కొత్తగా మా ప్రయాణం ఫేమ్ ఈశ్వర్ హీరోగా, నైనా సర్వర్ హీరోయిన్, గా కథనం ఫేమ్ నాదెండ్ల రాజేష్ దర్శకత్వంలో. యోగా లక్ష్మి ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై అనిల్ కుమార్ కాట్రగడ్డ , ఎన్.ఎస్ రావు, విష్ణువర్ధన్ లు సంయుక్తంగా నిర్మిస్తున్న మాస్ యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ “సూర్యాపేట జంక్షన్” ఈ చిత్ర టీజర్ నీ హీరో ఈశ్వర్ విడుదల చేశారు.
ఈ సందర్భంగా హీరో ఈశ్వర్ మాట్లాడుతూ.. ఈరోజు చిత్ర టీజర్ నీ విడుదల చేయడం ఆనందంగా ఉంది టీజర్ చూసిన మీడియా మిత్రులు మా ఫ్రెండ్స్ చాలా బాగుంది అంటుంటే మా కష్టానికి ఊపిరి పోసినట్లు అనిపించింది. నా కథని నమ్మి రాజేష్ గారు నాతో రెండున్నర సంవత్సరాలు జర్నీ చేశారు ఈ ఔట్ పుట్ రావడానికి కారణం అయిన మా డైరెక్టర్ గారికి మా టీమ్ కి నా ప్రత్యేక కృతజ్ఞతలు.
సూర్యా పెట్ జంక్షన్ మూవీ ని ఒక యదార్థ కథతో సినిమాటిక్ గా మలుచుకుని సినిమా పూర్తి చేసాము మా టీజర్ మీడియా అందరూ చూసి అందరూ బాగుంది అని నాకు ఎలా సపోర్ట్ చేశారో మీరు అందరూ మా సూర్యాపేట్ జంక్షన్ నీ కూడా బాగా ప్రమోట్ చేసి జనాలలో చేరువ చెయ్యాలని నేను కోరుకుంటున్నాను. హీరోయిన్ నైన సర్వల్ బాగా సపోర్ట్ చేసింది మాతోటి ఆర్టిస్టుల యాక్టింగ్ గురించి చెప్పాలి అంటే ఒక్కొకరు ఎవరి పాత్రలో వాళ్ళు బాగా చేశారు మేము మా టెక్నీషిన్స్ అందరి సమిష్టి కృషి ఈ “సూర్యాపేట్ జంక్షన్” టీజర్ లాంచ్ ఫంక్షన్ కి వచ్చిన అందరికీ పేరు పేరు నా ధన్యవాదములు.
హీరోయిన్ నైన సర్వార్ మాట్లాడుతూ తెలుగులో ఈ అవకాశం ఇచ్చిన మా రాజేష్ సార్ కి ఈశ్వర్ గారికి చాలా థాంక్స్ సూర్యా పెట్ జంక్షన్ టీజర్ చాలా నచ్చింది. ఇప్పుడు నాకు ఈ చిత్రం మంచి సక్సెస్ అవుతుంది అని నమ్మకం గా ఉంది. మీడియా అందరూ మా సూర్యా పెట్ జంక్షన్ టీజర్ నీ సినిమా నీ బాగా ప్రమోట్ చేయ్యండి ప్లీస్ అందరికీ థాంక్స్
దర్శకుడు రాజేష్ మాట్లాడుతూ.. టీజర్ చాలా బాగుంది అంటుంటే హ్యాపీగా ఉంది. ఈ అవకాశం ఇచ్చిన మా ఈశ్వర్ గారికి నా కృతజ్ఞతలు మిగతా విషయలు ట్రైలర్ లో మట్లడతాను ఇక్కడికి వచ్చిన అందరికీ ధన్యవాదాలు.
ప్రొడ్యూసర్ నల్ల పల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ.. సినిమా బాగా వచ్చింది మీకు టీజర్ చూస్తే అర్దం అయ్యే ఉంటుంది మా డైరెక్టర్ హీరో హీరోయిన్ ఆర్టిస్ట్స్ టెక్నీషియన్స్ చాలా కష్టపడ్డారు ఈ చిత్రం చాలా మంచి సక్సెస్ అవుతుంది అని నమ్ముతున్నాను.
నటుడు భాషా మాట్లాడుతూ. ఈ అవకాశం ఇచ్చిన రాజేష్ గారికి ఈశ్వర్ గారికి కృతజ్ఞతలు అందరూ మమ్మల్ని సపోర్ట్ చెయ్యండి థాంక్యూ. ఈ కార్యక్రమానికి చిత్ర యూనిట్ పాల్గొన్నారు.
నటీనటులు : ఈశ్వర, నైనా సర్వార్, అభిమన్యు సింగ్, లక్ష్మణ్, బాషా, సూర్య,హరీష్, చలాకీ చంటి,మున్న వేణు, చమ్మక్ చంద్ర, కోటేశ్వర రావు,
సాంకేతిక నిపుణులు :
బ్యానర్ : యోగా లక్ష్మి ఆర్ట్ క్రియేషన్స్
టైటిల్ : సూర్యాపేట జంక్షన్
నిర్మాతలు : అనిల్ కుమార్ కాట్రగడ్డ , ఎన్.శ్రీనివాస రావు, విష్ణువర్ధన్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : పాండు అలిజాల
డైరెక్టర్ : యన్. రాజేష్
స్టోరీ : ఈశ్వర్
మ్యూజిక్ : రోషన్ సాలూరి, గౌర హరి
డి.ఓ.పి : అరుణ్ ప్రసాద్
ఎడిటర్ : ఎం.ఆర్.వర్మ
కో డైరెక్టర్ : శ్రీనివాస్
లిరిక్స్ : ఎ.రహమాన్
పోస్టర్ డిజైనర్ ధనియేలె
రైటర్స్ : సత్య, రాజేంద్ర భరద్వాజ్
పి. ఆర్. ఓ : కడలి రాంబాబు
డిజిటల్ : సెలబ్రిటీ మీడియా