Yash’s Toxic: రాకింగ్ స్టార్ య‌శ్ సెన్సేష‌న‌ల్ మూవీ ‘టాక్సిక్’ నుంచి గంగ పాత్ర‌లో న‌య‌న‌తార‌.. ఫ‌స్ట్ లుక్ రిలీజ్

Yash’s Toxic: రాకింగ్ స్టార్ యశ్ లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ ‘టాక్సిక్: ఎ ఫెయిరీటేల్ ఫర్ గ్రోన్-అప్స్’ మార్చి 19న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ అవుతోంది. ఈ క్ర‌మంలో మేక‌ర్స్ మూవీలోని ఎవ‌రికీ తెలియ‌ని, ఆక‌ట్టుకునే ప్ర‌పంచాన్ని బ‌య‌ట‌పెడుతోంది. రోజు రోజుకీ సినిమాపై అంచ‌నాలు పెరుగుతున్నాయి. ఇప్ప‌టికే కియారా అద్వానీ, హుమా ఖురేషి పాత్ర‌ల‌కు సంబంధించిన ఫ‌స్ట్ లుక్స్ విడుద‌ల చేసిన మేక‌ర్స్‌.. ఇప్పుడు గంగ పాత్ర‌లో న‌టిస్తోన్న న‌య‌న‌తార పాత్ర‌కు సంబంధించిన ఫ‌స్ట్ లుక్‌ను విడుద‌ల చేశారు. ఈ లుక్‌లో న‌య‌న‌తార అందంగా, ప‌వ‌ర్‌ఫుల్‌గా క‌నిపిస్తోంది. యశ్ చేస్తోన్న ఈ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్‌లో నయనతార పాత్ర చాలా కీలకంగా ఉండబోతుందని ఈ పోస్టర్ ద్వారా తెలుస్తోంది.

తన స్టార్ పవర్‌, వైవిధ్యమైన ఎమోష‌న‌ల్ యాక్టింగ్‌తో నయనతార భారతదేశంలోని స్టార్ హీరోయిన్స్‌లో ఒకరిగా ప్రత్యేక గుర్తింపు సంపాదించారు. అయితే ఇప్పుడు చేస్తోన్న టాక్సిక్ సినిమాలోని పాత్ర‌.. ఆమె ఇప్పటివరకు చేయనిది. ఈ సినిమాలో ఆమె ఓ డార్క్ వ‌ర‌ల్డ్‌లోని పాత్ర‌ను పోషిస్తున్నారు. న‌య‌న‌తార త‌న‌ స‌హ‌జ సిద్ధ‌మైన న‌ట‌న‌తో బ‌ల‌మైన ప్ర‌భావాన్ని చూపిస్తూ.. ప్రేక్ష‌కుల‌కు ఆ పాత్ర‌ను స‌రికొత్త‌గా అనిపించేలా ప‌రిచ‌యం చేయ‌బోతుంది.

గంగ పాత్రలోని న‌య‌న‌తార లుక్ చూస్తుంటే.. ఆమెలోని ధైర్యం, భయంలేని వైఖరి సినిమా భారీ స్థాయికి తగ్గట్టుగా క‌నిపిస్తోంది. పోస్ట‌ర్‌లో న‌య‌న‌న్‌. గంభీరమైన హావభావాలతో క‌నిపిస్తోంది. ఆమె చేతిలో తుపాకీ పట్టుకుని కనిపిస్తోన్న స్టైల్ అందంగా, మరోవైపు ప్రమాదకరంగా అనిపిస్తుంది. ఇది నాదంటూ చెప్పేలా, నా నిర్ణ‌యాలు చెల్లుబాట‌వుతాయ‌నే రీతిలో విశాల‌వంత‌మైన క్యాసినో ఎంట్ర‌న్స్ ద‌గ్గ‌ర న‌య‌న్ నిలుచుంది. ఈ సంద‌ర్భంగా..

చిత్ర ద‌ర్శ‌కురాలు గీతు మోహ‌న్ దాస్ మాట్లాడుతూ ‘‘నయనతార ఎంత గొప్ప స్టారో మ‌న‌కు తెలిసిందే. ఆమె స్క్రీన్ ప్రెజెన్స్‌లో ఓ స్టైల్ ఉంటుంది. రెండు ద‌శాబ్దాల‌కు పైగా అంద‌రినీ మెప్పిస్తూ ఎన్నో పాత్ర‌ల్లో మెప్పించింది. అయితే ప్రేక్ష‌కులు ఆమెను ఇప్ప‌టి వ‌ర‌కు చూడ‌న‌టువంటి డిఫ‌రెంట్ పాత్ర‌లో చూడబోతున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఎవ‌రూ ఆమెను చూపించ‌ని స‌రికొత్త స్టైల్లో నేను చూపించాల‌ని అనుకున్నాను. షూటింగ్ జ‌రుగుతోన్న కొద్ది ఆమె వ్య‌క్తిత్వం పాత్ర‌కు ఎంత ద‌గ్గ‌ర‌గా ఉందనే విష‌యం నాకు తెలిసింది. ఆమె పాత్ర‌లో లీన‌మై న‌టించింది. ఆమెలోని డెప్త్‌, నిజాయ‌తీ, ఎమోష‌న‌ల్ పాత్ర‌కు ఆపాదించ‌బ‌డింది. అద్భుతంగా గంగ క్యారెక్ట‌ర్‌ను ఆమె చేశారు. ఈ సినిమాతో నాకు మంచి ఫ్రెండ్ కూడా దొరికింది’’ అన్నారు.

KGF: చాప్టర్ 2తో బాక్సాఫీస్ చరిత్రను తిరగరాసిన తర్వాత..యశ్ ఇప్పుడు టాక్సిక్: ఎ ఫెయిరీటేల్ ఫర్ గ్రోన్-అప్స్‌తో మళ్లీ వెండితెరపై సంద‌డి చేయ‌టానికి సిద్ధ‌మ‌వుతున్నారు. అనౌన్స్‌మెంట్ రోజు నుంచే సినిమా అన్ని ఇండస్ట్రీల్లోనూ ఆస‌క్తిని పెంచుతోంది. అప్‌డేట్స్ చూస్తుంటే ఈ సినిమా సాధారణ కథలకు భిన్నంగా ఉండబోతోందని స్పష్టంగా తెలుస్తోంది. రీసెంట్‌గా కియారా అద్వానీ చేస్తోన్న‌ నాడియా పాత్ర ఫ‌స్ట్ లుక్ రిలీజ్ చేయ‌టంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెరిగాయి. ఆ తర్వాత, హ్యూమా ఖురేషీ చేస్తోన్న ఎలిజబెత్ పాత్రను ప‌రిచ‌యం చేయ‌టం ద్వారా కథలో మరింత ఉత్కంఠ పెరిగింది.

యష్, గీతూ మోహన్‌దాస్ కలిసి కథను రాసి.. గీతూ మోహన్‌దాస్ దర్శకత్వం వహిస్తున్న ‘టాక్సిక్: ఎ ఫెయిరీటేల్ ఫర్ గ్రోన్-అప్స్’ సినిమాను ఇంగ్లిష్, కన్నడ భాషల్లో ఒకేసారి చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమాను హిందీ, తెలుగు, తమిళం, మలయాళం సహా మరికొన్ని భాషల్లో డబ్బింగ్ చేసి విడుదల చేస్తున్నారు. దీంతో ఈ చిత్రంపై అంతర్జాతీయ స్థాయిలో భారీ అంచ‌నాలున్నాయి. అద్భుత‌మైన న‌టీన‌టులు, సాంకేతిక నిపుణులు ఈ సినిమాకు వ‌ర్క్ చేస్తున్నారు. సినిమాటోగ్రఫీ బాధ్యతలను నేషనల్ అవార్డు గ్రహీత రాజీవ్ రవి నిర్వహిస్తుండగా.. సంగీతాన్ని రవి బస్రూర్ అందిస్తున్నారు. ఎడిటింగ్‌ను ఉజ్వల్ కులకర్ణి, ప్రొడక్షన్ డిజైన్‌ను టీపీ అబీద్ చూసుకుంటున్నారు. హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్ జేజే పెర్రీ (జాన్ విక్ ఫేమ్)తో పాటు నేషనల్ అవార్డు గెలుచుకున్న అన్బరివ్ యాక్ష‌న్ స‌న్నివేశాల‌ను డిజైన్ చేశారు.

‘టాక్సిక్: ఎ ఫెయిరీటేల్ ఫర్ గ్రోన్-అప్స్’ సినిమాను కెవిఎన్ ప్రొడ‌క్ష‌న్స్‌, మాన్‌స్ట‌ర్ మైండ్ క్రియేష‌న్స్ బ్యాన‌ర్స్‌పై వెంక‌ట్ కె.నారాయ‌ణ‌, య‌ష్ నిర్మిస్తున్నారు. సినిమా 2026 మార్చి 19న ఈద్, ఉగాది, గుడి పడ్వా పండుగలు కలిసి వచ్చే లాంగ్ వీకెండ్‌ సమయంలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది.

అలక || Analyst Ks Prasad  Modi Big Shock To Chandrababu? || Pawan Kalyan || Nara Lokesh || TR