కిర‌ణ్ అబ్బ‌వ‌రం, శివం సెల్యులాయిడ్స్ కొత్త చిత్రం ప్రారంభం

యంగ్ హీరో కిర‌ణ్ అబ్బ‌వ‌రం హీరోగా శివం సెల్యులాయిడ్స్ ప‌తాకంపై ప్రొడ‌క్ష‌న్ నెంబ‌ర్-2గా ఒక సరికొత్త ల‌వ్ యాక్ష‌న్ డ్రామా రూపొంద‌నుంది. ఈ చిత్రం ద్వారా విశ్వ‌క‌రుణ్ ద‌ర్శ‌కుడిగా ప‌రిచయం అవుతున్నారు. ఈ చిత్ర ప్రారంభోత్స‌వం రామానాయుడు స్టూడియోస్ లో ఘ‌నంగా జ‌రిగింది. హీరోపై చిత్రీక‌రించిన ముహూర్తపు స‌న్నివేశానికి ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు వి.వి.వినాయ‌క్ క్లాప్ కొట్టగా, ప్ర‌ముఖ నిర్మాత‌లు ద‌గ్గుబాటి సురేష్ బాబు, ఎ.ఎం.ర‌త్నం కెమెరా స్విచాన్ చేశారు. ఈ కార్య‌క్ర‌మానికి నిర్మాత‌లు కె.ఎస్.రామారావు, జెమిని కిర‌ణ్‌, శిరీష్, వ‌ల్ల‌భ‌నేని వంశీ, న‌ల్ల‌మ‌ల‌పు బుజ్జి, రామ్ తాళ్లూరి, దామోద‌ర‌ప్ర‌సాద్, కె.కె.రాధామోహ‌న్, బెక్కెం వేణుగోపాల్, ప్ర‌స‌న్న కుమార్, తుమ్మ‌ల‌ప‌ల్లి రామ‌స‌త్య‌నారాయ‌ణ‌ త‌దిత‌రులు అతిథులుగా హాజ‌రై సినిమా విజ‌యం సాధించాల‌ని శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. ఈ నెలలోనే రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఇత‌ర వివ‌రాల‌ను త్వ‌ర‌లోనే వెల్ల‌డిస్తామ‌ని నిర్మాత‌లు తెలియ‌జేశారు.

కిర‌ణ్ అబ్బ‌వ‌రం హీరోగా న‌టిస్తున్న ఈ చిత్రానికి

నిర్మాత‌లు: ర‌వి, జోజో జోస్, రాకేష్ రెడ్డి
స‌హ నిర్మాత‌లు: బి.సురేష్ రెడ్డి, సంతోష్
ద‌ర్శ‌క‌త్వం: విశ్వ‌క‌రుణ్
సంగీతం: సామ్ సిఎస్
ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్: ర‌వీంద‌ర్
డీఓపీ: విశ్వాస్ డానియేల్
ఎడిట‌ర్: ప్ర‌వీణ్ కె.ఎల్
అసిస్టెంట్ ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్: సుధీర్ మాచ‌ర్ల‌
కాస్ట్యూమ్ డిజైన‌ర్: హ‌ర్ష చ‌ల్ల‌ప‌ల్లి
పీఆర్వో: దుద్ది శ్రీను, సిద్ధు