‘డెడ్ పిక్సెల్’ నాకు ఎంతో ప్రత్యేకం.. నిహారిక కొణిదెల

నిహారిక కొణిదెల, వైవా హర్ష , అక్షయ్, సాయి రోనక్‌, భావనలు ప్రధాన పాత్రలో తెరకెక్కిన వెబ్ సిరీస్ ‘డెడ్ పిక్సెల్‌’. అక్షయ్ పూల్ల అందించిన కథతో ఆదిత్య మందల ఈ ప్రాజెక్ట్‌ను రూపొందించారు. బీబీసీ స్టూడియోస్ ఇండియన్ ప్రై.లి., తమడా మీడియా ప్రై.లి బ్యానర్ల మీద సమీర్ గోగటే, సాయిదీప్ రెడ్డి బొర్ర, రాహుల్ తమడా సంయుక్తంగా ఈ వెబ్ సిరీస్‌ను నిర్మించారు. డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో ఈ వెబ్ సిరీస్ మే 19 నుంచి స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ క్రమంలో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ ఈవెంట్‌లో..

దర్శకుడు ఆదిత్య మాట్లాడుతూ.. ‘ఇది యువతకు ఎక్కువగా కనెక్ట్ అయ్యే వెబ్ సిరీస్‌. ఒక్కో పాత్రకు ఒక్కో కారెక్టరైజేషన్ ఉంటుంది. జీవితంలోని ఒక్కో దశకు ఒక్కో పాత్ర ప్రతీకగా ఉంటుంది. ఈ షోను ఇంతలా తీసేందుకు సహకరించిన తమడా మీడియాకు థాంంక్స్. ఈ ప్రాజెక్ట్ కోసం పని చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. టీం అందరూ కష్టపడటం వల్లే ఇంత బాగా వచ్చింది. ఫహద్ వల్లే నేను సెట్‌లో ఎంతో సరదాగా ఉండగలిగాను. నిహారిక చేసిన పాత్రలో గ్రే షేడ్స్ ఉంటాయి. అక్షయ్‌ను నేను పరిచయం చేస్తుండటం ఆనందంగా ఉంది. హర్ష లేకుండా నేను ఏ ప్రాజెక్ట్ చేయలేను. రోనక్‌ ప్రతీ సీన్‌లో అద్భుతంగా నటించారు. భావన అయితే ఐశ్వర్యలానే నటించింది. హాట్ స్టార్ మార్కెటింగ్ టీంకు స్పెషల్ థాంక్స్’ అని అన్నారు.

నిహారిక మాట్లాడుతూ.. ‘నాలుగేళ్ల తరువాత మళ్లీ ఓ వెబ్ సిరీస్ చేస్తున్నాను. ఇది నాకు ఎంతో ప్రత్యేకం. నన్ను నేను కూడా గాయత్రి పాత్రలో ఊహించుకోలేను. కానీ మా దర్శకుడు ఆదిత్య నన్ను నమ్మి నాకు ఈ పాత్రను ఇచ్చారు. ఈ పాత్రను చేయగలని నమ్మకం ఇచ్చినందుకు థాంక్స్. అక్షయ్‌కి సినిమాలు అంటే బాగా ఇష్టం. మా ఇద్దరి మధ్యే ఎక్కువ సీన్లు ఉంటాయి. హర్ష నాకు ఎప్పటి నుంచో తెలుసు. రోషణ్ పాత్రే చాలా కష్టమని కథ విన్నప్పుడు మాకు అనిపించింది. ఆ పాత్రను రోనక్ అద్భుతంగా పోషించారు. భావనతో కలిసి పని చేయడం ఆనందంగా ఉంది. నన్ను ఇంత అద్భుతంగా చూపించినందుకు ఫహద్ గారికి థాంక్స్. ఏ వయసు వాళ్లైనా ఈ వెబ్ సిరీస్‌ను చూడొచ్చు. కానీ యంగ్ జనరేషన్‌కు ఎక్కువగా కనెక్ట్ అవుతుంది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌కు థాంక్స్. ఇంకా నటిగా, నిర్మాతగా ఎక్కువ సినిమాలు చేయాలని అనుకుంటున్నాను. తమడా మీడియాకు థాంక్స్. ఈ వెబ్ సిరీస్‌కు పని చేయడం నాకు ఆనందంగా ఉంది’ అని అన్నారు.

సాయి రోనక్ మాట్లాడుతూ.. ‘దర్శకుడే ప్రతీ పాత్రను పోషిస్తాడని ఆదిత్యను చూశాకే అర్థమైంది. ఓ కిస్ సీన్ లేకుండా ప్రాజెక్ట్ చేయవా? అని అడుగుతుంటారు. కానీ ఇందులో అలాంటి సీన్లు ఏమీ ఉండవు. ఇలాంటి పాత్ర మళ్లీ మళ్లీ వస్తుందో లేదో చెప్పలేం. ఈ టీంతో కలిసి పని చేయడం నాకు ఆనందంగా ఉంది. నాకు నిహారికతో మళ్లీ ఓ ప్రాజెక్ట్ చేయాలని ఉంది’ అని అన్నారు.

అక్షయ్ మాట్లాడుతూ.. ‘కరోనా ముందు ఎన్నో నాటకాల్లో నటించాను. ఆడిషన్స్ ఇవ్వాలని అనుకుంటున్న సమయంలోనే కరోనా వచ్చింది. రెండేళ్లు ఎగిరిపోయాయి. ఇది నా మొదటి ప్రాజెక్ట్. భార్గవ్ పాత్ర చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. మా ప్రాజెక్ట్ కోసం పని చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. మే 19 నుంచి హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ కాబోతోంది’ అని అన్నారు.

వైవా హర్ష మాట్లాడుతూ.. ‘నిహారిక, అక్షయ్, రోనక్, భావన అందరూ చక్కగా నటించారు. మా డైరెక్టర్ ఉగాది పచ్చడి లాంటి వారు. అన్ని రకాల ఎమోషన్స్ ఉన్నాయ’ని అన్నారు.

కెమెరామెన్ ఫహద్ మాట్లాడుతూ.. ‘సెట్‌లో ఎంతో సరదాగా పని చేశాం. అందరూ చక్కగా సహకరించారు. సీజన్ 2 కూడా త్వరలోనే రాబోతోంది’ అని అన్నారు.

తారాగణం : నిహారిక తో పాటు వైవా హర్ష, అక్షయ్,సాయి రోనక్, భావన సాగి, రాజీవ్ కనకాల, బిందు చంద్రమౌళి, జయశ్రీ రాచకొండ ఇతర కీలక పాత్రల్లో నటించారు.

సాంకేతిక నిపుణులు :

ప్రొడక్షన్ హౌస్ : బీబీసీ స్టూడియోస్ ఇండియా Pvt Ltd, Tamada Media Pvt Ltd.
లైన్ ప్రొడ్యూసర్స్ : అనిల్ కుమార్ తీర్రే, సాయి వర్మ వేగిరాజు (RGV)
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ : దీపాలు హండా , శ్రీ హర్ష బసవ
ప్రొడక్షన్ డిజైనర్ : శివమ్ రావు
ఎడిటర్ : సృజన అడుసుమిల్లి
మ్యూజిక్ డైరెక్టర్ : సిధార్థ సదాశివుని
డిఓపి : ఫహద్ అబ్దుల్ మజీద్
రైటర్ : అక్షయ్ పుల్ల
హెడ్ స్క్రిప్ట్ డెవలప్మెంట్ : (బీబీసీ స్టూడియోస్) – సిద్ధార్థ్ హిర్వే
ప్రొడ్యూసర్స్ : సమీర్ గోగతే , సాయిదీప్ రెడ్డి బొర్రా , రాహుల్
డైరెక్టర్ : ఆదిత్య మండల