రామ్, మాయా కృష్ణన్, రన్‌వే ఫిల్మ్స్ ప్రొడక్షన్ నెం 2 ‘ఫైటర్ రాజా’ ప్రారంభం- ఫస్ట్ లుక్ లాంచ్

రామ్, మాయా కృష్ణన్ ప్రధాన పాత్రలలో కృష్ణ ప్రసాద్ దర్శకత్వంలో రన్‌వే ఫిల్మ్స్ ప్రొడక్షన్ నెం 2 పూజా కార్యక్రమాలతో గ్రాండ్ గా ప్రారంభమైయింది. దినేష్ యాదవ్, పుష్పక్ జైన్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘ఫైటర్ రాజా’ అనే క్యాచి టైటిల్ ఖరారు చేశారు. రామ్, మాయా కృష్ణన్, తనికెళ్ళ భరణి ఇలా ప్రధాన తారాగణంపై గన్స్ తో డిజైన్ చేసిన ఫైటర్ రాజా ఫస్ట్ లుక్ చాలా క్రేజీగా వుంది. టైటిల్ ఫస్ట్ లుక్ లాంచ్ ఈవెంట్ కు ‘ఓం భీమ్ బుష్’ టీం హీరో శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ హాజరయ్యారు.

ఫస్ట్ లుక్ లాంచింగ్ ఈవెంట్ లో హీరో శ్రీవిష్ణు మాట్లాడుతూ.. రామ్ అండ్ టీం అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. ఈ సినిమా టీం అందరికీ కూడా మంచి పేరుతీసుకురావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది వెరీ బెస్ట్ ‘ తెలిపారు.

తనికెళ్ళ భరణి మాట్లాడుతూ.. ఇందులో చాలా రోజుల తర్వాత చాలా భిన్నమైన పాత్ర చేస్తున్నాను. దర్శకుడు కృష్ణ ప్రసాద్ ఈ కథ చెప్పినప్పుడు చాలా నచ్చింది. సినిమా తీస్తున్నపుడు తనలో చాలా ప్రతిభ వుందని తెలుసుకున్నాను. ఈ సినిమా చాలా రియలిస్టిక్ గా వుంటుంది. యూత్ ని ఆకట్టుకునే సినిమా అవుతుంది. సినిమా అందరికీ మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను.

ప్రియదర్శి మాట్లాడుతూ.. ఈ కథ గురించి నాకు తెలుసు. చాలా మంచి కథ. సినిమాలో పనిచేసే స్టంట్ మెన్ కి మంచి ట్రిబ్యుట్ లాంటి కథ. రామ్ కి ఆల్ ది బెస్ట్. టీం అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. పోస్టర్ లో తనికెళ్ళ భరణి గారిని చూసినప్పుడు శివ సినిమా గుర్తుకు వచ్చింది” అన్నారు.

రాహుల్ రామకృష్ణ మాట్లాడుతూ.. రామ్ ఎప్పటినుంచో పరిచయం. ఇప్పుడు ఫైటర్ రాజా రో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. పోస్టర్ చాలా బావుంది. టీం అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్” తెలిపారు.

దర్శకుడు కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ.. నన్ను నమ్మి నా వెంటే వున్న రామ్, దినేష్ కి ధన్యవాదాలు. చాలా మంచి నటీనటులుతో చేస్తున్న సినిమా ఇది. మంచి సినిమా ఇది. తప్పకుండా మీ అందరికీ నచ్చుతుందనే నమ్మకం వుంది.

మిర్యాల రవీందర్ రెడ్డి మాట్లాడుతూ.. రామ్ ఇంతకుముందు పచ్చీస్ అనే సినిమా చేశాడు. ఇప్పుడు ఫైటర్ రాజాతో వస్తున్నాడు. ఈ సినిమా పెద్ద విజయం సాధించి తనకు, టీంకు మంచి పేరు తీసుకురావాలని కోరుకున్నారు.

హీరో రామ్ మాట్లాడుతూ.. ప్యాషన్ డిజైనర్ గా పరిశ్రమలో మంచి పేరు తెచ్చుకున్నాను. పచ్చీస్ నటుడిగా నా మొదటి సినిమా. కోవిడ్ కారణంగా ఓటీటీలో విడుదలైయింది. కానీ ఫైటర్ రాజా థియేటర్స్ లో సందడి చేస్తుంది. ఇందులో అన్ని ఎంటర్ టైన్మెంట్ ఎలిమెంట్స్ వున్నాయి. తప్పకుండా విజల్స్ పడతాయి. అందరూ తప్పకుండా థియేటర్స్ లో చూసే సినిమా. చాలా మంచి యంగ్ టీంతో పని చేశాం. శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ గారు ఈ వేడుకకు వచ్చి సపోర్ట్ చేయడం చాలా ఆనందంగా వుంది. తనికెళ్ళ భరణి గారి పని చేయడం చాలా మంచి అనుభవం. ఇందులో ఆయన లుక్ నేనే క్రియేట్ చేశాను. పుష్పక్ జైన్ ని నా జీవితంలో మర్చిపోలేను, ఆయన వలనే సినిమా మొదలైయింది. దినేష్ కూడా చాలా పాషన్ తో సినిమా చేశారు. చాలా క్యాలిటీగా సినిమా చేశాం. విక్రమ్ ఫేం మాయ మా ప్రాజెక్ట్ లో నటించడం ఆనందంగా వుంది. ఈ నెలలోనే టీజర్ లాంచ్ చేస్తున్నాం” అని తెలిపారు.

మాయా మాట్లాడుతూ.. ఫైటర్ రాజాతో తెలుగు పరిశ్రమలోకి అడుగుపెట్టడం ఆనందంగా వుంది. ఈ సినిమాలో అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు. చాలా మంచి కథ ఇది. ఇందులో నేను చేసిన లక్కీ పాత్ర చాలా ప్రత్యేకంగా వుంటుంది. సినిమా తప్పకుండా అందరినీ అలరిస్తుంది” అన్నారు.

తారాగణం: రామ్, మాయా కృష్ణన్, తనికెళ్ల భరణి, చక్రధర్, శివ, నందు, రోషన్, తాగుబోతు రమేష్, సత్య ప్రకాష్, విజయ్, కృష్ణ తేజ, శశిధర్, రాము, లక్ష్మణ్ తదితరులు

రచన, దర్శకత్వం: కృష్ణ ప్రసాద్
బ్యానర్: రన్‌వే ఫిల్మ్స్
నిర్మాతలు: దినేష్ యాదవ్, పుష్పక్ జైన్
సంగీతం: సమ్రన్ సాయి
డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ – శ్రీధర్ కాకిలేటి
ఎడిటర్: హరి శంకర్,అవంతి రుయా
ప్రొడక్షన్ డిజైనర్ : రోహన్ సింగ్
కొరియోగ్రఫర్: విజయ్ బిన్నీ
యాక్షన్: పృథ్వీ
పీఆర్వో: వంశీ శేఖర్