హ్యాపీ బర్త్ డే టు ఐకాన్ స్టార్!!

మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నేటితో (ఏప్రిల్ 8) 40వ సంవత్సరంలోకి అడుగుపెట్టారు. ఈ ఆనందం అభిమానుల్లోనే కాదు… చిత్రసీమలోనూ నెలకొంది. అల్లు అర్జున్ ఫ్యాన్స్‌తో పాటు చిత్రసీమకు చెందిన ప్రముఖులెందరో ఐకాన్ స్టార్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అల్లు అర్జున్‌ ని ఎంతగానే ఇష్టపడే తన మావయ్య మెగాస్టార్ చిరంజీవి ఆయనకు స్పెషల్ బర్త్ డే విషెస్ తెలిపారు. అలాగే ‘పుష్ప 2’ లుక్ రాకింగ్ అంటూ ట్వీట్ కూడా చేయడంపై మెగాభిమానులు ఎంతగానో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అలాగే హీరోయిన్ లు రష్మిక మందన్నా, ప్రగ్యా జైస్వాల్ తదితరులు బర్త్ డే విషెస్ తెలిపారు.

చిరంజీవి ప్రోత్సాహంతో అల్లు అర్జున్ ‘డాడీ’ సినిమాతో తెరంగేట్రం చేసిన విషయం తెలిసిందే! ‘స్వాతి ముత్యం’, ‘విజేత’ సినిమాల్లో బాల నటుడిగా నటించిన అల్లు అర్జున్ ‘గంగోత్రి’ సినిమాతో హీరోగా తెరంగేట్రం చేశాడు. గంగోత్రి సినిమా కేవలం ఇంట్రడ్యూస్‌ వరకే పనికి వచ్చింది. ఆ తర్వాత సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఆర్య’ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ స్టేటస్ అందుకున్నాడు. ఆ చిత్రం తర్వాత హీరోగా వెనుదిరిగి చూసుకోలేదు. హీరోగా తన 20 ఏళ్ల కెరీర్‌లో 21 సినిమాల్లో నటించాడు. 19 సినిమాల్లో హీరోగా నటిస్తే.. మరో రెండు చిత్రాల్లో ముఖ్యపాత్రల్లో నటించాడు. ఇన్నేళ్ల కెరీర్‌లో ఇంతింతై అన్నట్టు లోకల్ లెవల్ నుంచి ప్యాన్ ఇండియా స్టార్‌గా ఎదిగి అందరి మనసులను గెలుచుకున్నారు.

అల్లు రామలింగయ్య మనవడిగా నిర్మాత అల్లు అరవింద్ తనయుడిగా అల్లు అర్జున్‌ తెరంగేట్రం బాగానే జరిగింది. అటు మెగా నట వారుసుడు హీరోగా టాలీవుడ్‌లో అడుగుపెట్టిన అల్లు అర్జున్..1983 ఏప్రిల్ 8న మద్రాసులో అల్లు అరవింద్, నిర్మల దంపతులకు జన్మించిన రెండో కుమారుడు. ‘గంగోత్రి’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి తొలి సినిమాతోనే సక్సెస్ ని రుచిచూశాడు. ముఖ్యంగా ‘ఆర్య’ చిత్రం కేరళలోని చాలా థియేటర్లలో 100 రోజులకు పైగా ఆడి రికార్డు సృష్టించింది. వెండితెరపై బన్ని అడుగుపెట్టినప్పుడు చాలా విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. బ‌హుశా తెలుగులో ఏ వార‌సుడిపై కూడా ఈ స్థాయి విమ‌ర్శ‌లు రాలేదు.

కానీ అల్లు అర్జున్‌పై వ‌చ్చాయి. గంగోత్రి విడుద‌లైన‌పుడు చాలా మంది తిట్టారు కూడా. కానీ అప్పుడు తిట్టిన నోళ్లే ఇప్పుడు ఆ హీరోను చూసి వావ్ అంటున్నాయి. తండ్రి తెలుగు చిత్రసీమను శాసిస్తున్న మెగాప్రొడ్యూసర్. మామ చిరు మెగాస్టార్ గా ప్రేక్షక నీరాజనాలందుకున్న నటుడు. అల్లు రామలింగయ్య గురించైతే చెప్పక్కర్లేదు. తనదైన హాస్యంతో తెలుగు తెరను ‘అల్లు’కుపోయిన గొప్ప నటుడు. ఇంత పెద్ద సపోర్టు ఉన్నా.. దాన్ని ఎంట్రీ వరకే వాడుకుని తాను పోషించే పాత్రలకు వందకు వంద శాతం న్యాయం చేస్తూ దూసుకుపోతున్నాడు. తాజాగా ఈ బర్త్ డే సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

ఈ సినిమాలో అడవిలో జంతువులు రెండుడుగులు ఎనక్కేసినాయంటే పులొచ్చిండాదని అర్ధం. అదే పులే రెండడుగులు ఎనక్కేసినాదంటే పుష్ప వచ్చిండాడని అర్ధం. అంటూ చెప్పిన డైలాగులు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. ఈ రోజు ఏప్రిల్ 8. ఈ సందర్బంగా మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు బర్త్ డే శుభాకాంక్షల వెల్లువ కొనసాగుతోంది. పుట్టినరోజు జరుపుకుంటున్న అల్లు అర్జున్‌కు మరోసారి మనం బర్త్ డే విషెస్ చెబుదాం…