కిరణ్ అబ్బవరం ‘మీటర్’ మార్చి 29న ట్రైలర్ బ్లాస్టింగ్

టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో యంగ్ హీరో కిరణ్ అబ్బవరం మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘మీటర్’. నూతన దర్శకుడు రమేష్ కడూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మిస్తోంది. రెగ్యులర్ అప్‌డేట్‌లతో మీటర్ టీమ్ దూకుడు ప్రమోషన్‌లని చేస్తోంది . రెండు పాటలకు సూపర్బ్ రెస్పాన్స్ రాగా, టీజర్ బజ్ పెంచింది.

ఈరోజు ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను ఈ నెల 29న విడుదల చేయనున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. “మార్చి 29న ట్రైలర్ బ్లాస్టింగ్,” అనే మాస్ అప్పిలింగ్ ట్రైలర్ డేట్ అనౌన్స్ మెంట్ చేశారు. ఈ పోస్టర్ లో డెనిమ్స్ షర్ట్స్ , జీన్స్ ధరించి, కిరణ్ మోడిష్‌గా కనిపిస్తున్నారు.

మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి సమర్పణలో చిరంజీవి (చెర్రీ), హేమలత పెదమల్లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

వెంకట్ సి దిలీప్ సినిమాటోగ్రాఫర్ కాగా, జెవి ఆర్ట్ డైరెక్టర్. అలేఖ్య లైన్ ప్రొడ్యూసర్ కాగా, బాబా సాయి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. కిరణ్ కెరీర్‌లోనే అత్యంత ఖరీదైన సినిమాగా రూపొందిన ఈ చిత్రానికి బాల సుబ్రమణ్యం కెవివి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్.

సమ్మర్ స్పెషల్‌గా ఏప్రిల్ 7న సినిమా గ్రాండ్ గా విడుదల కానుంది.

తారాగణం: కిరణ్ అబ్బవరం, అతుల్య రవి

సాంకేతిక విభాగం:
కథ, స్క్రీన్‌ప్లే & దర్శకత్వం: రమేష్ కడూరి
నిర్మాతలు: చిరంజీవి (చెర్రీ), హేమలత పెదమల్లు
సమర్పకులు: నవీన్ యెరనేని, రవిశంకర్ యలమంచిలి
బ్యానర్: మైత్రీ మూవీ మేకర్స్‌, క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్
సంగీతం: సాయి కార్తీక్
డీవోపీ: వెంకట్ సి దిలీప్
ప్రొడక్షన్ డిజైనర్: JV
డైలాగ్స్: రమేష్ కడూరి, సూర్య
లైన్ ప్రొడ్యూసర్: అలేఖ్య పెదమల్లు
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: బాబా సాయి
చీఫ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: బాల సుబ్రమణ్యం KVV
ప్రొడక్షన్ కంట్రోలర్: సురేష్ కందుల
మార్కెటింగ్: ఫస్ట్ షో
పీఆర్వో: మధు మాడూరి, వంశీ-శేఖర్