100 Dreams Foundation: జెట్టి సినిమాతో హీరోగా సుపరిచితులైన కృష్ణా మానినేని సేవా దృక్పథంతో 100 డ్రీమ్స్ సేవా సంస్థ ద్వారా పలు కార్యక్రమాలు గత ఎనిమిది సంవత్సరాలుగా నిర్వహించుచున్నారు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానిగా విజయవాడ వరదల సమయంలో హీరో కృష్ణ మానినేని చేసిన సేవా కార్యక్రమాలు ప్రశంసలు అందుకున్నాయి.100 డ్రీమ్స్ సేవా సంస్థ వ్యవస్థాపకులు కృష్ణా మానినేని జూన్ 14 ఇంటర్నేషనల్ బ్లడ్ డొనేషన్ డే ను పురస్కరించుకొని “సింధూర సంజీవని” పేరిట నేడు చిరంజీవి బ్లడ్ బ్యాంకులో రక్తదాన శిబిరం నిర్వహించి, 251 donars తో రక్తదాన కార్యక్రమం దిగ్విజయం చేశారు.
ఈ కార్యక్రమంలో చిరంజీవి ఫ్యాన్స్ అధ్యక్షుడు స్వామి నాయుడు గారు, 100 డ్రీమ్స్ VOLUNTEERS, మెగాస్టార్ & పవర్ స్టార్ అభిమానులు మరియు పంచ్ ప్రసాద్, జబర్దస్త్ రాము తో పాటు , ఎం రవికుమార్, విజయ్ భాస్కర్, సత్యదేవ్, మహేష్ బాబు, బాలకృష్ణ, కిషోర్ కౌతారపు, గౌతమ్ తధితరులు పాల్గొన్నారు.