‘మాస్ జాతర’ చిత్రం వాయిదా కాస్త ఆలస్యమైనా అసలుసిసలైన మాస్ పండుగను థియేటర్లలో తీసుకొస్తామని నిర్మాతలు హామీ

Mass Jathara: మాస్ మహారాజా రవితేజ అభిమానులతో పాటు, సినీ ప్రియులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘మాస్ జతర’ చిత్రం ఆగస్టు 27వ తేదీన థియేటర్లలో విడుదల కావాల్సి ఉండగా, కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది.

ఇటీవల పరిశ్రమ వ్యాప్తంగా జరిగిన సమ్మెలు మరియు కీలకమైన కంటెంట్ పూర్తి చేయడంలో ఊహించని జాప్యం కారణంగా.. సినిమాను అనుకున్న తేదీకి సకాలంలో సిద్ధం చేయలేకపోయామని నిర్మాతలు అధికారికంగా తెలిపారు. కంగారుగా సినిమాని విడుదల చేయడం కంటే.. కాస్త సమయం తీసుకొని అత్యుత్తమ చిత్రంగా మలిచి, ప్రేక్షకులకు గొప్ప అనుభూతిని అందించాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు నిర్మాతలు స్పష్టం చేశారు.

మాస్ జతార చిత్రాన్ని అసలైన పండుగ సినిమాగా తీర్చిదిద్దడానికి ప్రతి విభాగం అవిశ్రాంతంగా కృషి చేస్తోందని, ప్రస్తుతం చిత్రానికి సంబంధించిన పనులు వేగంగా జరుగుతున్నాయని నిర్మాతలు తెలిపారు. కొత్త విడుదల తేదీ ఇంకా ఖరారు కానప్పటికీ, త్వరలోనే ప్రకటన వస్తుందని పేర్కొన్నారు. అభిమానులు నిరీక్షణకు బహుమానంగా త్వరలో ఆశ్చర్యకర కంటెంట్ రాబోతుందని నిర్మాతలు హామీ ఇచ్చారు.

Pawan kalyan Vs Chandrababu Over Amaravati Land Polling.? | Telugu Rajyam