శ్రీవిష్ణు ‘శ్వాగ్’ నుంచి ఉత్పల దేవిగా ఎవర్‌గ్రీన్ బ్యూటీ మీరా జాస్మిన్‌

టైటిల్ స్టోరీ గ్లింప్స్, క్వీన్ గారి శ్వాగ్ గ్లింప్స్‌తో హ్యూజ్ బజ్ క్రియేట్ చేసిన తర్వాత ‘శ్వాగ్’ మేకర్స్ ఎవర్‌గ్రీన్ బ్యూటీ మీరా జాస్మిన్‌ను ఉత్ఫల దేవిగా పరిచయం చేశారు. ఆమె రాణి కావాల్సింది. కానీ ఆమె హీడెడ్నెస్, కైండ్ నేచర్ కారణంగా సింహాసనాన్ని కోల్పోయింది. ఇది చాలా స్ట్రెంజ్ రీజన్? ‘శ్వాగ్’ వరల్డ్ ఎంత ఎక్స్ ట్రార్డినరీ వుంటుందో దీనిబట్టి ఊహించుకోవచ్చు.

క్యారెక్టర్ ఇంట్రడక్షన్ పోస్టర్‌లో మీరా జాస్మిన్ హెవీ జ్యువెలరీ డిజైనర్ వేర్‌లో రాణిలా కనిపిస్తుంది. ఆమె క్యారెక్టర్ కు ఇది పెర్ఫెక్ట్ లుక్. కొంత బ్రేక్ తీసుకున్న మీరా జాస్మిన్ చాలా కాలం తర్వాత ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించనుంది.

శ్రీవిష్ణు, హసిత్ గోలి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. వింజమర వంశంలో క్వీన్ రుక్మిణి దేవిగా రీతూ వర్మ లీడ్ రోల్ లో నటిస్తోంది. ఔట్ అండ్ అవుట్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న శ్వాగ్ శ్రీవిష్ణు, హసిత్ గోలీల నుండి మరొక యూనిక్ అటెంప్ట్.

ఈ చిత్రానికి వేదరామన్ శంకరన్ డీవోపీగా పని చేస్తుండగా, వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్నారు, విప్లవ్ నిషాదం ఎడిటర్. జిఎం శేఖర్ ఆర్ట్ డైరెక్టర్. నందు మాస్టర్ స్టంట్స్‌ నిర్వహిస్తున్నారు. వివేక్ కూచిభొట్ల సహ నిర్మాత.

నటీనటులు: శ్రీవిష్ణు, రీతూ వర్మ, మీరా జాస్మిన్

సాంకేతిక సిబ్బంది:
నిర్మాత: టి.జి. విశ్వ ప్రసాద్
రచన & దర్శకత్వం : హసిత్ గోలి
సహ నిర్మాత: వివేక్ కూచిబొట్ల
క్రియేటివ్ ప్రొడ్యూసర్: కృతి ప్రసాద్
సినిమాటోగ్రాఫర్: వేదరామన్ శంకరన్
సంగీతం: వివేక్ సాగర్
ఎడిటర్: విప్లవ్ నిషాదం
ఆర్ట్ డైరెక్టర్: GM శేఖర్
స్టైలిస్ట్: రజనీ
కొరియోగ్రఫీ: శిరీష్ కుమార్
స్టంట్స్: నందు మాస్టర్
పబ్లిసిటీ డిజైన్స్: భరణిధరన్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: అనునాగవీర
లిరిక్స్: భువన చంద్ర, రామజోగయ్య శాస్త్రి, జొన్నవిత్తుల, నిఖిలేష్ సుంకోజీ, స్వరూప్ గోలి
సౌండ్ డిజైన్: వరుణ్ వేణుగోపాల్
కో-డైరెక్టర్: వెంకీ సురేందర్ (సూర్య)
VFX & DI: దక్కన్ డ్రీమ్స్
కలరిస్ట్: కిరణ్
VFX సూపర్‌వైజర్: వి మోహన్ జగదీష్ (జగన్)
కార్టూన్ అనిమే: థండర్ స్టూడియోస్
డైరెక్షన్ టీం: ప్రణీత్, భరద్వాజ్, ప్రేమ్, శ్యామ్, కరీముల్లా, స్వరూప్