మే 5న రిలీజ్‌కి సిద్ధమవుతోన్న ‘#మెన్ టూ’

నరేష్ అగ‌స్త్య‌, బ్ర‌హ్మాజీ, హ‌ర్ష చెముడు, సుద‌ర్శ‌న్‌, మౌర్య సిద్ధ‌వ‌రం, రియా సుమ‌న్‌, ప్రియాంక శ‌ర్మ త‌దిత‌రులు ప్ర‌ధాన తారాగ‌ణంగా న‌టిస్తోన్న చిత్రం ‘#మెన్ టూ’. లాన్‌థ్రెన్ క్రియేటివ్ వ‌ర్క్స్ బ్యాన‌ర్‌పై శ్రీకాంత్ జి.రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో మౌర్య సిద్ధ‌వ‌రం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని మే 5న గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నారు.

ఈ సంద‌ర్భంగా చిత్ర ద‌ర్శ‌కుడు శ్రీకాంత్ జి.రెడ్డి మాట్లాడుతూ ‘‘హ్యాష్ ట్యాగ్ మెన్స్ టూ సినిమాతో ఎవ‌రినో బాధ పెట్టాల‌నే ఉద్దేశం లేదు. ఓ విష‌యాన్ని ఓ కోణంలోనే కాకుండా మ‌రో కోణంలో కూడా చూడాల‌ని చెబుతూ ఔట్ అండ్ ఔట్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ‘#మెన్ టూ’ను రూపొందిస్తున్నాం. సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల‌ను జ‌రుపుకుంటుంది. మే 5న గ్రాండ్‌గా సినిమాను విడుద‌ల చేయ‌టానికి స‌న్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు.

నిర్మాత మౌర్య సిద్ధ‌వ‌రం మాట్లాడుతూ ‘‘‘#మెన్ టూ’ అనే ఫుల్ ఫన్ రైడర్‌లా ఉంటుంది. మంచి టీమ్ చేసిన ప్ర‌య‌త్నం. ప్రేక్ష‌కుల‌ను
ఆక‌ట్టుకుంటుంది. సినిమాను మే 5న రిలీజ్ చేస్తున్నాం’’ అన్నారు.

న‌టీన‌టులు: నరేష్ అగ‌స్త్య‌, బ్ర‌హ్మాజీ, హ‌ర్ష చెముడు, సుద‌ర్శ‌న్‌, మౌర్య సిద్ధ‌వ‌రం, రియా సుమ‌న్‌, ప్రియాంక శ‌ర్మ త‌దిత‌రులు

సాంకేతిక వ‌ర్గం:
బ్యాన‌ర్: లాన్‌థ్రెన్ క్రియేటివ్ వ‌ర్క్స్
నిర్మాత‌: మౌర్య సిద్ధ‌వ‌రం
కో ప్రొడ్యూస‌ర్‌: శ్రీమంత్ పాటూరి
ద‌ర్శ‌క‌త్వం: శ్రీకాంత్ జి.రెడ్డి
మ్యూజిక్‌: ఎలిషా ప్ర‌వీణ్, ఓషో వెంక‌ట్‌
సినిమాటోగ్ర‌ఫీ: పి.సి.మౌళి
ఎడిట‌ర్‌: కార్తీక్ ఉన్న‌వ‌
పాట‌లు, మాట‌లు: రాకేందు మౌళి
ఆర్ట్‌: చంద్ర‌మౌళి.ఇ
కో డైరెక్ట‌ర్‌: సుధీర్ కుమార్ కుర్రు
పి.ఆర్‌.ఓ: వంశీ కాకా