Koragajja : ఘనంగా ‘కొరగజ్జ’ ఆడియో లాంఛ్ ఈవెంట్.. త్వరలోనే చిత్రం విడుదల

కన్నడ నుంచి ప్రస్తుతం రూటెడ్ కథలు వచ్చి బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. భూతకోళ అంటూ ‘కాంతార’ ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ఇక కర్ణాటక, కేరళ, ముంబైలోని కొన్ని ప్రాంతాలు, మరీ ముఖ్యంగా తులునాడులో పూజించబడే దైవం కొరగజ్జ కథతో కన్నడ నుంచి మరో చిత్రం రాబోతోంది. ‘కొరగజ్జ’ అనే టైటిల్‌తో రానున్న ఈ చిత్రాన్ని త్రివిక్రమ సినిమాస్, సక్సెస్ ఫిల్మ్స్ బ్యానర్‌పై త్రివిక్రమ్ సాపల్య నిర్మాతగా సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత సుధీర్ అత్తవర్ తెరకెక్కిస్తున్నారు.

ఈ మూవీకి గోపీ సుందర్ మ్యూజిక్ అందిస్తున్నారు. రీసెంట్‌గానే ఆడియో లాంఛ్‌ను మంగళూరులో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాత్రధారులు విభిన్న గెటప్స్‌లో కనిపించడం, కొరగజ్జ థీమ్‌లో అందరూ ఈవెంట్‌లో సందడి చేయడం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఈ చిత్రంలోని పాటల్ని షారోన్ ప్రభాకర్, శ్రేయా ఘోషల్, సునిధి చౌహాన్, శంకర్ మహదేవన్, జావేద్ అలీ, అర్మాన్ మాలిక్, స్వరూప్ ఖాన్, అనిలా రాజీవ్, సుధీర్ అత్తవర్ వంటి వారు ఆలపించారు. జీ మ్యూజిక్ ద్వారా ‘కొరగజ్జ’ ఆడియో మార్కెట్లోకి వచ్చింది. ఈ మేరకు నిర్వహించిన ఆడియో లాంఛ్‌లో

*నిర్మాత త్రివిక్రమ్ సాపల్య మాట్లాడుతూ* .. ‘‘కొరగజ్జ’ ఈవెంట్‌కు వచ్చిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. మేం రిలీజ్ చేసిన పోస్టర్, 3డీ మోషన్ పోస్టర్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. త్వరలోనే సినిమాను రిలీజ్ చేయబోతోన్నాం. అందరినీ సర్ ప్రైజ్ చేసేలా మా మూవీ ఉంటుంది’ అని అన్నారు.

*దర్శకుడు సుధీర్ అత్తవర్ మాట్లాడుతూ* .. ‘కన్నడ పరిశ్రమలో ముప్పై ఏళ్ల క్రితమే పాన్ వరల్డ్ చిత్రాలు వచ్చాయి. ‘నాగరహోలి’ అనే సినిమా ప్రపంచ వ్యాప్తంగా 13 భాషల్లో విడుదలైంది. కన్నడలో ఎన్నో గొప్ప చిత్రాలు వచ్చాయి. అందులో ‘కాంతార’ కూడా ఒకటి. కన్నడ నుంచి వచ్చిన కల్పనా గారు మనకు రష్యాలో అంబాసిడర్‌గా ఉండేవారు. మాకు ఎక్కువగా గ్రామపీఠ అవార్డులు వచ్చాయి. ఇక ఇప్పుడు మా నుంచి ‘కొరగజ్జ’ చిత్రం రాబోతోంది. అందరూ మా సినిమా చూసి ఆదరించండి. ఈ చిత్రం అందరినీ మెప్పిస్తుంది’ అని అన్నారు.

*నటి శృతి మాట్లాడుతూ* .. ‘‘కొరగజ్జ’ లాంటి అద్భుతమైన చిత్రంతో నాకు పాత్ర దొరకడం ఆనందంగా ఉంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. కన్నడలో ప్రస్తుతం ఎన్నో గొప్ప చిత్రాలు వస్తున్నాయి. మన భారత సంస్కృతి, ఆచారాల్ని చాటే చిత్రాలెన్నో వస్తున్నాయి. ‘కాంతార’ తరువాత కన్నడ నుంచి ‘కొరగజ్జ’ రాబోతోంది. అందరూ చూసి ఆదరించండి’ అని అన్నారు.

*నటి భవ్య మాట్లాడుతూ* .. ‘‘కొరగజ్జ’ లాంటి ఓ గొప్ప చిత్రంలో నటించినందుకు ఆనందంగా ఉంది. ఈ సినిమా అందరినీ ఆకట్టుకుంటుంది’ అని అన్నారు.

*నటుడు సందీప్ సొపర్‌కర్ మాట్లాడుతూ* .. ‘కన్నడలో ఇది నాకు మొదటి చిత్రం. సుధీర్ సర్, త్రివిక్రమ్ వంటి వారితో పని చేయడం ఆనందంగా ఉంది. నేను ఇంత వరకు ఇలాంటి డ్యాన్స్‌ను ఏ సినిమాలో చేయలేదు. ‘కొరగజ్జ’లో నాకు అద్భుతమైన పాత్రను ఇచ్చినందుకు థాంక్స్. ఇందులోని ప్రతీ పాత్ర, ప్రతీ పాట అద్భుతంగా ఉంటుంది. సాహిత్యం, సంగీతం, కళ అనేవి లేకపోతే మానవ మనుగడ ఉండదు’ అని అన్నారు.

‘కొరగజ్జ’లోని పాటలన్నీ కూడా శ్రోతల్ని ఆకట్టుకుంటున్నాయి. ఇక ఈ మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్, మోషన్ పోస్టర్‌లు ఆడియెన్స్‌లో క్యూరియాసిటీని పెంచేసిన సంగతి తెలిసిందే. త్వరలోనే సినిమాను రిలీజ్ చేసేందుకు యూనిట్ ప్లాన్ చేస్తోంది.

సాంకేతిక బృందం
బ్యానర్ : త్రివిక్రమ సినిమాస్ & సక్సెస్ ఫిల్మ్స్
నిర్మాత: త్రివిక్రమ్ సాపల్య
దర్శకత్వం, కథా పరిశోధన, స్క్రీన్‌ప్లే- సాహిత్యం- సంభాషణ : సుధీర్ అత్తవర్
ఎడిటర్: జిత్ జోషి
సంగీతం : గోపీ సుందర్
సినిమాటోగ్రఫీ : మనోజ్ పిళ్ళై
గాయకులు : షారోన్ ప్రభాకర్, శ్రేయా ఘోషల్, సునిధి చౌహాన్, శంకర్ మహదేవన్, జావేద్ అలీ, అర్మాన్ మాలిక్, స్వరూప్ ఖాన్, అనిలా రాజీవ్, సుధీర్ అత్తవర్

Jubilee hills By Election 2025 Exit Poll Results | Jubilee hills By Election 2025 | Sunitha | Naveen