‘అన్నీ మంచి శకునములే’ నుంచి పాట విడుదల

స్వప్న సినిమా ప్రొడక్షన్ హౌస్ కథల ఎంపికలో ఎంత జాగ్రత్త తీసుకుంటుందో సంగీతం విషయంలో కూడా అంతే జాగ్రత్త తీసుకుంటుంది. స్వప్న సినిమా వారి గత సినిమాలన్నీ మ్యూజికల్ హిట్స్. ఇప్పుడు నందిని రెడ్డి దర్శకత్వంలో సంతోష్ శోభన్ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘అన్నీ మంచి శకునములే’ సినిమా కూడా థియేటర్లలోకి రాకముందే మ్యూజికల్ హిట్ అవుతోంది.

సినిమాలోని మొదటి రెండు పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ రోజు థర్డ్ సింగిల్‌ గల గల ఏరులా పాటని విడుదల చేసారు. ఈ డ్రీమీ నెంబర్ ప్లజంట్ గా ప్రారంభమైయింది. మిక్కీ జే మేయర్ తనదైన శైలిలో శ్రోతలని మెస్మరైజ్ చేసే నెంబర్ ని కంపోజ్ చేశారు. విభిన్న వాయిద్యాలతో పాటని చాలా రిచ్ గా ఆర్కెస్ట్రేషన్ చేశారు. రెహ్మాన్ లిరిక్స్ రాశారు. నకుల్ అభ్యంకర్, రమ్య భట్ అభ్యంకర్ గానం మరింత ఆకర్షణని తీసుకొచ్చింది.

ఇటలీలోని కొన్ని అందమైన లొకేషన్లలో ఈ పాట చాలా ప్లజంట్ గా చిత్రీకరించారు. సంతోష్ శోభన్, మాళవిక నాయర్ ఉత్సాహంగా కనిపించారు. వారి కెమిస్ట్రీ చూడముచ్చటగా వుంది. కొరియోగ్రఫీ చక్కగా ఉంది.

అన్నీ మంచి శకునములే చిత్రంలో రాజేంద్రప్రసాద్, రావు రమేష్, నరేష్, గౌతమి, సౌకార్ జానకి, వాసుకి పలువురు ప్రముఖ నటీనటులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

మిత్ర విందా మూవీస్‌తో కలిసి ప్రియాంక దత్ ఈ చిత్రాన్ని నిర్మించారు. దావూద్ స్క్రీన్ ప్లే అందించగా, లక్ష్మీ భూపాల డైలాగ్ రైటర్. దివ్య విజయ్ ఎగ్జిక్యూటివ్ నిర్మాత.

మే 18న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

తారాగణం: సంతోష్ శోభన్, మాళవిక నాయర్, రాజేంద్ర ప్రసాద్, రావు రమేష్, నరేష్, గౌతమి, షావుకారు జానకి, వాసుకి, వెన్నెల కిషోర్, రమ్య సుబ్రమణియన్, అంజు అల్వా నాయక్, అశ్విన్ కుమార్ తదితరులు

సాంకేతిక విభాగం:
దర్శకత్వం: బివి నందిని రెడ్డి
నిర్మాత: ప్రియాంక దత్
బ్యానర్లు: స్వప్న సినిమా, మిత్ర విందా మూవీస్
సంగీతం: మిక్కీ జె మేయర్
డీవోపీ: సన్నీ కూరపాటి
డైలాగ్ రైటర్: లక్ష్మీ భూపాల
కాస్ట్యూమ్ స్టైలిస్ట్: పల్లవి సింగ్
స్క్రీన్ ప్లే రైటర్: దావూద్
ప్రొడక్షన్ డిజైనర్: శివమ్ రావు
పీఆర్వో: వంశీ శేఖర్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: దివ్య విజయ్