‘మేమ్ ఫేమస్’ సెకండ్ సింగిల్ మినిమమ్ సాంగ్ లాంచ్

‘రైటర్ పద్మభూషణ్’ బ్లాక్ బస్టర్ విజయం తర్వాత లహరి ఫిల్మ్స్, చాయ్ బిస్కెట్ ఫిల్మ్స్ కలిసి చేస్తున్న మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్ ‘మేమ్ ఫేమస్’. సుమంత్ ప్రభాస్ ప్రధాన పాత్ర పోషించడంతో పాటు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ హిలేరియస్ మ్యూజికల్ యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్ ని అనురాగ్ రెడ్డి, శరత్, చంద్రు మనోహరన్ కలిసి నిర్మిస్తున్నారు. మణి ఏగుర్ల, మౌర్య చౌదరి, సార్య , సిరి రాసి ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.

కళ్యాణ్ నాయక్ సంగీతం అందించిన ఫస్ట్ సింగిల్ అయ్యయ్యో ప్లజంట్ మెలోడీకి అద్భుతమైన స్పందన వచ్చింది. ఇప్పుడు, సెకండ్ సింగిల్ మినిమమ్‌ను లాంచ్ చేశారు. ఇది మొదటి దానికి పూర్తిగా భిన్నమైన ట్రాక్. ఈ మాస్ నెంబర్ యూత్ స్టయిల్ స్వాగ్ ని చూపుతుంది. సుమంత్ ప్రభాస్, మణి ఏగుర్ల , మౌర్య చౌదరి దినచర్యను ప్రజెంట్ చేసింది. వారు రోజంతా చిల్ గా ఉంటారు. ఎవరినీ పట్టించుకోరు.

మొదటి పాటను పాడిన రాహుల్ సిప్లిగంజ్ ఈ పాటని పాడారు. హై పిచ్ వోకల్స్‌తో మాస్ ఎనర్జీని నింపారు . కంపోజర్ కళ్యాణ్ నాయక్, కోటి మామిడాలతో కలసి సాహిత్యం అందించారు. సుమంత్ ప్రభాస్, మణి ఏగుర్ల, మౌర్య చౌదరి గ్రామీణ ప్రాంతాల్లో చిచోరా బ్యాచ్‌కి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇది యూత్‌తో పాటు మాస్‌ని అలరించేలా ఉంది.

శ్యామ్ దూపాటి సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రానికి సృజన అడుసుమిల్లి ఎడిటర్, అరవింద్ మూలి ఆర్ట్ డైరెక్టర్.

మేమ్ ఫేమస్ జూన్ 2న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.

తారాగణం: సుమంత్ ప్రభాస్,మణి ఏగుర్ల, మౌర్య చౌదరి, సార్య, సిరి రాసి, నరేంద్ర రవి, మురళీధర్ గౌడ్, కిరణ్ మచ్చ, అంజిమామ, శివ నందన్

సాంకేతిక విభాగం:
రచన, దర్శకత్వం: సుమంత్ ప్రభాస్
నిర్మాతలు: అనురాగ్ రెడ్డి,శరత్ చంద్ర, చంద్రు మనోహర్
బ్యానర్లు: చాయ్ బిస్కెట్ ఫిల్మ్స్, లహరి ఫిల్మ్స్
సంగీతం: కళ్యాణ్ నాయక్
డీవోపీ: శ్యామ్ దూపాటి
ఎడిటర్: సృజన అడుసుమిల్లి
ఆర్ట్ : అరవింద్ మూలి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : సూర్య చౌదరి
పీఆర్వో: వంశీ-శేఖర్
క్రియేటివ్ ప్రోడ్యూసర్స్: ఉదయ్-మనోజ్