ఆర్ టీ టీం వర్క్స్, గోల్ డెన్ మీడియా పతాకాలపై మాస్ మహారాజా రవితేజ, సుధీర్ కుమార్ కుర్రు నిర్మించిన చిత్రం ‘సుందరం మాస్టర్’. ఈ చిత్రంలో హర్ష చెముడు, దివ్య శ్రీపాద ప్రధాన పాత్రలు పోషించారు. కళ్యాణ్ సంతోష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఫిబ్రవరి 23న విడుదలైంది. ఈ చిత్రానికి ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చి పెద్ద విజయాన్ని సాధించింది. ఈ సందర్భంగా శనివారం నాడు చిత్రయూనిట్ సక్సెస్ మీట్‌ను నిర్వహించింది. ఈ ఈవెంట్‌లో
హర్ష చెముడు మాట్లాడుతూ.. ‘ఈ కథను విని మాకు సపోర్ట్ చేసిన రవితేజ గారికి థాంక్స్. ఈ చిత్రాన్ని నిర్మించిన సుధీర్ అన్నకు థాంక్స్. సంధ్యలో సినిమాను చూసి శ్రీ చరణ్ పాకాల ఇచ్చిన ఆర్ఆర్‌కు ఎమోషనల్ అయ్యాను. ఈ చిత్రం కోసం ప్రతీ ఒక్కరూ ప్రాణం పెట్టి పని చేశారు. సంధ్యలో హౌస్ ఫుల్ చూడటంతో నాకు సంతోషమేసింది. ఫస్ట్ హాఫ్ అంతా నవ్వులతో ఎంజాయ్ చేశారు. సెకండాఫ్ అలా ఎమోషనల్‌గా కనెక్ట్ అయి చూశారు. ప్రతీ ఒక్కరూ మా సినిమాకు కనెక్ట్ అయ్యారు. ఇంకా చాలా మందికి ఈ సినిమా రీచ్ అవ్వాలి. ఇది మన అందరి విజయం. ఇంత మంచి సక్సెస్ ఇచ్చిన ప్రేక్షకులకు థాంక్స్. ఇక మా టీం అంతా సక్సెస్ టూర్‌లో అందరినీ కలుస్తామ’ని అన్నారు.
దర్శకుడు కళ్యాణ్ సంతోష్ మాట్లాడుతూ.. ‘థియేటర్లో ఆడియెన్స్ రెస్పాన్స్ చూసి ఆనందమేసింది. ఫ్యామిలీ అంతా కలిసి చూసేలా ఉందని అందరూ కాల్స్, మెసెజ్‌లు చేసి చెబుతున్నారు. అన్ని వర్గాల వారిని ఆకట్టుకుంటోంది. ఫిలాసఫీని ఇంత సింపుల్‌గా చెప్పడం బాగుందని ప్రశంసిస్తున్నారు. కలెక్షన్ల పరంగా కూడా ఎంతో సంతోషంగా ఉన్నాం. ఓవర్సీస్ ఏరియాల్లోనూ పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ రేంజ్ ఓపెనింగ్స్ వస్తాయని ఊహించలేదు. సినిమాను ఇంకా చూడని వాళ్లు చూసి మీ మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి’ అని అన్నారు.
నిర్మాత సుధీర్ కుమార్ మాట్లాడుతూ.. ‘సినిమా చూసి అందరూ కాల్స్, మెసెజ్‌లు చేస్తున్నారు. రేపటి నుంచి సక్సెస్ టూర్ పెట్టి ప్రతీ ఊరుకి వెళ్లాలని అనుకుంటున్నాం. జనాల నుంచి ఇంత రెస్పాన్స్ వస్తుందని ఊహించలేదు’ అని అన్నారు.
దివ్య శ్రీపాద మాట్లాడుతూ.. ‘మా మిర్యాలమెట్టలోని ప్రతీ ఒక్కరూ గుర్తుండిపోతారు. మా చిత్రం కోసం పని చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. మేం పడ్డకష్టానికి తగ్గ ప్రతిఫలం వచ్చినట్టు అనిపిస్తుంది’ అని అన్నారు.
శ్రీ చరణ్ పాకాల మాట్లాడుతూ.. ‘సుందరం మాస్టర్‌ను సుందరం బ్లాస్టర్ చేశారు. ఇంత పెద్ద విజయాన్ని అందించిన ప్రేక్షకులకు థాంక్స్. ఆశకి, అవసరానికి ఉన్న తేడాను చాలా చక్కగా చూపించాడు. నాకు ఈ చిత్రంలో అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్’ అని అన్నారు.