కార్తి ‘జపాన్’ టచ్చింగ్ టచ్చింగ్ పాటకు చార్ట్ బస్టర్ రెస్పాన్స్

వరుస హిట్లతో దూసుకుపోతున్న హీరో కార్తి ప్రస్తుతం తన ల్యాండ్‌మార్క్ 25వ చిత్రం ‘జపాన్‌’ చేస్తున్నారు. జోకర్ ఫేమ్ రాజు మురుగన్ దర్శకత్వం వహించిన ఈ హీస్ట్ థ్రిల్లర్ ని డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై ఎస్ ఆర్ ప్రకాష్ బాబు, ఎస్ ఆర్ ప్రభు నిర్మించారు. అన్నపూర్ణ స్టూడియోస్ ఈ సినిమాని తెలుగు రాష్ట్రాలలో గ్రాండ్ విడుదల చేయనుంది. ఇటివలే విడుదలైన జపాన్ టీజర్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది.

ఇక జపాన్ మ్యూజికల్ ప్రమోషన్స్ లో భాగంగా విడుదల చేసిన ఫస్ట్ సింగిల్ ‘టచ్చింగ్ టచ్చింగ్’ పాట అద్భుతమైన రెస్పాన్స్ తో ప్రస్తుతం ట్రెండింగ్ లో వుంది. జివి ప్రకాష్ కుమార్ కంపోజ్ చేసిన ఈ పెప్పీ అండ్ మ్యాసీ నెంబర్ చార్ట్ బస్టర్ రెస్పాన్స్ తో అన్నీ మ్యూజిక్ ఫ్లాట్ ఫామ్స్ లో టాప్ చార్ట్ లో వుంది. స్వయంగా కార్తి పాడిన ఈ పాటకు మ్యూజిక్ లవర్స్ ఫిదా అవుతున్నారు. భాస్కరభట్ల అందించిన లిరిక్స్ క్యాచి గా వుండగా, పాటలో కార్తి, అను ఇమ్మాన్యుయేల్ కెమిస్ట్రీ ఫెంటాస్టిక్ గా వుంది.

జపాన్ కార్తీకి క్రేజీ క్యారెక్టర్. ఎక్స్ ట్రార్డినరీ మేకోవర్‌ తో కార్తి పూర్తిగా భిన్నమైన అవతార్‌లో కనిపించారు. కార్తీ సరసన అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్‌గా నటిస్తుండగా, సునీల్ కీలక పాత్రలో కనిపిస్తున్నారు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ విజయ్ మిల్టన్ ఈ సినిమాతో తొలిసారిగా నటుడిగా పరిచయం అవుతున్నారు.

ఈ చిత్రానికి ఎస్ రవి వర్మన్ డీవోపీ పని చేస్తుండగా ఫిలోమిన్ రాజ్ ఎడిటర్. నేషనల్ అవార్డ్ విన్నింగ్ ప్రొడక్షన్ డిజైనర్ (కమ్మరసంభవం) వినేష్ బంగ్లాన్ జపాన్ ప్రొడక్షన్ డిజైనర్ గా పని చేస్తున్నారు.

జపాన్ ‘దీపావళి’కి గ్రాండ్ గా థియేటర్స్ లో విడుదలౌతుంది.

తారాగణం: కార్తి, అను ఇమ్మాన్యుయేల్, సునీల్, విజయ్ మిల్టన్ తదితరులు.

సాంకేతిక విభాగం:
దర్శకత్వం: రాజుమురుగన్
ప్రొడక్షన్ హౌస్: డ్రీమ్ వారియర్ పిక్చర్స్
నిర్మాతలు: ఎస్ ఆర్ ప్రకాష్ బాబు, ఎస్ ఆర్ ప్రభు
క్రియేటివ్ ప్రొడ్యూసర్: తంగప్రభాహరన్ ఆర్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: అరవేంద్రరాజ్ బాస్కరన్
డీవోపీ: ఎస్. రవి వర్మన్
సంగీతం: జివి ప్రకాష్ కుమార్
ఎడిటర్: ఫిలోమిన్ రాజ్
స్టంట్స్: అన్ల్ అరసు
ప్రొడక్షన్ డిజైనర్: వినేష్ బంగ్లాన్
పీఆర్వో: వంశీ-శేఖర్