నాగ చైతన్య అక్కినేని – ‘తండేల్’ రెగ్యులర్ షూటింగ్ ఈరోజు ఉడిపిలో ప్రారంభం

యువ సామ్రాట్ నాగ చైతన్య, సక్సెస్ ఫుల్ దర్శకుడు చందూ మొండేటి, ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మిస్తున్న హై బడ్జెట్ చిత్రం ‘తండేల్’ కొద్ది రోజుల క్రితం గ్రాండ్ గా లాంచ్ అయింది. ఈరోజు ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఉడిపిలో ప్రారంభమైంది.

యాక్టర్స్ అందరూ పాల్గొంటున్న ఈ కీలక షెడ్యూల్ లో చిత్ర యూనిట్ టాకీ, యాక్షన్ పార్ట్‌ను చిత్రీకరిస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కర్ణాటకలోని మల్పే పోర్ట్ (ఉడిపి)లో జరుగుతోంది. నాగ చైతన్యతో పాటు ఫైటర్స్ పై యాక్షన్ సీక్వెన్స్ తీస్తున్నారు.

నాగ చైతన్య ఈ చిత్రంలో మత్స్యకారునిగా నటించడానికి బీస్ట్ మోడ్‌ లోకి మారారు. కండలు తిరిగిన దేహం కోసం గత కొన్ని నెలలుగా చాలా హార్ట్ వర్క్ చేశారు. పొడవాటి జుట్టు, గడ్డంతో రగ్గడ్ లుక్ లో కనిపిస్తారు.

యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో నాగ చైతన్య సరసన సాయి పల్లవి హీరోయిన్‌గా నటిస్తోంది. ‘తండేల్’ పూర్తిగా భిన్నమైన నేపథ్యంలో సాగే ప్రేమకథ.

అత్యున్నత సాంకేతిక నిపుణులను ఈ చిత్రానికి పని చేస్తున్నారు. కథలో సంగీతానికి మంచి స్కోప్ ఉన్నందున, జాతీయ అవార్డ్ విన్నింగ్ కంపోజర్ రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ తన సౌండ్‌ట్రాక్‌లు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌తో ప్రేమకథను అందంగా తీర్చిదిద్దుతున్నారు. విజువల్ వండర్ ని అందించడానికి షామ్‌దత్ కెమెరామ్యాన్ గా పని చేస్తున్నారు. ఆర్ట్ విభాగాన్ని శ్రీనాగేంద్ర తంగాల పర్యవేక్షిస్తున్నారు.

తారాగణం: నాగ చైతన్య, సాయి పల్లవి

సాంకేతిక విభాగం:
రచన, దర్శకత్వం: చందూ మొండేటి
సమర్పణ: అల్లు అరవింద్
నిర్మాత: బన్నీ వాసు
బ్యానర్: గీతా ఆర్ట్స్
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
డీవోపీ: షామ్‌దత్
ఆర్ట్: శ్రీనాగేంద్ర తంగాల
పీఆర్వో: వంశీ-శేఖర్
మార్కెటింగ్: ఫస్ట్ షో