కింగ్ నాగార్జున అక్కినేని మాస్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘నా సామిరంగ’ షూటింగ్ చివరి దశలో ఉంది. ఈ చిత్రానికి విజయ్ బిన్ని దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం స్టూడియోలో వేసిన భారీ సెట్‌లో నా సామిరంగ టైటిల్ సాంగ్‌ని చిత్రీకరిస్తున్నారు. ఆస్కార్ అవార్డ్ విజేతలు – ఎంఎం కీరవాణి ఫుట్ ట్యాపింగ్ ట్యూన్ కంపోజ్ చేయగా చంద్రబోస్ లిరిక్స్ అందిస్తున్నారు.
ఈ మాస్ నంబర్‌లో నాగార్జునతో పాటు అల్లరి నరేష్, రాజ్ తరుణ్ కూడా అలరించనున్నారు. సినిమాకే పెద్ద ఆకర్షణగా నిలవనున్న ఈ పాట చిత్రీకరణలో 300 మంది డ్యాన్సర్లు పాల్గొంటున్నారు. దినేష్ మాస్టర్ కొరియోగ్రఫీ చేస్తున్నారు.
టీజర్‌లో నాగార్జునతో అల్లరి నరేష్, రాజ్ తరుణ్ స్క్రీన్ షేర్ చేసుకోవడం అభిమానులకు ఆనందాన్ని కలిగించింది. టీజర్ కి అద్భుతమైన స్పందన వచ్చింది. ముగ్గురిపై పాట థియేటర్స్ లో అదిరిపోయేలా వుంటుంది.
నాగార్జున, ఎంఎం కీరవాణి, చంద్రబోస్‌ల బ్లాక్‌బస్టర్ కాంబినేషన్‌లో మ్యూజిక్ ఆల్బమ్ అన్ని మ్యూజిక్ చార్ట్‌లలో టాప్ లో వుంది.
నాగార్జున సరసన ఆషికా రంగనాథ్ కథానాయికగా నటిస్తోంది. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్‌పై శ్రీనివాస చిట్టూరి హై బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పవన్ కుమార్ సమర్పిస్తున్న ఈ చిత్రానికి శివేంద్ర దాశరధి సినిమాటోగ్రఫీ అందించారు.
చంద్రబోస్ లిరిక్స్ రాయగా, బ్లాక్ బస్టర్ రైటర్ ప్రసన్న కుమార్ బెజవాడ ఈ చిత్రానికి కథ, సంభాషణలు అందించారు.
నా సామిరంగ 2024లో సంక్రాంతికి థియేట్రికల్ రిలీజ్ అవుతుంది.
తారాగణం: కింగ్ నాగార్జున అక్కినేని, అల్లరి నరేష్, ఆషికా రంగనాథ్, రాజ్ తరుణ్
సాంకేతిక విభాగం:
దర్శకుడు: విజయ్ బిన్ని
నిర్మాత: శ్రీనివాస చిట్టూరి
బ్యానర్: శ్రీనివాస సిల్వర్ స్క్రీన్
సంగీతం: ఎంఎం కీరవాణి
డీవోపీ: శివేంద్ర దాశరధి
సమర్పణ: పవన్ కుమార్
కథ, మాటలు: ప్రసన్న కుమార్ బెజవాడ
సాహిత్యం: చంద్రబోస్
పీఆర్వో: వంశీ-శేఖర్