పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన మనోజ్ మంచు, మౌనిక భూమా మంచు దంపతులు

మంచు మనోజ్ కుమార్ మౌనిక భూమాను వివాహం చేసుకున్నారు. ఇటివలే ఈ జంట బిడ్డకు జన్మనివ్వబోతున్నట్లు ప్రకటించారు. మనోజ్ కుమార్, మౌనికలకు పండంటి ఆడబిడ్డ పుట్టిందని మనోజ్ సోదరి లక్ష్మి మంచు ట్విట్టర్ ఇన్‌స్టాగ్రామ్‌లో అధికారికంగా ప్రకటించారు.

”దేవతలచే ఆశీర్వదించబడిన ఒక చిన్ని దేవత వచ్చింది! మనోజ్ కుమార్, మౌనిక ఎంతోగానో ఎదురుచూస్తున్న తమ ఆడబిడ్డను స్వాగతించారని ప్రకటించడం మాకు చాలా ఆనందంగా ఉంది. పెద్ద సోదరుడిగా ధైరవ్ చాలా సంతోషించాడు. మేము ఆమెను ప్రేమతో ‘ఎంఎం పులి’ అని పిలుస్తాము” అని లక్ష్మి మంచు ఆనందాన్ని వ్యక్తం చేశారు.

సినిమాల విషయాని వస్తే.. మనోజ్ కుమార్ మళ్లీ యాక్షన్ లోకి దిగారు. ప్రీ-ప్రొడక్షన్ దశలో పలు ప్రాజెక్ట్‌లను వున్నాయి. అనౌన్స్ చేసిన ఒక క్రేజీ యాక్షన్ చిత్రం ఇప్పటికే పూర్తి స్వింగ్‌లో షూటింగ్ ప్రారంభమైయింది. ఈ హై-ఆక్టేన్ యాక్షన్ చిత్రం గ్లింప్స్ మనోజ్ కుమార్ మంచు బర్త్ డే మే 20 న విడుదల చేయడానికి సన్నహాలు జరుగుతున్నాయి.