వ్యూహం ఇంటెన్స్‌ పోస్టర్‌ విడుదల

కుట్రలకి, ఆలోచనలకి మధ్యలో అసమాన్యుడుగా ఎదిగిన నాయకుని కథే ‘వ్యూహం’. ఆ నాయకుడే వైయస్‌.జగన్‌ ఫస్ట్‌ ఇంటెన్స్‌ పోస్టర్‌ ఆఫ్‌ ‘వ్యూహం’. టెక్నికల్‌గా తమ పోస్టర్లతో కథను చెప్పి ట్రెండ్‌ చేయగల పోస్టర్‌ డిజైనర్స్‌ అనిల్‌ అండ్‌ భాను అనే సంగతి అందరికి తెలిసిందే అని సెన్సేషనల్‌ దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ తన ట్వీటర్‌ ద్వారా తెలియచేశారు. వైయస్‌. జగన్‌ పాత్రను పోషించిన అజ్మల్‌ తనపై జరిగిన కుట్రలకి ఎలా స్పందిస్తున్నారో తెలిపే పోస్టర్‌ను వర్మ విడుదల చేశారు. ఎంతో వ్యూహాత్మకంగా ‘వ్యూహం’ సినిమాని ఎక్కడ కాంప్రమైజ్‌ కాకుండా లె రకెక్కిస్తున్న దర్శకుడు ఆర్జీవి ప్రతిభను చూసి ఆశ్యర్యపోతున్నాను అన్నారు చిత్ర నిర్మాత దాసరి కిరణ్‌కుమార్‌.

రామదూత క్రియేషన్స్‌ పతాకంపై నిర్మితమవుతున్న ‘వ్యూహం’ సినిమా చిత్రీకరణ దాదాపు 50 శాతం పూర్తయిందని నిర్మాత తెలిపారు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన అనేక విషయాలను వెల్లడిస్తామన్నారు. ఈ చిత్రంలో వైయస్‌.భారతీ పాత్రలో మానస నటిస్తున్నారు.

ఈ చిత్రానికి డి.ఓ.పి – సుజీష్‌ రాజేంద్రన్, ఎడిటర్‌– మనీష్‌ ఠాకూర్, పిఆర్వో– శివమల్లాల