Balakrishna #BB4: నందమూరి బాలకృష్ణ, #BB4 అక్టోబర్ 16న ఉదయం 10 గంటలకు ఓపెనింగ్

Balakrishna #BB4: గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, బ్లాక్‌బస్టర్ మేకర్ బోయపాటి శ్రీను హ్యాట్రిక్ బ్లాక్‌బస్టర్‌లను పూర్తి చేసి ఇండియన్ సినిమా క్రేజీ కాంబినేషన్‌లలో ఒకటిగా నిలిచారు. అత్యధిక వసూళ్లు రాబట్టిన సింహా, లెజెండ్, అఖండ చిత్రాలతో హ్యాట్రిక్ బ్లాక్‌బస్టర్‌లను అందించిన తర్వాత ఈ మ్యాసీవ్ ఎపిక్ కాంబో మళ్లీ చేతులు కలిపింది.

బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో #BB4 చిత్రం NBK పుట్టినరోజు సందర్భంగా అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ‘లెజెండ్’ నిర్మాతలు రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై #BB4ని భారీ స్థాయిలో ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నారు. ఎం తేజస్విని నందమూరి ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు.

అక్టోబర్ 16 న #BB4 గ్రాండ్ లాంచ్ ఈవెంట్ జరగనున్నట్లు దసరా శుభ సందర్భంగా మేకర్స్ అనౌన్స్ చేశారు. లాంచింగ్ రోజు సినిమాకి సంబధించిన మరిన్ని వివరాలను తెలియజేయనున్నారు.

#BB4 అత్యున్నత స్థాయి సాంకేతిక ప్రమాణాలతో, హై బడ్జెట్‌తో ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ గా తెరకెక్కనుంది. #BB4 ఇప్పటివరకు బాలకృష్ణకు మోస్ట్ ఎక్స్ పెన్సీవ్ మూవీ.

నటీనటులు: గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ

సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: బోయపాటి శ్రీను
నిర్మాతలు: రామ్ ఆచంట, గోపీ ఆచంట
బ్యానర్: 14 రీల్స్ ప్లస్
ప్రజెంట్స్: ఎం తేజస్విని నందమూరి
పీఆర్వో: వంశీ-శేఖర్
మార్కెటింగ్: ఫస్ట్ షో