Mithra Mandali: అక్టోబర్ 15న “మిత్ర మండలి” మూవీ ప్రీమియర్స్

బీవీ వర్క్స్ బ్యానర్ మీద బన్నీ వాస్ సమర్పణలో ప్రియదర్శి, నిహారిక ఎన్ ఎం హీరో హీరోయిన్లుగా విజయేందర్ దర్శకత్వంలో సప్తాస్వ మీడియా వర్క్స్ మీద కళ్యాణ్ మంతెన, భాను ప్రతాప, డా. విజేందర్ రెడ్డి తీగల నిర్మించిన చిత్రం ‘మిత్ర మండలి’. ఈ మూవీ అక్టోబర్ 16న రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే రిలీజ్ చేసిన సాంగ్స్, టీజర్, ట్రైలర్ ఇలా అన్నీ కూడా వైరల్ అయిన సంగతి తెలిసిందే.

*అక్టోబర్ 15 న ప్రీమియర్ షోలు*

ఇక కంటెంట్ మీద ఉన్న నమ్మకంతో అక్టోబర్ 15న ప్రీమియర్లతో ఆడియన్స్ ముందుకు రాబోతోన్నట్టుగా మేకర్స్ ప్రకటించారు. సినిమా చాలా బాగా రావడం, ఆద్యంతం నవ్వించే బడ్డీ కామెడీ మూవీ కావడంతో ఒక రోజు ముందుగా ప్రదర్శించాలని టీం నిర్ణయం తీసుకుంది.
దర్శకుడు తీసిన విధానం, పాటలకి వచ్చిన రెస్పాన్స్ చూసి మేకర్స్ చాలా నమ్మకంగా ఉన్నారు. అందుకే అక్టోబర్ 16 న విడుదల చేస్తున్నా.. ఒకరోజు ముందుగానే ప్రీమియర్ షో వేయాలని ఫిక్స్ అయ్యారు.

*‘ఐఎండిబి‘* లో ట్రెండింగ్:
మిత్ర మండలి చిత్రం ప్రస్తుతం ఐఎండీబీ లో ట్రెండ్ అవుతోంది. సోషల్ మీడియాలో ఇప్పటికే సినిమాపై పాజిటివ్ వైబ్స్ క్రియేట్ అయిన సంగతి తెలిసిందే. అన్ని రకాలుగా మూవీపై మంచి బజ్ నెలకొనడంతో టీం ఓ నిర్ణయం తీసుకుంది.

*మిత్ర మండలి కి సెన్సార్ యు/ఎ*: దీపావళి కి సరైన కుటుంబ కథా చిత్రం:

తాజాగా సెన్సార్ కార్యక్రమాల్ని కూడా చిత్రయూనిట్ పూర్తి చేసుకుంది. సెన్సార్ సభ్యులు సినిమాని వీక్షించి ప్రశంసలు కురిపించారు. కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రమని యు/ఎ సర్టిఫికెట్ ఇచ్చిన సంగతి తెలిసిందే.

‘మిత్ర మండలి’ చిత్రంలో ప్రియదర్శి, నిహారిక ట్రాక్.. విష్ణు ఓయి, రాగ్ మయూర్, ప్రసాద్ బెహరా, వెన్నెల కిషోర్, సత్య, వీటీవీ గణేష్ పాత్రలు ఆకట్టుకోనున్నాయి. అందరినీ సర్ ప్రైజ్ చేసేందుకు బ్రహ్మానందం కూడా కనిపించబోతోన్నారు.

నటీనటులు : ప్రియదర్శి, నిహారిక ఎన్ఎమ్, విష్ణు ఓయి, రాగ్ మయూర్, ప్రసాద్ బెహరా నటించారు, వీరిలో వెన్నెల కిషోర్, సత్య, విటివి గణేష్ తదితరులు

సాంకేతిక బృందం
బ్యానర్ – సప్త అశ్వ మీడియా వర్క్స్, వైరా ఎంటర్టైన్మెంట్స్‌
సమర్పణ – బివి వర్క్స్ బ్యానర్‌, బన్నీ వాస్
నిర్మాతలు – కళ్యాణ్ మంతిన, భాను ప్రతాప & డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల
సహ నిర్మాత – సోమరాజు పెన్మెట్సా
ఎగ్జిక్యూటివ్ నిర్మాత – రాజీవ్ కుమార్ రామ
సంగీతం – ఆర్ఆర్ ధ్రువన్
సినిమాటోగ్రఫీ – సిద్ధార్థ్ ఎస్జె
ఎడిటింగ్ – పీకే
ప్రొడక్షన్ డిజైన్ – గాంధీ నడికుడికర్
కాస్ట్యూమ్స్ – శిల్ప టంగుటూరు
పీఆర్వో – లక్ష్మీవేణుగోపాల్

Aarogyasri Scheme Closed?, But Why Suddenly | Kutami Govt | Telugu Rajyam