సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ (సైమా)-2023 వేడుకలు దుబాయ్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ వేదికగా అంగరంగ వైభవంగా జరిగాయి. సెప్టెంబరు 15, 16 తేదీల్లో నిర్వహించిన ఈ వేడుకలు తారలని ఒకచోటకి చేర్చింది. చలనచిత్ర పరిశ్రమలో గత ఏడాది అద్భుతమైన సహకారాన్ని అందించిన వారిని ఘనంగా సత్కరించింది.
సైమా సెప్టెంబర్ 14న బిజినెస్ అవార్డ్స్‌ని సత్కరించింది. 15న తెలుగు, కన్నడ పరిశ్రమల విజేతలకు అవార్డులు ప్రదానం చేయగా, 16న మలయాళం, తమిళ పరిశ్రమల విజేతలను సన్మానించారు.
సైమా దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమలలోని చలనచిత్ర ప్రముఖులను అభినందించడానికి, అంతర్జాతీయ మార్కెట్లలో దక్షిణ భారతీయ చిత్రాలను ప్రోత్సహించడానికి ఒక వేదిక. సైమా వ్యవస్థాపకుడు విష్ణు వర్ధన్ ఇందూరి, అతని భార్య బృందా ప్రసాద్ ఈ వేడుకలో పాల్గొన్న కళాకారులు, సాంకేతిక నిపుణులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. విజేతలను అభినందించారు.
‘సైమా’ 2023 అవార్డ్స్ విజేతల జాబితా:
ఉత్తమ చిత్రం – సీతారామం (వైజయంతీ మూవీస్, సప్న సినిమాస్)
ఉత్తమ నటుడు – జూనియర్ ఎన్టీఆర్ – ఆర్ఆర్ఆర్
ఉత్తమ నటుడు(క్రిటిక్స్)- అడివి శేష (మేజర్)
ఉత్తమ నటి- శ్రీలీల ( ధమాకా )
ఉత్తమ నటి (క్రిటిక్స్) – మృణాల్ ఠాకూర్ (సీతారామం)
ఉత్తమ దర్శకుడు – ఎస్ఎస్ రాజమౌళి (ఆర్ఆర్ఆర్ )
ఉత్తమ నటుడు, సపోర్టింగ్ రోల్ – రాణా దగ్గుబాటి – భీమ్లానాయక్
ఉత్తమ నటి, సపోర్టింగ్ రోల్- సంగీత – మసూద
ఉత్తమ సంగీత దర్శకుడు : ఎంఎం కీరవాణి (ఆర్ఆర్ఆర్)
ఉత్తమ సాహిత్యం : చంద్రబోస్, ఆర్ఆర్ఆర్ (నాటు నాటు)
ఉత్తమ గాయకుడు : రామ్ మిర్యాల, డిజే టిల్లు
ఉత్తమ గాయిని మంగ్లీ ( జింతాక్, ధమాకా)
బెస్ట్ యాక్టర్, నెగిటివ్ రోల్ – సుహాస్ ( హిట్ 2)
ఉత్తమ పరిచయ నటుడు – అశోక్ గల్లా ( హీరో)
బెస్ట్ ప్రామెసింగ్ న్యూకమర్ -బెల్లంకొండ గణేష్ ( స్వాతిముత్యం)
ఉత్తమ పరిచయ నటి -మృణాల్ ఠాకూర్ ( సీతారామం)
ఉత్తమ పరిచయ దర్శకుడు – వశిష్ట ( బింబిసార)
ఉత్తమ పరిచయ నిర్మాత- శరత్, అనురాగ్ ( మేజర్)
ఉత్తమ సినిమాటోగ్రాఫర్- సెంథిల్ ( ఆర్ఆర్ఆర్)
ఉత్తమ హాస్య నటుడు- శ్రీనివాస్ రెడ్డి ( కార్తికేయ 2)
ఫ్లిప్‌కార్ట్ ఫాషన్ యూత్ ఐకాన్ : శ్రుతి హాసన్
సెన్సేషన్ అఫ్ ది ఇయర్ : కార్తికేయ 2