వ్యక్తి, కానీ పరిస్థితులు అతన్ని హింసాత్మక మార్గంలో నడపవలసి వస్తుంది. కథాంశాన్ని రివిల్ చేయకుండా, అన్ని ప్రధాన పాత్రలను, సినిమా ప్రిమైజ్ ని ఆకట్టుకునేలా అద్భుతంగా టీజర్ ప్రెజెంట్ చేసింది.

టీజర్ ని చాలా ఇంటెన్స్, ఎనర్జీతో కూడిన అంశాలతో అద్భుతంగా కట్ చేశారు. యుద్దభూమిలో మనుగడ సాగించడానికి, విజయం సాధించడానికి ధైర్యాన్ని ప్రదర్శించాల్సిన అవసరం ఉందని టీజర్ చూస్తోంది. దర్శకుడు జ్ఞానసాగర్ ద్వారక పీరియడ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఓ పల్లెటూరి కథను ఎంచుకుని, దాన్ని అత్యంత అద్భుతంగా అందించాడు. ఈ యాక్షన్ ప్యాక్డ్ సెటప్‌కి డైలాగ్‌లు మరింత ఆకర్షణ తీసుకొచ్చాయి.

సాధారణ వ్యక్తి నుంచి శక్తివంతమైన వ్యక్తిగా ఎదిగే సుబ్రమణ్యం పాత్రను అద్భుతంగా పోషించారు సుధీర్ బాబు. తన పాత్రలో చాలా లేయర్స్ వున్నాయి. పవర్ ఫుల్ రోల్, సరికొత్త మేకోవర్ లో సుధీర్ బాబు ప్రేక్షకులని కట్టిపడేశారు. కుప్పం నేపథ్యంలో సాగే కథ కావడంతో రాయలసీమ స్లాంగ్‌లో పలికిన డైలాగులు ఆకట్టుకున్నాయి. సునీల్ తన ప్రెజన్స్ తో అలరించాడు, మాళవిక శర్మ హీరోయిన్ గా ఆకట్టుకుంది. లక్కీ లక్ష్మణ్, రవి కాలే , అర్జున్ గౌడ ముఖ్యమైన పాత్రలు పోషించి మరింత ఉత్సాహాన్ని తీసుకువచ్చారు.

సినిమాటోగ్రాఫర్ అరవింద్ విశ్వనాథన్ ఫ్రేమ్‌లను లార్జర్-దాన్-లైఫ్ గా చిత్రీకరించారు. క్రేజీ యాక్షన్ బ్లాక్‌లలో తన నైపుణ్యాలన్ని చూపించారు. చైతన్ భరద్వాజ్ అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ టీజర్ గ్రాండియర్ ని పెంచుతుంది. ప్రొడక్షన్ డిజైన్ అద్భుతంగా వుంది. 2024 ప్రారంభంలో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీలో విడుదల కానున్న ప్రాజెక్ట్ పై ఈ టీజర్ చాలా ఎక్సయిట్మెంట్ ని క్రియేట్ చేసింది.

తారాగణం: సుధీర్ బాబు, మాళవిక శర్మ, సునీల్, జే,పి. అక్షర గౌడ, లక్కీ లక్ష్మణ్, రవి కాలే, అర్జున్ గౌడ.

సాంకేతిక విభాగం:
రచన, దర్శకత్వం – జ్ఞానసాగర్ ద్వారక
నిర్మాత – సుమంత్ జి నాయుడు
సంగీతం – చైతన్ భరద్వాజ్
డీవోపీ- అరవింద్ విశ్వనాథన్
ఎడిటర్ – రవితేజ గిరిజాల
బ్యానర్ – శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్
పీఆర్వో – వంశీ శేఖర్