Su From So: మైత్రి మూవీ మేకర్స్ ‘సు ఫ్రమ్ సో’ ఎంటర్‌టైనింగ్ రైడ్ ట్రైలర్ రిలీజ్

లేటెస్ట్ కన్నడ బ్లాక్ బస్టర్ ‘సు ఫ్రం సో’ ఇప్పుడు తెలుగు ప్రేక్షకులుని ఆలరించడానికి రెడీ అయ్యింది. మంచి కంటెంట్ కి మద్దతుగా నిలిచే మైత్రీ మూవీ మేకర్స్ ఈ రూరల్ కామెడీ హారర్‌ సినిమాని ఆగస్ట్ 8న రెండు తెలుగు రాష్ట్రాల్లో గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతున్నారు. జెపీ తుమినాడ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా తెలుగు ట్రైలర్ రిలీజ్ అయ్యింది.

గ్రామీణ జానపద కథలు, మూఢనమ్మకాలు, హిలేరియస్ కామెడీ – ఇవన్నీ మిక్స్‌ అయ్యి వినోదాత్మక ప్రయాణమే సు ఫ్రం సో. కథ ఓ పల్లెటూర్లో జరుగుతున్న విచిత్ర సంఘటనల చుట్టూ తిరుగుతుంది. ఆ గ్రామానికి ‘సోమేశ్వర’ నుంచి వచ్చిన సులోచన కారణంగా ఊరు మొత్తం గందరగోళంలో పడుతుంది. ఆ తర్వాత నవ్వుల హంగామా మొదలవుతుంది.

ఈ సినిమాలో శనీల్ గౌతమ్ ఎనర్జిటిక్ పాత్రలో అలరించారు. శాంధ్య ఆరకెరె, జెపీ తుమినాడ్, ప్రకాశ్ తుమినాడ్, రాజ్ బి శెట్టి (కో-ప్రొడ్యూసర్‌ ) పాత్రలు కూడా ఆకట్టుకున్నాయి.

సు ఫ్రం సో రెగ్యులర్ హారర్ కామెడీల్లా కాకుండా గమ్మత్తైన రైటింగ్‌, అలరించే పాత్రలు, మంచి హాస్యంతో ఆకట్టుకునే సినిమా. ఎస్. చంద్రశేఖరన్ సినిమాటోగ్రఫీ ఆ ఊరి అందాన్ని చూపిస్తే, సుమేధ్ కె, సందీప్ తులసిదాస్ అందించిన సంగీతం సినిమాకి మరింత జోష్ తీసుకొస్తుంది.

ఈ ఆగస్ట్ 8న తెలుగు ప్రేక్షకులకు ఈ సినిమా నవ్వులు ప్రయాణం కాబతోంది.

తారాగణం: షనీల్ గౌతమ్, జెపి తుమినాడ్, సంధ్య అరకెరె, ప్రకాష్ కె తుమినాడు, దీపక్ రాయ్ పనాజే, మైమ్ రాందాస్

సాంకేతిక సిబ్బంది:
రచన & దర్శకత్వం – JP తుమినాడ్
నిర్మాతలు – శశిధర్ శెట్టి బరోడా, రవి రాయ్ కలస, రాజ్ బి శెట్టి
తెలుగు రిలీజ్: మైత్రి మూవీ మేకర్స్
డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ – ఎస్.చంద్రశేఖరన్
సంగీతం – సుమేద్ కె
బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ – సందీప్ తులసీదాస్
PRO – వంశీ-శేఖర్
మార్కెటింగ్ – ఫస్ట్ షో

Public EXPOSED: Cm Chandrababu Comments On Amaravati || Ap Public Talk || Ys Jagan || Telugu Rajyam