Mana Shankara Vara Prasa Garu: మెగాస్టార్ చిరంజీవి గారితో నటించడం నా అదృష్టం : నటుడు కరాటే కార్తి !!!

Mana Shankara Vara Prasa Garu: నటన అంటే ఎంతో ఇష్టం కావడంతో సీఆర్‌పీఎఫ్‌ ఉద్యోగాన్ని వదిలి సినిమా రంగంలోకి అడుగుపెట్టి.. కమల్‌ హాసన్‌ నటించిన ‘దశావతారం’ చిత్రంలో జూనియర్‌ ఆర్టిస్టుగా తొలిసారి నటనకు శ్రీకారం చుట్టారు కరాటే కార్తి. ‘సింగం-3’, ‘దబాంగ్‌-3’, ‘బిగిల్‌’, ‘పేట’, ‘ఖైదీ’ వంటి పలు చిత్రాల్లో నటించి మెప్పించారు.

సినీ రంగంలో తన 14 యేళ్ళ పోరాటానికి తగిన గుర్తింపు, విజయం ‘డాక్టర్‌’ చిత్రం ద్వారా దక్కిందని నటుడు కరాటే కార్తి అంటున్నారు. ఈ క్రమంలో హీరో శివ కార్తికేయన్‌ నటించిన ‘డాక్టర్‌’తో మంచి గుర్తింపుతో పాటు విజయం కూడా వరించిందని కార్తి పేర్కొన్నారు.

తాజాగా కరాటే కార్తి మెగాస్టార్ చిరంజీవి మన శంకర వరప్రసాద్ సినిమాలో విలన్ గా నటించి మెప్పించారు. మెగాస్టార్ చిరంజీవితో నటించడం అదృష్టమని అతని దగ్గర చాలా విషయాలు నేర్చుకున్నానని, అసలు మెగాస్టార్ చాలా సాధారణ మనిషిలా ఉంటాడని అలా ఉండడం అతని గొప్పదనమని అలాగే అనిల్ రావిపూడి తో వర్క్ చేయడం చాలా ఎనర్జీ ఇచ్చిందని అతను చెప్పినట్లు చేస్తే చాలు ఎవరైనా మంచి ఆర్టిస్ట్ అవ్వొచ్చని ఆయన అన్నారు.

సీఆర్‌పీఎఫ్‌లో పనిచేసిన తనకు బాక్సింగ్‌‌లో గోల్డ్‌ మెడల్‌ సైతం వచ్చిందన్నారు. అఖిల భారత కరాటే పోటీల్లో ఏకంగా 13సార్లు చాంపియన్‌గా నిలిచిన ఆయన జిమ్నాస్టిక్‌, సిలంబాట్టం, జూడో, కిక్‌ బాక్సింగ్‌ క్రీడల్లో శిక్షణ తీసుకున్నట్టు పేర్కొన్నారు. కానీ, తనకు నటన అంటే ఎంతో ఇష్టం కావడంతో సీఆర్‌పీఎఫ్‌ ఉద్యోగాన్ని వదిలి సినిమా రంగంలోకి అడుగు పెట్టిన తనకు మంచి సినిమాల్లో అవకాశాలు వస్తున్నాయి అన్నారు. హీరో సూర్య మరియు వెంకీ అట్లూరి సినిమాలో తాను మంచి రోల్ లో నటిస్తున్నట్లు తెలిపారు.

జగన్ డామేజ్ || Ys Jagan Comments On Ap Capital EXPOSED By Chillagattu Sreekanth || Amaravati || TR