‘కాఫీ విత్‌ ఏ కిల్లర్‌’ సెలబ్రిటీల సందడి.. త్వరలోనే మూవీ విడుదల

సంగీత దర్శకుడు ఆర్‌.పి. పట్నాయక్‌ దర్శకత్వం వహించిన చిత్రం ‘కాఫీ విత్‌ ఏ కిల్లర్‌’. ‘బట్టల రామస్వామి బయోపిక్కు’ చిత్రంతో నిర్మాతగా పేరు తెచ్చుకున్న సెవెన్‌హిల్స్‌ సతీష్‌ నిర్మించారు. సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. తాజాగా ఈ చిత్ర స్పెషల్ స్ర్కీనింగ్‌ను ఇండస్ట్రీలోని సెలబ్రిటీల కోసం నిర్వహించారు. షో అనంతరం చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం వహించిన ఆర్పీ పట్నాయక్ బర్త్‌డే సెలబ్రేషన్స్‌ను చిత్రయూనిట్ గ్రాండ్‌గా నిర్వహించారు.

అనంతరం నటుడు షఫీ మాట్లాడుతూ.. ‘‘సినిమా చాలా బాగా వచ్చింది. ఒక కాఫీ షాప్‌లో ఉండే టేబుల్స్ దగ్గర ఎన్ని కథలు ఉంటాయనేది.. చాలా కొత్తగా చూపించారు. చాలా ఆసక్తికరంగా ఉందీ సినిమా. ఈ సినిమాని నిర్మించిన సెవెన్ హిల్స్ సతీష్ ‌గారికి, ఈ సినిమాకి అన్నీ తానై ముందుకు నడిపించిన ఆర్పీ పట్నాయక్‌గారికి అభినందనలు. ఈ సినిమా ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నా’’నని అన్నారు.

నిర్మాత సెవెన్ హిల్స్ సతీష్ మాట్లాడుతూ.. ‘కాఫీ విత్‌ ఏ కిల్లర్‌’ సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. యుబైఏ సర్టిఫికేట్ వచ్చింది. ఫ్రెండ్స్ అందరికోసం స్పెషల్ స్ర్కీనింగ్ ఏర్పాటు చేశాం. రేపు అన్నయ్య ఆర్పీ పట్నాయక్‌గారి బర్త్‌డే. ఈ సందర్భంగా ఆయన బర్త్‌డే‌ని కూడా సెలబ్రేట్ చేసుకున్నాం. సినిమా చూసిన వారంతా.. చాలా బాగుందని అన్నారు. అందుకు ధన్యవాదాలు. ఈ సినిమాతో మా బ్యానర్‌కు మంచి గుర్తింపు, మా అన్నయ్య ఆర్పీగారికి దర్శకునిగా మంచి పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జెన్యూన్‌గా ఒక మంచి సినిమా చేశాం. ఈ సినిమా కోసం పని చేసిన ప్రతి ఒక్కరికీ మంచి పేరు వస్తుందని భావిస్తున్నానని తెలిపారు.

దర్శకుడు ఆర్పీ పట్నాయక్ మాట్లాడుతూ.. ‘‘ఓటీటీ వచ్చిన తర్వాత ప్రేక్షకుల పల్స్ మారింది. డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాలను వారు ఆదరిస్తున్నారు. అలాంటి సినిమాలు కోరుకునే వారి కోసం ఈ ‘కాఫీ విత్ ఏ కిల్లర్’ సినిమా తీయడం జరిగింది. ఒక డిఫరెంట్ సినిమా చూడాలనుకునేవారికి మాత్రం ఈ సినిమా బెస్ట్ ఆప్షన్ అవుతుందని అనుకుంటున్నాం. అదే కాన్ఫిడెన్స్‌తో ఈ సినిమా తీశాం. సినిమా చూసిన వారంతా పాజిటివ్‌గా స్పందించినందుకు చాలా చాలా సంతోషంగా ఉంది. మేము ఏదయితే టార్గెట్ చేసి తీశామో.. దానిని అందుకుంటామని ఆశిస్తున్నాను. ప్రేక్షకుల ఆశీస్సులు కావాలి. అందరికీ ధన్యవాదాలు..’’ అని తెలిపారు.

ఇంకా పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ఇంత మంచి సినిమాని ప్రేక్షకులకు అందించిన చిత్రయూనిట్‌కు అభినందనలు తెలిపారు.