మహేష్ చేతుల మీదుగా విడుదలైన ‘జిగర్ తండా డబుల్ ఎక్స్’ మూవీ టీజర్

ద‌ర్శ‌క నిర్మాత కార్తీక్ సుబ్బ‌రాజ్ డైరెక్ష‌న్‌లో స్టోన్ బెంచ్ ఫిలిమ్స్ బ్యాన‌ర్‌పై కార్తికేయ‌న్ నిర్మిస్తోన్న చిత్రం ‘జిగ‌ర్ తండా డ‌బుల్ ఎక్స్‌’. రాఘ‌వ లారెన్స్‌, ఎస్‌.జె.సూర్య ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. హై యాక్ష‌న్ డ్రామాగా తెర‌కెక్కుతోంది. సోమవారం ఈ సినిమా టీజర్‌ను సూపర్ స్టార్ మహేష్ రిలీజ్ చేసి చిత్ర యూనిట్‌కి అభినందనలు తెలియజేశారు. తెలుగు టీజర్‌ను మహేష్ విడుదల చేయగా తమిళ టీజర్‌ను ధనుష్, కన్నడ టీజర్‌ను రక్షిత్ శెట్టి, మలయాళ టీజర్‌ను దుల్కర్ సల్మాన్ రిలీజ్ చేశారు. అన్ని భాషల్లో టీజర్‌కు అమేజింగ్ రెస్పాన్స్ వస్తోంది.

ఇప్పటికే చిత్రీకరణను పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను పూర్తి చేసుకునే పనిలో ఉంది. దీపావళికి సినిమాను ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేయటానికి ఎంటైర్ టీమ్ అహర్నిశలు కష్టపడుతోంది.

తమిళనాడు, కేరళల్లో బ్యూటీఫుల్ లొకేషన్స్‌తో పాటు భారీ సెట్స్ వేసి సినిమా చిత్రీకరించారు. ఈ సందర్బంగా నిర్మాత కార్తికేయన్ సంతానం మాట్లాడుతూ ‘‘‘జిగర్ తండా డబుల్ ఎక్స్’ సినిమాను మా బ్యానర్‌లో చాలా ప్రెస్టీజియస్‌గా నిర్మించాం. మేకింగ్‌లో ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ ఏడాది దీపావళికి సినిమాను వరల్డ్ వైడ్ గ్రాండ్ రిలీజ్ చేయటానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు.

డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ మాట్లాడుతూ ‘‘డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ‘జిగర్ తండా డబుల్ ఎక్స్’ను తెరకెక్కించాం. ఆడియెన్స్‌కి ఓ అమేజింగ్ ఎక్స్‌పీరియెన్స్ దొరుకుతుంది. ఈ సినిమాకు వర్క్ చేసిన నటీనటులు, సాంకేతిక నిపుణుల సహకారంతో అనుకున్న సమయంలో పూర్తి చేశాం. సపోర్ట్ చేసిన అందరికీ ధన్యవాదాలు’’ అన్నారు.

యాక్షన్ డ్రామాగా రూపొందుతోన్న్ ‘జిగర్ తండా డబుల్ ఎక్స్’ బాహు భాషా చిత్రంగా దీపావళికి రిలీజ్ కానుంది. 2014 బ్లాక్ బస్టర్ అయిన జిగర్ తండా సినిమాకు ఇది ప్రీక్వెల్. అనౌన్స్‌మెంట్ రోజు నుంచి సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. నాటి జిగర్ తండా స్టైల్లోనే దీన్ని యాక్షన్ గ్యాంగ్ స్టర్ జోనర్‌లోనే కార్తీక్ సుబ్బరాజ్ తెరకెక్కిస్తున్నారు. జాతీయ అవార్డ్ సినిమాటోగ్రాఫర్ తిరు ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు. మెర్క్యురీ, రజినీకాంత్ పేట్ట చిత్రాల తర్వాత కార్తీక్ సుబ్బరాజ్, తిరు కాంబోలో వస్తోన్న సినిమా ఇది. జిగర్ తండా సినిమాకు సంగీతాన్ని అందించిన సంతోష్ నారాయణన్ ఇప్పుడు ‘జిగర్ తండా డబుల్ ఎక్స్’కు సంగీత సారథ్యం వహిస్తున్నారు. షఫిక్ మొహమద్ అలీ ఎడిటింగ్ బాధ్యతలను నిర్వహిస్తున్నారు.

జిగర్ తండా తరహాలో ‘జిగర్ తండా డబుల్ ఎక్స్’ కూడా ట్రెండ్ సెట్టర్ అవుతుందని ఎంటైర్ టీమ్ చాలా కాన్ఫిడెన్స్‌తో ఉంది. ఆసక్తిని రేపే ట్విస్టులు, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో కార్తీక్ సుబ్బరాజ్ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. కార్తికేయన్ సంతానం ఈ సినిమా నిర్మిస్తున్నారు. సినిమా ప్రపంచ వ్యాప్తంగా దీపావళికి భారీ ఎత్తున విడుదలవుతుంది.

నటీనటులు: రాఘవ లారెన్స్, ఎస్.జె.సూర్య

సాంకేతిక వర్గం:
సంగీతం – సంతోష్ నారాయణన్,
సినిమాటోగ్రఫీ – తిరుణావుక్కరసు,
ఎడిటర్ – షఫీక్ మహ్మద్ అలీ,
ప్రొడక్షన్ డిజైనర్ – టి.సంతానం,
స్టంట్స్ – దిలీప్ సుబ్బరాయన్,
ఆర్ట్ – బాల సుబ్రమణియన్, కుమార్ గంగప్పన్,
కొరియోగ్రఫీ – షరీఫ్.ఎం, బాబా భాస్కర్,
సౌండ్ డిజైనర్ – కునాల్ రాజన్,
కాస్ట్యూమ్స్ డిజైనర్ – ప్రవీణ్ రాజా,
మేకప్ – వినోద్.ఎస్,
కాస్ట్యూమ్స్ – సుబేర్,
లిరిక్స్ – వివేక్, ముతమిళ్ ఆర్.ఎం.ఎస్,
స్టిల్స్ – ఎం.దినేష్,
వి.ఎఫ్.ఎక్స్ – హెచ్.మోనీష్,
కలరిస్ట్ – రంగా,
పబ్లిసిటీ డిజైన్స్ – టునే జాన్ (24 ఎఎం),
టీజర్ కట్ – ఆశిష్,
సౌండ్ మిక్స్ – సురేన్.జి,
ప్రొడక్షన్ కంట్రోలర్ – గణేష్. పి.ఎస్,
ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్స్ – జి.దురై మురుగన్,
ప్రొడక్షన్ కో ఆర్టినేటర్ – రాజ్ కుమార్,
ప్రొడక్షన్ మేనేజర్స్ – ఎన్.షణ్ముణ సుందరం,
రంగరాజ్ పెరుమాల్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – అశోక్ నారాయణన్.ఎం,
అసోసియేట్ ప్రొడ్యూసర్ – పవన్ నరేంద్ర,
కో ప్రొడ్యూసర్స్ – కాల్ రామన్, ఎస్. సోమశేఖర్, కళ్యాణ్ సుబ్రమణియం,
కో ప్రొడ్యూసర్ – అలంకార్ పాండియన్,
డైరెక్షన్ టీమ్ – శ్రీనివాసన్, ఆనంద్ పురుషోత్, కార్తీక్ వి.పి, విఘ్నేశ్వరన్, జగదీష్, అరవింద్ రాజు.ఆర్, మహేష్ బాలు, సూరజ్ దాస్, సాయి, మురుగానందం, రాహుల్.ఎం, అవినాష్.ఆర్, మోహన్ కుమార్.ఆర్,
పి.ఆర్.ఓ – నిఖిల్ మురుగన్, వంశీ కాకా, ఇబ్రహీం,
నిర్మాతలు – కార్తికేయన్ సంతానం, ఎస్.కదిరేశన్,
దర్శకత్వం – కార్తీక్ సుబ్బరాజ్.