మంజుమ్మల్ బాయ్స్ కు క్లీన్ U సర్టిఫికేట్, క్రిస్ప్ రన్‌టైమ్ లాక్డ్

దర్శకుడు చిదంబరం మలయాళ సెన్సేషన్ ‘మంజుమ్మల్ బాయ్స్’ తెలుగులో సెన్సార్‌తో సహా అన్ని ఫార్మాలిటీలను పూర్తి చేసింది. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డ్ క్లీన్ U సర్టిఫికేట్ ఇచ్చింది. 2 గంటల 15 నిమిషాల క్రిస్ప్ రన్‌టైమ్ లాక్ చేశారు.

ప్రముఖ పాన్-ఇండియా ప్రొడక్షన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్, ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్‌తో కలిసి తెలుగు హక్కులను సొంతం చేసుకుని, ఈ ఇండియన్ బాక్సాఫీస్ సెన్సేషన్ ని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తోంది. పరవ ఫిలింస్ బ్యానర్‌పై బాబు షాహిర్, సౌబిన్ షాహిర్, షాన్ ఆంటోని ఈ చిత్రాన్ని నిర్మించారు.

మంజుమ్మల్ బాయ్స్ 2006లో కొడైకెనాల్‌లోని గుణకేవ్‌లో చిక్కుకున్న స్నేహితుడిని రక్షించిన మంజుమ్మెల్ అనే గ్రామానికి చెందిన యువకుల నిజ జీవిత అనుభవం ఆధారంగా రూపొందించబడిన సర్వైవల్ థ్రిల్లర్.

ఈ చిత్రంలో సౌబిన్ షాహిర్, గణపతి, ఖలీద్ రెహమాన్, శ్రీనాథ్ భాసి ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

సినిమా పెయిడ్ ప్రీమియర్ షోలకు హ్యుజ్ రెస్పాన్స్ రాగా, టికెట్ల సేల్స్ పరంగా తెలుగు రాష్ట్రాలు, ఓవర్సీస్‌లో రేపటికి బుకింగ్స్ అద్భుతంగా వున్నాయి.