కొత్తబంగారు లోకం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, బ్రహ్మోత్సం, ముకుంద వంటి కుటుంబ చిత్రాల దర్శకుడిగా మంచిపేరు సంపాదించిన శ్రీకాంత్ అడ్డాల. తనదై శైలికి భిన్నంగా పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తీసిన పెద్దకాపు పార్ట్ 1 నెల రోజుల లోపే సైటెంట్‌గా డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చేసింది.
ఎన్నో అంచనాల మధ్య సెప్టెంబర్ 29న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు మిశ్రమ స్పందన వచ్చి నిరాశపర్చింది. అయితే తాజాగా ఈ చిత్రాన్ని ఓటీటీలో తీసుకువచ్చారు. అమెజాన్ ప్రైమ్ వీడియోలో శుక్రవారం నుంచి స్ట్రీమ్ అవుతున్నది.
అఖండ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత నిర్మాత మిర్యాల శ్రీనివాస్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాకు శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించగా నూతన నటులు విరాఠ్ కర్ణ, ప్రగతి శ్రీవాత్సవలు హీరోహీరోయిన్లుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు.
198ం దశకంలో ఆంధ్రలో ఎన్టీఆర్ పార్టీ స్థాపన, ఓ రెండు లంక గ్రామాలలో వర్గాల మధ్య ఆధిపత్యం కోసం జరిగిన రక్తపాతం చుట్టూ అల్లుకున్న కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. దర్శకుడు ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా తెరకెక్కించగా మొదటి భాగం పార్ట్1గా వినాయకచవితి సమయంలో విడుదల చేయగా అశించినంతగా ఫలితం ఇవ్వలేదు. అయితే ఈ క్రమంలో రెండో భాగం వచ్చేది లేనిది మేకర్స్ ఇప్పటివరకు ప్రకటించలేదు.