అరవింద్ కృష్ణ, అలీ రెజా, ప్రతాప్ పోతన్, ఊర్వశీరాయ్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం `గ్రే`. ద స్పై హూ లవ్డ్ మి అనేది ట్యాగ్‌లైన్. రాజ్ మదిరాజు దర్శకత్వం వహించారు. అద్వితీయ మూవీస్ ప్రై.లి పతాకంపై ప్రొడక్షన్ నెం.1గా కిరణ్ కాళ్లకూరి నిర్మించారు. పలు అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్స్‌కు ఎంపికైన ఈ మూవీ మే 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో..
చిత్ర దర్శకుడు రాజ్ మదిరాజు మాట్లాడుతూ – “కొన్నేళ్ల క్రితం మనదేశంలో రెండేళ్ల వ్యవధిలో దాదాపు 12మంది న్యూక్లియర్ సైంటిస్టులు కనపడకుండా పోయారు. ఇలా గతంలో కూడా చాలా సార్లు జరిగింది. వీటన్నింటికి కారణం ఏంటంటే..ఫారెన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సిస్ వారు చాలా జాగ్రత్తగా వలపన్ని చేసిన ఆపరేషన్స్. అందులోనుండి పుట్టిన ఐడియానే గ్రే మూవీ. దాదాపు 40 ఏళ్ల తర్వాత బ్లాక్ అండ్ వైట్‌లో వస్తున్న చిత్రమిది. దానికోసం అన్ని అంశాలను రీసెర్చ్ చేయడం జరిగింది. ప్రతి ఆలోచన వెనుక మన ఆలోచనలకు కూడా అందని కొన్ని వింతైన ఎక్స్‌ప్రెషన్స్ ఉంటాయి. అదే ఈ స్పై డ్రామా. ఈ చిత్రాన్ని పీవీఆర్ పిక్చర్స్ వారు రిలీజ్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. మే 26న రిలీజవుతున్న గ్రే సినిమాని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను“ అన్నారు.
హీరో అరవింద్ కృష్ణ మాట్లాడుతూ – “రాజ్ గారు చాలా రీసెర్చ్ చేసి గ్రే సినిమా రూపొందించారు. యాక్టర్స్ అందరికీ పూర్తి స్వేచ్చను ఇచ్చి నటింపజేశారు. అలీతో కలిసి నటించడం హ్యాపీగా ఉంది. ఊర్వశీకి మంచి భవిష్యత్ ఉంటుంది. ప్రతాప్ గారితో నటించడం అద్భుతమైన ఎక్స్‌పీరియన్స్. ప్రస్తుతం తెలుగు ప్రేక్షకులు ఇలాంటి సినిమాల కోసమే ఎదురుచూస్తున్నారు. గ్రే సినిమా మీ అందరి అంచనాలను అందుకోవాలని కోరుకుంటున్నాను“ అన్నారు.
నిర్మాత కిరణ్ కాళ్లకూరి మాట్లాడుతూ – “`గ్రే` ఒక పర్‌ఫెక్ట్ స్పై మూవీ..మంచి క్యాస్టింగ్ కుదిరింది. సినిమాని ఇంత బాగా తీసిన రాజ్ మదిరాజుగారికి, ఆయనకి పూర్తి సహకారం అందించిన మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ మహేశ్ చదలవాడ గారికి థ్యాంక్స్. వీలైనంత ఎక్కువ మంది కొత్త ఆర్టిస్టులు, టెక్నీషియన్స్‌ని వెండితెరకు పరిచయంచేయాలనే ఉద్దేశ్యంతో అద్వితీయ మూవీస్ బ్యానర్‌ని స్థాపించడం జరిగింది. ప్రస్తుతం మా బేనర్‌లో మూడు సినిమాలు తెరకెక్కుతున్నాయి“ అన్నారు.
నటీనటులు : ప్రతాప్ పోతన్, అరవింద్ కృష్ణ, అలీ రెజా, ఊర్వశీరాయ్, రాజ్ మదిరాజు, షాని సాల్మోన్, నజియా, సిద్ధార్థ్
సాంకేతిక నిపుణులు
రచన- దర్శకత్వం: రాజ్ మదిరాజు
నిర్మాత: కిరణ్ కాళ్లకూరి, మాధురి కాళ్లకూరి
సహ నిర్మాత: రాజేష్ తోరేటి, రాజా వశిష్ట, శ్రీదేవి కాళ్లకూరి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఉమామహేశ్వర్ చదలవాడ
సినిమాటోగ్రాఫర్: ఎమ్ ఆర్ చేతన్ కుమార్
ఆర్ట్ డైరెక్టర్: రాజీవ్ నాయర్
మ్యూజిక్: నాగరాజు తాల్లూరి
ఎడిటర్: సత్య గిదుటూరి
మేకప్: విమలా రెడ్డి
యాక్షన్: వింగ్ చున్ అంజి
ప్రొడక్షన్ మేనేజర్: సంజయ్
కాస్ట్యూమ్ డిజైనర్: హేమంత్ సిరి
పీఆర్ఓ: శ్రీను-సిద్ధు.