Dacoit: అడివి శేష్ ‘డకాయిట్’ నుంచి మృణాల్ ఠాకూర్ స్పెషల్ బర్త్ డే పోస్టర్ రిలీజ్

అడివి శేష్ మోస్ట్ అవైటెడ్ మూవీ ‘డకాయిట్’ లీడ్ క్యారెక్టర్స్ ని పరిచయం చేసిన పవర్ గ్లింప్స్ రిలీజ్ తో హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది. ప్రేమ-ప్రతీకార కథనం నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రానికి నూతన దర్శకుడు షానియల్ డియో దర్శకత్వం వహించారు.

ఈరోజు మేకర్స్ మృణాల్ ఠాకూర్ బర్త్‌డే సందర్భంగా ఆమెను పవర్‌ఫుల్ అండ్ ఇమోషనల్ అవతార్‌లో చూపిస్తూ ఓ ఇంటెన్స్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. పోస్టర్‌లో మృణాల్ చేతిలో గన్ పట్టుకొని ఎయిమ్ చేస్తూ కనిపిస్తుంది. ఆమె కళ్ళల్లో ఆక్రోశం, బాధ, ఫైటింగ్ స్పిరిట్ అన్నీ ఒక్కటే టైంలో కనిపిస్తున్నాయి. ముఖంపై చిన్న చిన్న గాయాలు, కన్నీళ్లు ఆమె పాత్రకు ఉన్న ఎమోషనల్ వెయిట్ ని సూచిస్తున్నాయి.

ఈ కథలో జూలియెట్ కేవలం లవ్ ఇంటరెస్ట్ కాదు, రివెంజ్ డ్రామాకి సెంట్రల్ క్యారెక్టర్. మృణాల్ పోషించిన జూలియట్ పాత్ర తెలుగులో ఇప్పటివరకు చూసిన హీరోయిన్ల కంటే వేరే లెవెల్లో ఉంటుంది.

ప్రస్తుతం హైదరాబాద్లో ఈ సినిమాకి సంబంధించి లీడ్ యాక్టర్స్ తో కీలక సన్నివేశాల్ని చిత్రీకరిస్తున్నారు.

అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో వస్తున్న ఈ భారీ చిత్రాన్ని సుప్రియా యార్లగడ్డ నిర్మించగా, సునీల్ నారంగ్ సహ నిర్మాత. భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ అందిస్తున్నారు.

డకాయిట్ ఈ క్రిస్మస్ డిసెంబర్ 25, 2025న థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.

Kingdom Review || Journalist Bharadwaj Review On Kingdom || Vijay Deverakonda || Telugu Rajyam