మిర్యాల రవీందర్ రెడ్డి, సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ జూన్ 2న విడుదల

సెన్సిబుల్ డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల ప్రస్తుతం ద్వారకా క్రియేషన్స్‌ లో మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మాణంలో కొత్త సినిమా చేస్తున్నారు. మిర్యాల సత్యనారాయణరెడ్డి ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు.

జూన్ 2న సినిమా టైటిల్, ఫస్ట్ లుక్‌ ని విడుదల చేయనున్నారు. అనౌన్స్‌మెంట్ పోస్టర్‌ లో రక్తం గుర్తులతో ఉన్న చేతిని మనం చూడవచ్చు. మరో 3 రోజుల్లో టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల కానున్నాయి.

ద్వారకా క్రియేషన్స్ గత చిత్రం ‘అఖండ’తో సంచలన బ్లాక్‌బస్టర్‌ ని అందించింది. దీంతో వీరి నుంచి రాబోతున్న ప్రాజెక్ట్స్ పై భారీ అంచనాలు ఉన్నాయి. అంచనాలకు తగ్గట్టుగానే శ్రీకాంత్ అడ్డాల న్యూ ఏజ్ సినిమాతో రాబోతున్నారు.

మరిన్ని వివరాలు త్వరలో తెలియజేస్తారు

సాంకేతిక విభాగం:
రచన, దర్శకత్వం : శ్రీకాంత్ అడ్డాల
నిర్మాత: మిర్యాల రవీందర్ రెడ్డి
బ్యానర్: ద్వారకా క్రియేషన్స్
సమర్పణ : మిర్యాల సత్యనారాయణ రెడ్డి
పీఆర్వో: వంశీ-శేఖర్