నిఖిల్, స్పై జూన్ 29న ప్రపంచవ్యాప్తంగా విడుదల, మే 12న టీజర్ రిలీజ్

‘కార్తికేయ 2’ నేషన్‌ వైడ్ బ్లాక్‌ బస్టర్ విజయం తర్వాత హీరో నిఖిల్ మరో నేషనల్ థ్రిల్లర్ తో వస్తున్నారు. ఇది భారత్ హిడెన్ స్టొరీ. 2023 ఇండియన్ బెస్ట్ సీక్రెట్ కోసం పోరాటం. ఇది నిఖిల్ పాన్-ఇండియన్ చిత్రం ‘స్పై’ నేపథ్యం. బ్యాక్‌డ్రాప్‌ ను రివీల్ చేయడానికి మేకర్స్ ఒక చిన్న వీడియోను విడుదల చేశారు.

కంట్రీ బెస్ట్ సీక్రెట్ ఏమిటి? తుమ్ ముజే ఖూన్ దో, మై తుమ్హే ఆజాదీ దూంగా (మీరు నాకు రక్తం ఇవ్వండి నేను మీకు స్వేచ్ఛ ఇస్తాను) అనే నినాదం ఇచ్చిన సుభాష్ చంద్రబోస్ గురించి. సుభాష్ చంద్రబోస్ మరణం ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. ఇలా దాగి ఉన్న కథ ఆధారంగా తెరకెక్కిన సినిమా ప్రేక్షకులను థ్రిల్ చేయడం ఖాయం. స్పై చిత్రం ఈ జానర్ లో డిఫరెంట్ మూవీ.

ప్రముఖ ఎడిటర్ గ్యారీ బిహెచ్ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ సినిమాని చ‌ర‌ణ్ తేజ్ ఉప్ప‌లపాటి సీఈఓగా ఈడీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పై కె రాజ శేఖ‌ర్ రెడ్డి భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ఈ ఏడాది జూన్ 29న స్పై ని విడుదల చేయనున్నట్లు మేకర్స్ వీడియో ద్వారా అనౌన్స్ చేశారు. టీజర్‌ ను మే 12న విడుదల చేయనున్నారు.

నిఖిల్ సరసన ఐశ్వర్య మీనన్ కథానాయికగా నటిస్తుండగా, సన్యా ఠాకూర్ సెకండ్ లీడ్ గా ఓ పవర్‌ఫుల్ రోల్ పోషిస్తోంది. ఆర్యన్ రాజేష్ తన కమ్ బ్యాక్ లో ప్రత్యేక పాత్రలో నటిస్తున్నాడు.

ఈ చిత్రానికి నిర్మాత కె రాజశేఖర్ రెడ్డి కథను అందించారు. ఈ కంప్లీట్ యాక్షన్-ప్యాక్డ్ స్పై థ్రిల్లర్‌ తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల కానుంది.

చిత్రం గ్లింప్స్, ప్రమోషనల్ కంటెంట్ కు అద్భుతమైన స్పందన లభించింది.

తారాగణం: నిఖిల్ సిద్ధార్థ, ఆర్యన్ రాజేష్, ఐశ్వర్య మీనన్, సన్యా ఠాకూర్, అభినవ్ గోమఠం, మకరంద్ దేశ్‌పాండే, జిషు సేన్ గుప్తా, నితిన్ మెహతా, రవివర్మ, కృష్ణ తేజ, ప్రిషా సింగ్, సోనియా నరేష్ & ఇతరులు.

సాంకేతిక సిబ్బంది:
దర్శకత్వం & ఎడిటింగ్ : గ్యారీ BH
కథ & నిర్మాత: కె. రాజశేఖర్ రెడ్డి
సీఈవో : చరణ్ తేజ్ ఉప్పలపాటి
DOP : వంశీ పచ్చిపులుసు, మార్క్ డేవిడ్
అఅడిషినల్ సినిమాటోగ్రఫీ: జూలియన్ అమరు ఎస్ట్రాడా DFP, కైకో నకహరా
రచయిత : అనిరుధ్ కృష్ణమూర్తి
సంగీతం: శ్రీచరణ్ పాకాల, విశాల్ చంద్రశేఖర్
ఆర్ట్ : అర్జున్ సూరిశెట్టి
సౌండ్ డిజైన్: సింక్ సినిమా
DI & మిక్సింగ్ అన్నపూర్ణ స్టూడియోస్
మిక్సింగ్ ఇంజనీర్ కన్నన్ గణపత్
అసోసియేట్ ఎడిటర్ భవిన్ ఎం షా
PRO వంశీ – శేఖర్
డిజిటల్ : టమాడా మీడియా