చిరంజీవి ‘భోళా శంకర్’ నుంచి తీనుమారు సాంగ్ విడుదల

మెగాస్టార్ చిరంజీవి మోస్ట్ ఎవైటెడ్ మెగా మాస్-యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘భోళా శంకర్‌’. స్టైలిష్ మేకర్ మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్నారు. రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ ఎంటర్‌టైనర్‌ ఆగస్ట్ 11న థియేటర్లలోకి రానుండడంతో థియేటర్లలో మెగా యుఫోరియాకు కౌంట్ డౌన్ ప్రారంభమైంది. సినిమా ప్రమోషన్‌ లు దూకుడుగా జరుగుతుతున్నాయి. నిన్న భోళా శంకర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. ఈ రోజు మేకర్స్ మరో బిగ్ ట్రీట్ ఇచ్చారు. ఈ చిత్రం నుంచి తీను మారు పాటని విడుదల చేశారు.

మహతి స్వరసాగర్ ఈ పాటని గ్రాండ్ కార్నివాల్ ఎనర్జిటిక్ నెంబర్ గా స్కోర్ చేశారు. రాహుల్ సిప్లిగంజ్ వాయిస్ మెస్మరైజ్ చేయగా కాసర్ల శ్యామ్ అందించిన సాహిత్యం పండగని రెట్టింపు చేసింది.

ఈ పాటలో మెగాస్టార్ ఎనర్జిటిక్ గ్రేస్ ఫుల్ డ్యాన్స్ మూమెంట్స్ కన్నుల పండగలా వున్నాయి. ఫ్లూట్ తో చేసిన సిగ్నేచర్ స్టెప్ అవుట్ స్టాండింగ్ గా వుంది. ఈ పాటలో కీర్తి సురేష్ కూడా మెగా ఎనర్జీని మ్యాచ్ చేశారు. చిత్ర తారాగణం అంతా కనిపించిన ఈ పాట బిగ్ స్క్రీన్ పై చూడటానికి మెగా ట్రీట్ లా వుండబోతుంది.

అనిల్ సుంకర ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. డడ్లీ డీవోపీగా పని చేస్తున్నారు. సత్యానంద్ కథ పర్యవేక్షణ చేయగా తిరుపతి మామిడాల డైలాగ్స్ అందిస్తున్నారు. మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటర్ గా, ఎఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనర్ గా పని చేస్తున్నారు. కిషోర్ గరికిపాటి ఎగ్జిక్యూటివ్ నిర్మాత.

తారాగణం: చిరంజీవి, తమన్నా, కీర్తి సురేష్, సుశాంత్, రఘు బాబు, మురళీ శర్మ, రవిశంకర్, వెన్నెల కిషోర్, తులసి, సురేఖా వాణి, శ్రీ ముఖి, హైపర్ ఆది, వైవా హర్ష, ప్రదీప్, అనీ, బిత్తిరి సత్తి, సత్య, గెటప్ శ్రీను, వేణు టిల్లు, తాగుబోతు రమేష్, రష్మీ గౌతమ్, ఉత్తేజ్, వీర్, షావర్ అలీ & తరుణ్ అరోరా

సాంకేతిక విభాగం :
స్క్రీన్ ప్లే, దర్శకత్వం: మెహర్ రమేష్
నిర్మాత: రామబ్రహ్మం సుంకర
బ్యానర్: ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కిషోర్ గరికిపాటి
సంగీతం: మహతి స్వర సాగర్
డీవోపీ: డడ్లీ
ఎడిటర్: మార్తాండ్ కె వెంకటేష్
ప్రొడక్షన్ డిజైనర్: ఏఎస్ ప్రకాష్
కథా పర్యవేక్షణ: సత్యానంద్
డైలాగ్స్: తిరుపతి మామిడాల
ఫైట్ మాస్టర్స్: రామ్-లక్ష్మణ్, దిలీప్ సుబ్బరాయన్, కాచే కంపాక్డీ
కొరియోగ్రఫీ: శేఖర్ మాస్టర్
లిరిక్స్: రామజోగయ్య శాస్త్రి, కాసర్ల శ్యామ్, శ్రీమణి, సిరాశ్రీ
పీఆర్వో: వంశీ-శేఖర్
వీఎఫ్ఎక్స్ సూపర్‌వైజర్: యుగంధర్
పబ్లిసిటీ డిజైనర్లు: అనిల్-భాను
డిజిటల్ మీడియా హెడ్: విశ్వ సిఎం
లైన్ ప్రొడక్షన్: మెహెర్ మూవీస్

Kottara Kottu Teenumaaru Lyrical Song | Bholaa Shankar |Chiranjeevi |Meher Ramesh|Mahati Swara Sagar