నందమూరి బాలకృష్ణ (‘NBK 109’) బాబీ కొల్లి దర్శకత్వంలో చిత్రం ప్రారంభం

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ భారీ బ్లాక్ బస్టర్లను అందిస్తూ తన అభిమానులను ఎంతగానో అలరిస్తున్నారు. ఇప్పుడు ఆయన మరో బ్లాక్ బస్టర్ అందించాలని, ఓ భారీ యాక్షన్ చిత్రం కోసం సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ మరియు ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్‌ తో చేతులు కలిపారు.

బ్లాక్ బస్టర్ చిత్రాల దర్శకుడు బాబీ కొల్లి దర్శకత్వంలో సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ ఈ చిత్రాన్ని సమర్పిస్తోంది.

నందమూరి బాలకృష్ణ, బాబీ కొల్లి, సూర్యదేవర నాగవంశీ పూజా కార్యక్రమాలను నిర్వహించి సినిమాను అధికారికంగా ప్రకటించి చిత్ర పనులు ప్రారంభించారు.

బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు(జూన్ 10) నిర్వహించిన పూజా కార్యక్రమంలో స్క్రిప్ట్‌ను బడా మాస్ దర్శకుడు …