దిల్‌రాజు ప్రొడక్షన్స్ పతాకంపై రూపొందుతోన్న సినిమా ‘జనక అయితే గనక’. శిరీష్ సమర్పణలో హర్షిత్ రెడ్డి, హన్షిత రెడ్డి నిర్మించారు. వెర్సటైల్ యాక్టర్ సుహాస్ హీరోగా నటించారు. సందీప్ రెడ్డి బండ్ల డైరక్ట్ చేశారు. సెప్టెంబర్ 7న ఈ సినిమా గ్రాండ్‌గా విడుదల కానుంది. సంగీర్తన హీరోయిన్‌గా నటించారు. ఈ సినిమా ఫైనల్ వెర్షన్‌ని చూసిన సుహాస్, యుఎస్‌ఏ హక్కులను సొంతం చేసుకున్నారు.
సుహాస్ మాట్లాడుతూ: ”ఫైనల్ వెర్షన్ చూశాను. చాలా బాగా నచ్చింది. వెంటనే యుఎస్‌ఏ హక్కులను తీసుకున్నాను. పక్కా ఎంటర్‌టైనింగ్ సినిమా అవుతుంది. ప్రతి దానికీ లెక్కలు చెప్పే మిడిల్ క్లాస్ అబ్బాయిగా ఈ సినిమాలో కనిపిస్తాను. తప్పకుండా ప్రేక్షకులు పడీ పడీ నవ్వుకుంటారు. మా డైరక్టర్ చాలా మంచి సినిమా చేశారు. దిల్‌రాజు గారు సపోర్ట్ చేసిన తీరు మర్చిపోలేం” అని అన్నారు.
నటీనటులు: సుహాస్, సంగీర్తన, రాజేంద్రప్రసాద్, గోపరాజు రమణ తదితరులు
సాంకేతిక బృందం:
బ్యానర్: దిల్‌రాజు ప్రొడక్షన్స్
సమర్పణ: శిరీష్
నిర్మాతలు: హర్షిత్ రెడ్డి, హన్షితా రెడ్డి
రచన – దర్శకత్వం: సందీప్ బండ్ల
సంగీతం: విజయ్ బుల్గానిన్
డీఓపీ: సాయి శ్రీరామ్
ఎడిటర్: కోదాటి పవన్ కల్యాణ్
ప్రొడక్షన్ డిజైనర్: అరసవిల్లి రామ్‌కుమార్
కాస్ట్యూమ్ డిజైనర్: భరత్ గాంధీ
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: అకుల్
పీఆర్‌ఓ: వంశీకాకా.