ఇండస్ట్రీ టాక్ : సుజీత్ సినిమాలో పవన్ ఈ పవర్ఫుల్ రోల్.!

చాలా ఏళ్ళకి టాలీవుడ్ స్టార్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ఓ సినిమా అనౌన్స్ చేశాక ఆ సినిమా భారీ అంచనాలు నెలకొల్పడం కామన్ గానే వచ్చింది కానీ ఓ స్ట్రైట్ చిత్రాన్ని అనౌన్స్ చేసినప్పుడు మాత్రం వచ్చే హై సెపరేట్ గానే ఉంటుంది. మరి అందుకే ఇప్పుడు పవన్ ఫ్యాన్స్ దర్శకుడు సుజీత్ తో అనౌన్స్ చేసిన లేటెస్ట్ భారీ చిత్రంని ఎంజాయ్ చేస్తున్నారు.

ఈరోజు ఉదయం అప్డేట్ తోనే సోషల్ మీడియా షేక్ అయ్యిపోగా నెక్స్ట్ అయితే ఈ సినిమాపై మరిన్ని ఆసక్తికర అంశాలు బయటకి వస్తున్నాయి. అయితే అసలు ఈ చిత్రంలో పవన్ రోల్ ఏంటి తాను ఎలా కనిపిస్తాడు అనే అంశాలు బయటకి వచ్చేసాయి. మరి ఈ సినిమా అయితే ఓ భారీ యాక్షన్ సినిమా కాగా పవన్ అయితే ఈ చిత్రంలో ఓ గ్యాంగ్ స్టర్ గా తాను నటించనున్నాడట.

ఇప్పటికే పవన్ ఈ తరహా సినిమాలు చేసాడు కానీ ఈ సినిమాలో వేరే లెవెల్లో తాను కనిపించనున్నాడట. దీనితో అయితే ఇప్పుడు ఈ డీటెయిల్ తో పవన్ అభిమానులు మరిన్ని అంచనాలు డెఫినెట్ గా పెట్టుకోవచ్చు. ఇంకా ఈ సినిమాకి అయితే భీమ్లా నాయక్ ఫేమ్ రవి కె చంద్రన్ సినిమాటోగ్రఫి అందిస్తుండగా పాన్ వరల్డ్ హిట్ RRR నిర్మాత డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని నిర్మాణం వహిస్తున్నారు.