Ghaati: క్వీన్ అనుష్క శెట్టి రస్టిక్ యాక్షన్ థ్రిల్లర్ ‘ఘాటి’ సినిమా సెప్టెంబర్ 5న థియేటర్లలోకి రానుంది. టీజర్, ట్రైలర్, బ్లాక్ బస్టర్ పాటలతో ఇప్పటికే సినిమా హ్యాజ్ బజ్ క్రియేట్ చేసింది. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మాణంలో, UV క్రియేషన్స్ సమర్పిస్తున్న ఈ చిత్రం ప్రమోషన్స్ ప్రస్తుతం జోరుగా జరుగుతున్నాయి.
అనుష్క శెట్టి, డైరెక్టర్ క్రిష్ ఇద్దరికీ స్నేహితుడైన రానా దగ్గుబాటి ఈ చిత్రం గురించి అనుష్క తో ఫోన్ కాల్ లో మాట్లాడారు. సినిమా కంటెంట్, తన పాత్ర గురించి అడిగినప్పుడు, అనుష్క ఘాటీ విశేషాలు పంచుకుకున్నారు.
“ఘాటి వైలెంట్, ఇంటెన్స్ మూవీ. ఇందులోని వయోలెన్స్‌ను పక్కన పెడితే ఈ కథ ఇప్పటి సమాజంలోని పరిస్థితులకు సరిపోతుంది. ఇలాంటి కథకు ఇది సరైన సమయం అని భావిస్తున్నాను. బాహుబలి, అరుంధతి తర్వాత వరుసలో ఘాటీ నిలిస్తుంది.
కథ ఆంధ్ర-ఒడిశా సరిహద్దులో జరుగుతుంది. ఈ బ్యాక్ డ్రాప్, విజువల్స్ ఆడియన్స్ కి చాలా కొత్త అనుభూతిని అందిస్తాయి. ప్రారంభంలో ఇది ఒక సమూహం కథగా వుంటుంది. అయితే కథ జూమ్ అయ్యే కొద్దీ వ్యక్తిగతంగా మారుతుంది. దేశీ రాజు, శీలావతి క్యారెక్టర్స్ జర్నీని క్రిష్ గారు అద్భుతంగా తీర్చిదిద్దారు. ఇందులో ప్రతిది ఆర్గానిక్ గా ఉంటుంది.
కథలో అద్భుతమైన ట్రాన్ఫర్మేషన్ వుంది. బాధితురాలు తన దారి తానే ఎంచుకున్నప్పుడు, ఆమె క్రిమినల్ అవుతుంది. కానీ ఆ ప్రయాణంలోనుంచి లేచి, ఒక లెజెండ్‌గా మారుతుంది. అదే రిడంప్షన్ ఆర్క్. మనం కోల్పోయిన దాంట్లోంచి మళ్లీ లేచినప్పుడే మనం మరింత గొప్పగా మారతాం. ఈ కథను చెప్పిన తీరు నిజంగా అద్భుతంగా ఉంది.
క్రిష్ గారు నాకెప్పుడూ గొప్ప పాత్రలు ఇస్తారు. ‘వేదం’లో సరోజ కూడా చాలా సున్నితమైన పాత్ర. దాన్ని ఆయన గొప్పగా చూపించారు. నా కెరీర్‌లో గుర్తిండిపోయే పాత్రల్లో అదీ ఒకటి. ఇప్పుడు ఘాటీ లో శీలావతి కూడా అలాంటి మెమరబుల్ క్యారెక్టర్.
అలాగే ఈ ఏడాది చివర్లోనే వరుసగా కొత్త ప్రాజెక్టులు చేస్తానని అనుష్క కన్ఫర్మ్ చేశారు.
రానా దగ్గుబాటి మాట్లాడుతూ… కొద్ది రోజుల క్రితం చెన్నైలో డిన్నర్ టైమ్‌లో క్రిష్‌ని కలిసాను. అప్పుడు ఆయన ఈ సినిమా గురించి చాలా ఎక్సైటెడ్‌గా మాట్లాడారు. ‘ఘాటి’ ప్రీమియర్‌కి తప్పకుండా వస్తా.

