Kattappa Judgment: జూన్ 13న వస్తున్న “కట్టప్ప జడ్జిమెంట్”

అపోలో ప్రొడక్షన్స్ పతాకంపై రావూరి వెంకట స్వామి నిర్మాతగా బాహుబలి కట్టప్ప సత్యరాజ్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం “కట్టప్ప జడ్జిమెంట్”. తీర్పుగల్ విర్కపడుమ్ తమిళ చిత్రాన్ని తెలుగులో కట్టప్ప జడ్జిమెంట్ పేరుతో తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు నిర్మాత వెంకట స్వామి. బాహుబలి కట్టప్ప అంటే తెలుగులో తెలియని ప్రేక్షకులు వుండరు. అంతలాఎడతెగని అనుబంధం ఉంది తెలుగులో సత్యరాజ్ గారికి. సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం యు/ఏ సర్టిఫికెట్ అందుకుంది.

జూన్ 13న తెలుగులో విడుదల చేయడానికి నిర్మాత ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రత్యర్థి పాత్రలో మధుసూదనరావు అద్భుతంగా నటించారు. పూర్తి మాస్ ఎలిమెంట్స్ తో రూపొందిన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది అనడంలో సందేహం లేదు. కట్టప్ప ఏ విషయంలో ఎలాంటి జడ్జిమెంట్ ఇచ్చాడో వెండితెరపై చూసి తెలుసుకోండి. ఈ చిత్రానికి ధెరన్ దర్శకత్వం వహించారు. మరియు స్మ్రుతి వెంకట్, సత్యరాజ్, హరీష్ ఉత్తమన్ మరియు మధుసూధన్ రావు, రవిప్రసాద్ ప్రధాన పాత్రలు పోషించారు.

బన్నీకి పోటీగా ప్రభాస్ || Cine Critic Dasari Vignan Prabhas Raja Saab On Pushpa 2 Sentiment || TR